
జార్ఖండ్‌ను వణికించిన భారీ పేలుడు
రాంచీ : జార్ఖండ్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ పేలుళ్లు వణికించాయి. ఐఈడీ పేలుడుతో 11 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. సరైకెల్లాలోని కుచాయ్ ప్రాంతంలో నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలడంతో ఆ సమయంలో స్పెషల్ ఆపరేషన్స్‌లో నిమగ్నమైన భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విమానాల్లో రాంచీలోని ఆస్పత్రులకు తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. జార్ఖండ్‌లో నక్సల్స్ ఏరివేతకు భద్రతా సిబ్బంది, పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌కు ప్రతీకారంగా గతవారంలోనూ నక్సల్స్ ముగ్గురు భద్రతా సిబ్బందిని హతమార్చారు.