
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గురువారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృత్యువాతపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్- బీజాపూర్ సరిహద్దుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని నారాయణపూర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) ప్రభాత్ కుమార్ తెలిపారు. అయితే మరణించిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది.
వరస ఎన్‌కౌంటర్లు..
ఇటీవల ఛత్తీస్‌గడ్ అడవులను భద్రతాదళాలు జల్లెడ పడుతున్నాయి. వరస ఎన్‌కౌంటర్లలో అనేక మంది మావోయిస్టులు ప్రాణాలు విడుస్తున్నారు. గత నెల ఏప్రిల్ 16, 30వ తేదీల్లో చోటుచేసుకున్న భారీ ఎన్‌కౌంటర్లలో 39 మంది మావోయిస్టులు చనిపోవడం తెలిసిందే. బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాదిలో వివిధ ఎన్‌కౌంటర్లలో103 మంది నక్సల్స్ చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment