bomb blast incident
-
పేలుడు కేసు నిందితుడికి ఎంఏ గోల్డ్‌మెడల్
గువాహటి: బాంబు పేలుడు ఘటనలో నిందితుడిగా జైలులో ఉన్న మాజీ విద్యార్థి ఒకరికి అస్సాం గవర్నర్ బంగారు పతకం అందజేశారు. 2019లో గువాహటిలో తీవ్రవాద సంస్థ ఉల్ఫా జరిపిన బాంబు పేలుడు ఘటనలో నిందితుల్లో ఒకరైన సంజీవ్ తాలూక్దార్ (29) ప్రస్తుతం జైలులో ఉన్నాడు. జైల్లోంచే ఓపెన్ యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో ఎంఏ పూర్తి చేశాడు. అంతేగాక అత్యధికంగా 71% మార్కులు సాధించాడు! గురువారం జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ జగ్దీశ్ ముఖి చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాడు. -
మాస్కో విమానంలో బాంబు కలకలం... అప్రమత్తమైన అధికారులు
న్యూఢిల్లీ: మాస్కో విమానంలో బాంబు కలకలం సృష్టించింది. ఢిల్లీలోని అంతర్జాతీయ మిమానాశ్రయానికి గురువారం రాత్రి 11.15 నిమిషాలకు మాస్కో విమానంలో బాంబు ఉందంటూ ఈమెయిల్ హెచ్చరికి వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో అధికారులు భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేశారు. అంతేగాదు విమానాశ్రయ భద్రతను కూడా పెంచారు. ఈ మేరకు విమానం ఎస్‌యూ 232 శుక్రవారం తెల్లవారుజామున 3.20 గం.లకు మాస్కో నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ విమానంలో ప్రయాణిస్తున్న దాదాపు 386 మంది ప్రయాణికులను సుమారు 16 మంది సిబ్బందిని తక్షణమే దించేశారు. విమానం మొత్తం తనీఖీ చేయడం ప్రారంభించారు అధికారులు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. అచ్చం అలానే గతనెల సెప్టెంబర్10న లండన్‌కి వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసింది. (చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్) -
అంతా మిస్టరీ!
కర్నూలు: కర్నూలు శివారులోని జొహరాపురం రస్తాలో మంగళవారం చోటుచేసుకున్న బాంబు పేలుడు ఘటన దర్యాప్తుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఘటనలో చనిపోయిన జంపాల రాజశేఖర్, మల్లికార్జున, ఏఎస్ఐ శ్రీనివాసులు మృతదేహాలకు బుధవారం కర్నూలు సర్వజనాస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం పూర్తి చేశారు. ఫొరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మీనారాయణ నేతృత్వంలో అసిస్టెంట్లు శంకర్ నాయక్, రాజశేఖర్ ఈ ప్రక్రియ పూర్తి చేసి..మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాల్లో ఇనుప గోలీలు, మేకులు, గాజు పెంకులు, ఇతర మందు గుండు సామగ్రి ఆనవాళ్లు ఉండటంతో పేలింది నాటు బాంబులేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కర్నూలు డీఎస్పీ యుగంధర్ బాబు, మూడో పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం ఉదయం నుంచి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యే వరకు అక్కడే ఉండి శాంతిభద్రతలను పర్యవేక్షించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేలుడు నిరోధక చట్టం, ఐపీసీ 304 క్లాజ్–2 సెక్షన్ కింద మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. శరీర భాగాలు హైదరాబాద్ పరీక్ష కేంద్రానికి.. బాంబు పేలుడులో మృతిచెందిన రాజశేఖర్, మల్లికార్జున, ఏఎస్ఐ శ్రీనివాసులు మృతదేహాల్లోని కొన్ని భాగాలను హైదరాబాదులోని ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపారు. గాజుపెంకులు, ఇనుప గోలీలు, ఇనుప మేకులు తదితర వాటిని కూడా శరీర భాగాల నుంచి వెలికితీసి.. దాదాపు 20 బాటిళ్లలో భద్రపరచి పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. వాటి రిపోర్టు రావాల్సి ఉంది సవాలుగా మారిన దర్యాప్తు బాంబు పేలుడు ఘటన దర్యాప్తు పోలీసులకు సవాలుగా మారింది. దర్యాప్తు బాధ్యతలను ఎస్పీ గోపీనాథ్ జట్టి..కర్నూలు డీఎస్పీ యుగంధర్ బాబుకు అప్పగించారు. సంఘటన జరిగి రెండు రోజులు గడిచినప్పటికీ పోలీసులు దర్యాప్తుపై దృష్టి సారించలేకపోతున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినందున గురువారం నుంచి దర్యాప్తుపై దృష్టి సారిస్తామని డీఎస్పీ తెలిపారు. కాగా.. జన సంచారం లేని ప్రాంతంలో ఘటన జరిగినందున పోలీసులకు కేసు దర్యాప్తు సవాలుగా మారింది. ఏవైనా భారీ ఘటనలు, దాడులు, ప్రమాదాలు, హత్యలు, దోపిడీలు జరిగినప్పుడు ప్రధానంగా సీసీ కెమెరాలపై ఆధారపడి దర్యాప్తు సాగిస్తారు. అయితే పేలుడు ప్రాంతంలో ఆ అవకాశం లేకపోవడంతో మిస్టరీ ఛేదన కష్టసాధ్యంగా మారింది. ఏడాదిన్నర క్రితం ఇదే తరహాలో జూపాడుబంగ్లా ప్రాంతంలో మూడు నాటు బాంబులు పేలాయి. దీని గురించి ఆరా తీయగా.. అడవి పందులను చంపేందుకు పెట్టినట్టుగా తేలింది. కాగా.. ఐదు బృందాలను రంగంలోకి దింపి ఈ కేసు దర్యాప్తు చేపట్టాలని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. బాంబులు పేలిన ప్రాంతంలో స్టీల్ బకెట్ ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. బాంబు తయారీదారులపై ఆరా బాంబు పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా జిల్లాలో బాంబుల తయారీదారులు ఎవరెవరు ఉన్నారు.. వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు.. అనే విషయాలపై జిల్లా వ్యాప్తంగా పోలీసు బృందాలు ఆరా తీస్తున్నాయి. ప్రధానంగా నందికొట్కూరు, కోడుమూరు, పత్తికొండ, ఆళ్లగడ్డ, బనగానపల్లె ప్రాంతాల్లో దృష్టి కేంద్రీకరించి.. ఆరా తీస్తున్నట్లు సమాచారం. బాంబు పేలుడు తీవ్రతను బట్టి మందు పాతరగానూ పోలీసులు అనుమానిస్తున్నారు. 2013లో సల్కాపురం వద్ద కోడుమూరుకు చెందిన ఎరుకలి వెంకట్రాముడుపై బాంబు దాడి అనంతరం జిల్లాలో ఎక్కడా బాంబులతో హత్యలు చేసిన సంఘటనలు లేకపోవడం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాంబు పేలుడు ఘటన ప్రశాంతంగా ఉన్న జిల్లాలో అలజడి రేపింది. ఫ్యాక్షన్ నాయకుల ఆగడాలపై జనంలో మళ్లీ చర్చ మొదలయ్యింది. -
అల్‌ఖైదా ఉగ్రవాదుల విచారణ
నెల్లూరు (క్రైమ్): బాంబు పేలుళ్ల ఘటనలో అల్‌ఖైదా ఉగ్రవాదులను వీడియో కాన్ఫరెన్స్ (వీడియో లింకేజీ) గురువారం విచారించారు. నెల్లూరు కోర్టులో బాంబు పేలుడు ఘటనలో నిందితులైన అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన ఎ.అబ్బాస్ అలీ, షంషూన్ కరీం రాజా, మహ్మద్ అయూబ్, దావూద్ సులేమాన్, షంషుద్దీన్ అలియాస్ కరువ షంషుద్దీన్‌ను చిత్తూరు జిల్లా జైలు నుంచి ఈ నెల 15న నెల్లూరు నాలుగో నగర పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వారిని నెల్లూరు కోర్టులో హాజరు పర్చగా మార్చి 1 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పోలీసు కస్టడీకీ అనుమతిస్తూ కోర్టు ఇచ్చిన కోర్టు ఉత్తర్వులు మేరకు ఈ నెల 18న నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నారు. కర్ణాటకలోని మైసూర్, కేరళలోని కొల్లాం, మలపురం, ఏపీలోని చిత్తూరు కోర్టులో బాంబు పేలుళ్లలకు వీరు పాల్పడ్డారు. దావూద్ సులేమాన్ ప్రధాన సూత్రధారిగా వారు అను మానిస్తున్నారు. ఆదివారం ప్రధాన నిందితుడిని కోర్టు ప్రాంగణంలోకి తీసుకెళ్లి బాంబు పేలుడు ఎలా చేశారనే వివరాలను విచారించారు. ఈ కేసులకు సంబంధించి గురువారం కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఎన్ఐఏ కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే నిందితులు నెల్లూరు పోలీసుల కస్టడీలో ఉండటంతో నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించేలా ఎన్ఐఏ చర్యలు తీసుకుంది. -
పోలీసుల అదుపులో బాంబు కేసు నిందితులు
చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో పోలీసులు ఐదుగురు పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 7వ తేదీన చిత్తూరు కోర్టులో బాంబు పేలడం, ఓ న్యాయవాది గుమస్తా గాయపడిన విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇప్పటికే మేయర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ అనుచరులను, కటారి వర్గీయులను విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 2007లో చిత్తూరు సీకే.బాబుపై మందుపాతర దాడి ఘటన కేసులో ప్రధాన నిందితులుగా కటారి మోహన్, చింటూ, కటారి ప్రవీణ్‌లతో పాటు మాజీ నక్సల్స్ కూడా ఉన్నారు. శుక్రవారం చిత్తూరు కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. కేసు విచారణకు చింటూ తప్ప మిగిలిన నిందితులు హాజరయ్యారు. వీరిలో రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌కు చెందిన ఐదుగురిని వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీకే.బాబుపై జరిగిన మందుపాతర ఘటన, కోర్టులో జరిగిన బాంబు పేలుడు రెండూ ఒకేలా ఉండడంతో వీరికి సంబంధాలు ఉన్నాయా..? అనే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు.