security force
-
భారీ ఎన్కౌంటర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దండకారణ్యంలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా భెజ్జి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళలు సహా పది మంది మావోయిస్టులు మరణించారు. ఈ ప్రాంతం ఏపీ, తెలంగాణ సరిహద్దుగా ఉండడంతో మూడు రాష్ట్రాల పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. భెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరాజ్‌గూడ, దంతేస్పురం, నగరం, భండార్‌పదర్ గ్రామాల మధ్య అడవుల్లో కుంట– కిష్టారం ఏరియా నక్సల్స్ కమిటీ సమావేశమైంది. నక్సలైట్ల సమావేశంపై పక్కా సమాచారం అందుకున్న జిల్లా, కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. శుక్రవారం ఉదయం భండార్‌పదర్ గ్రామ సమీపంలో మావోలకు పోలీసులు ఎదురుపడ్డారు. దీంతో ఒక్కసారిగా పరస్పర కాల్పులు మొదలయ్యాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కాల్పులు కొనసాగాయి. ఇందులో పది మంది మావోయిస్టులు చనిపోయారని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్రాజ్ ప్రకటించారు. మృతుల్లో డివిజినల్ కమిటీ సభ్యుడు మద్కం మాసా, మాసా భార్య దుధీ హునీ, ఏరియా కమిటీ సభ్యురాలు లఖ్మా మాధవి, గార్డ్ కొవసీ కోసా, మద్కం జితూ, మద్కం కోసీలుగా గుర్తించారు. మద్కం మాసాపై రూ.8 లక్షలు, లఖ్మాపై రూ.5 లక్షల రివార్డ్ ఉంది. మిగతా నలుగురిని గుర్తించాల్సి ఉంది. ఘటనస్థలం నుంచి ఇన్సాస్, ఏకే 47, ఎస్ఎల్ఆర్, బ్యారెల్ గ్రనేడ్ లాంఛర్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మావోలపై ఉక్కుపాదందేశంలో 2026 మార్చి నాటికి మావోయి స్టులను అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఫలితంగా ఈ ఏడాది ఇప్పటివరకు బస్తర్ డివిజన్లో జరిగిన ఎన్కౌంటర్లలో 207 మంది మావోలు చనిపోగా 787 మంది అరెస్ట్ అయ్యారు. 789 మంది లొంగిపోయారు. దీంతో బస్తర్ అడవుల్లో సంచరించడం మావో యిస్టు దళాలకు కష్టంగా మారింది. నిర్బంధం పెరగడంతో దండకారణ్యం, అబూజ్మడ్ అడవుల నుంచి ఇతర రాష్ట్రాల్లోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు మావోలు ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో పోలీసులు నిఘా పెంచారు. శుక్రవారం ఛత్తీస్‌గఢ్ – ఒడిశా సరిహద్దు మల్కన్‌గిరి జిల్లాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు చనిపోయాడు.తెలుగు మాట్లాడే ప్రాంతంలో..ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం ఏపీలోని చింతూరు, తెలంగాణలోని దుమ్ముగూడెం ప్రాంతాలకు సరిహద్దుగా ఉంది. ఇక్కడ ఉన్న ఆదివాసీ గ్రామాల పేర్లు తెలుగులో ఉండడమే కాక వారు తెలుగు కూడా మాట్లాడగలరు. ఉపాధి, విద్య, వైద్యం, నిత్యావసరాల కోసం ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు వచ్చివెళ్తుంటారు. ఈ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరగడంతో ఏపీ, తెలంగాణలోని సరిహద్దు గ్రామాల్లో ఆందోళన నెలకొంది. సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ నిఘా పెరిగిపోవడంతో ఈ గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా గాలిస్తున్నా ఇప్పటికీ మావోయిస్టు అగ్రనా యకత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లకపోవడం ఒక్కటే మావోయిస్టులకు ఊరటనిస్తోంది. -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి కొనసాగుతున్న ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు తాజాగా ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. ప్రస్తుతం ఆప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ఆర్మీ జవాను గాయపడ్డారు.ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని పంచుకుంది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా సరిహద్దు జిల్లా లోలాబ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.కుప్వారాలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించిన నిర్దిష్ట ఇన్పుట్ల ఆధారంగా భారత సైన్యం, జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్త సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. తాజాగా భద్రతా బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మృతిచెందాడు. లోలాబ్‌లో ఉగ్రవాదుల కదలికలపై భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీని ఆధారంగా కుప్వారా పోలీసులు ఆర్మీకి చెందిన 28, 22 రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. Chinar Corps, Indian Army tweets, "Based on specific input regarding presence of terrorists in general area Kowut, Kupwara, a Joint Search Operation was launched by Indian Army and J&K Police on days leading upto 23 July 24. On 24 July, suspicious movement was observed and… pic.twitter.com/nxZHyajCOv— ANI (@ANI) July 24, 2024 -
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గురువారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృత్యువాతపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్- బీజాపూర్ సరిహద్దుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని నారాయణపూర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) ప్రభాత్ కుమార్ తెలిపారు. అయితే మరణించిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది.వరస ఎన్కౌంటర్లు.. ఇటీవల ఛత్తీస్గడ్ అడవులను భద్రతాదళాలు జల్లెడ పడుతున్నాయి. వరస ఎన్కౌంటర్లలో అనేక మంది మావోయిస్టులు ప్రాణాలు విడుస్తున్నారు. గత నెల ఏప్రిల్ 16, 30వ తేదీల్లో చోటుచేసుకున్న భారీ ఎన్కౌంటర్లలో 39 మంది మావోయిస్టులు చనిపోవడం తెలిసిందే. బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాదిలో వివిధ ఎన్కౌంటర్లలో103 మంది నక్సల్స్ చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. -
బరితెగించిన పాక్ రేంజర్స్
జమ్మూ/అరి్నయా: కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాకిస్తాన్ రేంజర్స్ జరిపిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలోని రామ్‌గఢ్ సెక్టార్లో భారత్–పాక్ సరిహద్దు వెంట గురువారం ఈ ఘటన జరిగింది. సరిహద్దు ఔట్‌పోస్ట్ వద్ద ఉన్న 50ఏళ్ల లాల్ఫామ్ కీమాపై కాల్పులు జరపడంతో రక్తమోడుతున్న ఆయనను వెంటనే స్థానిక ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం జమ్మూలోని జీఎంసీ ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ‘ పాక్ రేంజర్ల కాల్పులకు దీటుగా బీఎస్ఎఫ్ బలగాలు కాల్పుల మోత మోగించాయి. సమీపంలోని జెర్దా గ్రామంపైనా పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు’ అని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. -
హింసాకాండలో 54 మంది మృతి.. మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణలతో రాష్ట్రం రావణకాష్టంలా మారిపోయింది. హింసాత్మక ఘటనలను కట్టడి చేసేందుకు 'తీవ్రమైన కేసుల్లో' కనిపిస్తే కాల్చివేతకు మణిపూర్ గవర్నర్ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని జిల్లాల్లో నిరసనకారులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల నిరసనకారుల్ని అదుపు చేయడానికి కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చిందని పోలీసులు తెలిపారు. మణిపూర్ మారణహోమంలో మరణించిన వారి సంఖ్య 54కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. అయితే అనధికారికంగా మృతుల సంఖ్య మరింత ఎక్కువే ఉండవచ్చని భావిస్తున్నారు. బుల్లెట్ గాయాలు తగిలిన మరికొంత మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చి, సాధారణ పరిస్థితిని నెలకొల్పడం కోసం కేంద్రం అదనపు బలగాలను రంగంలోకి దింపింది. శాంతి భద్రతలను కాపాడేందుకు ఆర్మీ దళాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్ర పోలీసులు బలగాలలు అన్ని సమస్యాత్మక ప్రాంతాలు, రహదారుల్లో పహరా కాస్తున్నాయి. ఆర్టికల్ 355ను సైతం కేంద్ర అమల్లోకి తీసుకొచ్చింది. శనివారం ఉదయం షాపులు, మార్కెట్లు తిరిగి తెరుచుకోవడంతో శనివారం ఇంఫాల్ వ్యాలీలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రజలు కురగాయాలు వంటి నిత్యవసర వస్తువుల కోసం బయటకు వస్తున్నారు. కార్లు వంటి వాహనాలు సైతం రోడ్డెక్కాయి. మరోవైపు ఇప్పటి వరకు మొత్తం 13 వేల మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రక్షణశాఖ అధికారి ఒకరు తెలిపారు. వారికి సైనిక శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో ఆశ్రయం కల్పించినట్లు చెప్పారు. చదవండి: ఖర్గే కుటుంబాన్ని హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది! గడిచిన 12 గంటల్లో, ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నాయిని, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. అయితే వేంగంగా స్పందించిన ఆర్మీ, ఇతర భద్రతా బలగాలు పరిస్థితిని నియత్రణలోకి తీసుకొచ్చాయని తెలిపారు. శుక్రవారం రాత్రి చురాచంద్పూర్ జిల్లాలోని సైటన్‌లో భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారని పోలీసులు తెలిపారు. ఇద్దరు ఐఆర్బీ జవాన్లు గాయపడ్డారని తెలిపారు. గచురాచాంద్‌పూర్, మోరే, కక్చింగ్, కాంగ్పోక్పీ వంటి ప్రాంతాలను కేంద్ర బలగాలు తమ ఆధినంలోకి తీసుకున్నాయి. ఈ ప్రదేశాల్లో శుక్రవారం రాత్రి నుంచి ఎలాంటి ఘర్షణలు జరగలేదు. ఇండియన్ ఆర్మీ, అస్సాం రైఫిల్స్ బలగాలు దాదాపు 10,000 మంది సైనికులు రాష్ట్రంలో మోహరించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్, ఉన్నతాధికారులతో మాట్లాడారు. అకస్మాత్తుగా ఇటువంటి పరిస్థితులు ఏర్పడటం వెనుక ఉన్న అసలు కారణాలు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై ఆరాతీశారు. అసలు ఎందకీ ఘర్షణలు? మణిపూర్ రాష్ట్ర జనాభాలో 53 శాతం మంది ఉన్న మైతీలు తమకు షెడ్యూల్డు తెగల హోదాను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఎస్టీ హోదా కోసం మైతీలు చేస్తున్న డిమాండ్‌పై నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని మణిపూర్ హైకోర్టు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) పిలుపు మేరకు బుధవారం గిరిజన సంఘీభావ కవాతును నిర్వహించారు. ఈ కవాతు చురాచాంద్‌పూర్ జిల్లాలోని టోర్బుంగ్ ఏరియాలో జరిగింది. ఈ కార్యక్రమంలో నాగాలు, జోమీలు, కుకీలు పాల్గొన్నారు. అయితే చురాచాంద్‌పూర్ జిల్లాలో బుధవారం జరిగిన గిరిజన కవాతు పలుచోట్ల ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అనంతరం లోయలోని జిల్లాలన్నిటికీ హింసాకాండ విస్తరించింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింస జరిగింది. చదవండి: భద్రతా సిబ్బంది సమక్షంలోనే గ్యాంగ్‌స్టర్ టిల్లుపై కత్తితో.. వీడియో వైరల్ -
రావులపాలెంలో భారీ భద్రత బలగాలు
-
గోరఖ్‌నాథ్ ఆలయం వద్ద కలకలం
గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ గోరఖ్‌నాథ్ ఆలయం వద్ద దుండగుడి హల్చల్తో కలకలం రేగింది. ముర్తజా అబ్బాసీ అనే ఐఐటీ గ్రాడ్యుయేట్ సోమవారం సాయంత్రం ప్రధాన ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించాడు. అడ్డుకున్న ఇద్దరు భద్రతా సిబ్బందిని వెంట తెచ్చుకున్న కొడవలితో గాయపరిచాడు. భద్రతాసిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిని ఉగ్రకుట్రగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ సమయంలో భక్తులతో ఆలయ ప్రాంగణం నిండి ఉందని పోలీసులు తెలిపారు. పథకం ప్రకారమే అక్కడికి చేరుకున్న ముర్తజా ఆలయం లోపలికి ప్రవేశించి ఉంటే జరిగే పరిణామాన్ని ఊహించలేమన్నారు. అతడి వద్ద లభ్యమైన పత్రాలు సంచలనం కలిగించేవిగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ముర్తజాను స్థానిక కోర్టు రెండు వారాల జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించింది. ముర్తజా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని అతడి తండ్రి మునీర్ అంటున్నారు. -
రొనాల్డో బాడీగార్డ్స్‌గా వ్యవహరిస్తున్నదెవరో తెలుసా!
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన రొనాల్డోకు విశ్వవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పోర్చుగల్ జాతీయ జట్టుతో పాటు.. మంచెస్టర్ యునైటెడ్ లీగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సాధారణంగా రొనాల్డో ఎక్కడికైనా వెళ్తున్నాడనే సమాచారం వస్తే చాలు.. వేల సంఖ్యలో అభిమానులు గూమికడతారు. మరి వారి నుంచి రొనాల్డోకు రక్షణ కల్పించడానికి బాడీగార్డులు అవసరం చాలా ఉంది. అయితే రొనాల్డోకు బాడీగార్డ్స్‌గా వ్యవహరిస్తున్న సెర్జియో, జార్జ్ల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. చదవండి: Lieonal Messi: మెస్సీ చరిత్ర.. 34 ఏళ్ల వయసులో ఏడోసారి పోర్చుగల్‌కు చెందిన సెర్జియో, జార్జ్ ఇద్దరు కవల పిల్లలు. చిన్నప్పటి నుంచి సైన్యంలో పని చేయాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకు తగ్గట్లే.. భద్రతా విభాగంలో కీలక పదవులు నిర్వహించారు. ఆ తర్వాత ఇద్దరూ పోర్చుగల్ పోలీసు విభాగంలో చేరారు. పోర్చుగల్‌లో ప్రముఖులకు భద్రత.. బాధ్యత పోలీసులదే. అలా ఈ ఇద్దరు సోదరులు రొనాల్డో.. వారి కుటుంబానికి ముఖ్య భద్రతాధికారులుగా పని చేస్తున్నారు. రొనాల్డోతో తరుచూ బయట కనపడే ఈ ఇద్దరు అన్నదమ్ములు.. సూటు, బూటు వేసుకొని అందమైన మోడల్స్‌లాగా కనిపిస్తుంటారు. చాలా సాఫ్ట్‌గా కనిపించే అన్నదమ్ములు రొనాల్డోకు అన్ని వేళలా రక్షణగా ఉంటారు. ఎలాంటి స్థితిలో అయినా పోరాడే లక్షణాలు వీరిద్దరికి ఉన్నాయి. తమ తెలివి తేటలు ఉపయోగించి రక్షణ బాధ్యతలు చూస్తుంటారు. అందుకే రొనాల్డోకు వారిద్దరిపై అపారమైన విశ్వాసం ఉంటుంది. చదవండి: గోల్ కొట్టే అవకాశం.. ప్రత్యర్థి ఆటగాడికి గాయం -
నీరుంది.. లష్కర్లు లేరు !
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల ఆయకట్టు కాల్వలకు నీటి విడుదలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. కాల్వల నీటి నిర్వహణ అంశాన్ని మాత్రం విస్మరిస్తోంది. బ్యారేజీలు, రిజర్వాయర్లు, హెడ్ రెగ్యులేటర్ల పరిధిలోని గేట్లు, కాల్వలు, డిస్ట్రిబ్యూటర్లు, తూముల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించడంలో చర్యలు తీసుకోవడం లేదు. గోదావరి, కృష్ణా నదులకు వరద పుంజుకునే సమయానికి నిర్వహణ అంశాలన్నింటినీ చక్కబెట్టాలని, అవసరమైన మేరకు లష్కర్లు, ఆపరేటర్లు, ఫిట్లర్లు, ఎలక్ట్రీషియన్లను నియమించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినా అడుగు ముందుకు పడటం లేదు. లష్కర్లు లేని కారణంగా నీటినిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కొందరు ఇష్టారీతిగా కాల్వలకు గండ్లు పెడుతుండగా, మరికొన్ని చోట్ల దిగువకు నీరెళ్లకుండా అడ్డుకట్టలు వేస్తున్నారు. ఎదురుచూపులు.. ఎంతకాలం? రాష్ట్రంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు వరదలు, కాల్వలకు నీళ్లిచ్చే సమయంలో వర్క్ ఇన్స్పెక్టర్లు, గేటు ఆపరేటర్లు, హెల్పర్లు, ఫిట్టర్, ఎలక్ట్రీíషియన్లు, లష్కర్ల పాత్ర కీలకం. కాల్వల ద్వారా నీటిని విడుదల చేశాక అవి చివరి ఆయకట్టు వరకు వెళ్లాలన్నా, ఎక్కడా కాల్వలు తెగకుండా, గండ్లు పెట్టకుండా చూసే బాధ్యత లష్కర్‌లపైనే ఉంటుంది. రాష్ట్రంలోని నాగార్జునసాగర్, జూరాల, ఎస్సారెస్పీ సహా సుద్దవాగు, స్వర్ణ, మత్తడివాగు, పాలెంవాగు, తాలిపేరు, కిన్నెరసాని, లంకసాగర్, అలీసాగర్, గుత్పా, జూరాల, సింగూరు, కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పరిధిలో లష్కర్లు, ఇతర సిబ్బంది తగినంతగా లేరు. మెయిన్‌కెనాల్, డిస్ట్రిబ్యూటరీల పరిధిలో ప్రతీ 5 కిలోమీటర్లకు ఒక లష్కర్, బ్రాంచ్ కెనాల్ల పరిధిలో ప్రతీ 6 కి.మీ.లకు ఒక లష్కర్ ఉండాలి. కానీ, వారి జాడేలేదు. వీరు లేకుండా నీటి నిర్వహణ అసాధ్యం. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల కింద లష్కర్లు 3,671 మంది అవసరం కాగా కేవలం 1,450 మంది మాత్రమే ఉన్నారు. కనిష్టంగా మరో 2 వేల మందిని నియమించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల కాల్వల కింద నీటి నిర్వహణకు 581 మంది లష్కర్లను నియమించాల్సి ఉంది. కనిష్టంగా 50 శాతం మందిని.. అంటే 291 మందినైనా నియమించాలని నీటిపారుదల శాఖ కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం ప్రాజెక్టుల నుంచి కాల్వలకు నీరు విడుదలవుతున్నా లష్కర్లు లేక నిర్వహణ ఇబ్బందిగా మారింది. కల్వకుర్తి పరిధిలో కొన్నిచోట్ల రైతులు ప్రధాన కాల్వ మీదే క్రాస్ రెగ్యులేటర్‌కు అడ్డుగాషీట్‌లు వేయడంతో పంపులను పూర్తిగా నిలిపివేసి వాటిని తొలగించాల్సి వచ్చింది. మరికొన్ని చోట్ల ప్రధాన కాల్వకే గండిపెట్టి చెరువులకు నీటిని మళ్లిస్తున్నారు. కొన్నిచోట్ల కాల్వలు తెగిపోతుంటే వాటిని ఎవరు చూడాలి, ఎవరు మరమ్మతు చేయాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. దీంతో నీరందక దిగువ ఆయకట్టు రైతులు లబోదిబోమంటున్నారు. -
కశ్మీర్లో ఆరుగురు ఉగ్రవాదుల కాల్చివేత
శ్రీనగర్: కశ్మీర్లో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనంతనాగ్ జిల్లాలోని బెజ్బెహారాలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు కమాండర్లు సహా ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక్కడి వగహామా సుక్తిపొరాలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కినట్లు పక్కా సమాచారం అందడంతో ఆర్మీ ఆపరేషన్ ప్రారంభించింది. భద్రతాబలగాలు అనుమానిత ఇంటిని చుట్టుముట్టగానే ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్కౌంటర్లో చనిపోయినవారిని అనంతనాగ్ జిల్లా లష్కరే కమాండర్ ఆజాద్ అహ్మద్ మాలిక్, జిల్లా హిజ్బుల్ కమాండర్ ఉనైస్ షఫీ, బాసిత్ ఇష్తియాక్, అతిఫ్ నాజర్, ఫిర్దౌస్ అహ్మద్, షహీద్ బషీర్‌గా గుర్తించారు. ఈ ఏడాది జూన్ 14న రైజింగ్ కశ్మీర్ పత్రిక ఎడిటర్ షూజాత్ బుఖారిని ఉగ్రవాదులు హత్యచేసిన ఘటనలో ఆజాద్ సూత్రధారి. -
19 కొత్త ఎయిమ్స్‌లలో ఆయుర్వేద శాఖలు
న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటుచేసిన 19 ఆలిండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లలో ఆయుర్వేద శాఖలను నెలకొల్పనున్నట్లు ఆయుష్ శాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్ చెప్పారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్), ఇతర పారమిలటరీ దళాలకు చెందిన ఏడు ఆస్పత్రుల్లోనూ ఆయుర్వేద శాఖలను ఏర్పాటుచేయనున్నారు. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలోని 100 ఈఎస్ఐసీ ఆస్పత్రుల్లోనూ ఆయుర్వేద శాఖల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని నాయక్ తెలిపారు. అంటురోగాలుకాని వ్యాధుల వ్యాప్తి నిరోధానికి సంబంధించిన జాతీయ పథకాన్ని ఇప్పుడున్న ఆరు రాష్ట్రాలతోపాటు మరిన్ని రాష్ట్రాల్లో అమలుచేస్తామని ఆయన వెల్లడించారు. -
బలగాల వాహనం పేల్చివేత
రాయ్‌పూర్ / చర్ల / చింతూరు (రంపచోడవరం): ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దంతేవాడ జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులకు గస్తీ నిర్వహిస్తున్న బలగాల వాహనాన్ని ఆదివారం మందుపాతరతో పేల్చివేశారు. ఈ దాడిలో ఏడుగురు జవాన్లు దుర్మరణం చెందారు. మావోల దాడిని పిరికిపందల చర్యగా ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ అభివర్ణించారు. దంతేవాడ జిల్లాలోని బచేలి–చోల్నార్ రోడ్డు నిర్మాణ పనులకు సామగ్రిని తరలిస్తున్న వాహనాలకు ఛత్తీస్‌గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్(సీఏఎఫ్), డిస్ట్రిక్ ఫోర్స్(డీఎఫ్) సంయుక్త బలగాలు రక్షణ కల్పిస్తున్నాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందులోభాగంగా గస్తీ నిర్వహిస్తున్న బలగాల వాహనం చోల్నార్ గ్రామ సమీపంలోకి రాగానే మావోలు శక్తిమంతమైన మందుపాతరను పేల్చారన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన ఈ దాడిలో బలగాల వాహనం తునాతునకలైందని వెల్లడించారు. ల్యాండ్‌మైన్ పేలుడు అనంతరం దాదాపు 200 మంది మావోలు బలగాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారన్నారు. ఐదుగురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారని పేర్కొన్నారు. మృతుల్లో డీఎఫ్ బలగాలకు చెందిన హెడ్‌కానిస్టేబుల్ రామ్‌కుమార్, కానిస్టేబుల్ తికేశ్వర్ ధ్రువ్, అసిస్టెంట్ కానిస్టేబుల్ షాలిక్‌రామ్, సీఏఎఫ్ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ విక్రమ్ యాదవ్, కానిస్టేబుళ్లు రాజేశ్ కుమార్, రవినాథ్ పటేల్, అర్జున్ రాజ్భర్లు ఉన్నారు. దాడి అనంతరం బలగాల దగ్గరున్న ఆయుధాల్ని మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. ఇటీవల గడ్చిరోలీ, మల్కన్‌గిరితో పాటు బీజాపూర్‌లో భద్రతాబలగాల దాడిలో భారీగా నష్టపోయిన మావోలు.. ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడినట్లు పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. -
కశ్మీర్లో మరో ఉగ్రవాది హతం
శ్రీనగర్ : సరిహద్దులు దాటి దేశంలో చొరబడి విధ్వంసం సృష్టించాలన్న ఉగ్రవాదులను ఎత్తుగడలను భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది. తాజాగా మంగళవారం ఉదయం భద్రతా బలగాల చేతిలో మరో ఉగ్రవాది హతమయ్యాడు. కాగా జమ్మకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బెహ్మనో ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు మరణించారు. అయితే వారి మృతదేహాలను తెచ్చే క్రమంలో మరో ఉగ్రవాది గ్రెనేడ్‌ను పేల్చుకోవడంతో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలం నుంచి ఒక AK-47 తుపాకీ, ఇన్సాస్ రైఫిల్‌ను సైనిక వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు కూంబింగ్ కొనసాగుతోంది. -
ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతం
-
ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ బందిపొరా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మంగళవారం ఉదయం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఉగ్రవాది మృతి చెందగా, ఓ జవాను గాయపడ్డాడు. కాగా ఉగ్రవాదుల సంచరిస్తున్నారనే సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పొంచిఉన్న ఉగ్రవాదులు...భద్రతాదళాలపై కాల్పులు ప్రారంభించగా, ప్రతిగా జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. కాగా హతమైన ఉగ్రవాది ఏ తీవ్రవాద సంస్థకు చెందిన సభ్యుడనేది గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. -
రెచ్చిపోయిన మావోయిస్టులు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. రోడ్డు పనులు నిర్వహిస్తున్న ఆరు వాహనాలకు నిప్పుపెట్టారు. జిల్లాలోని పఖంజేర్ ప్రాంతంలో అభివృద్ధి పనుల్లో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న రహదారి పనులకు వినియోగిస్తున్న ఆరు వాహనాలకు శుక్రవారం రాత్రి మావోయిస్టులు తగలబెట్టారు. ఇది గుర్తించిన కాంట్రాక్టర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మరో వైపు ఇదే జిల్లాలో భద్రాతా బలగాలను లక్ష్యంగా చేసుకొని ఏర్పాటు చేసిన మందు పాతరకు సంబంధించిన 100 మీటర్ల వైరును భద్రతాబలగాలు గుర్తించాయి. -
సచివాలయంలో ముగ్గురు వ్యక్తుల అరెస్ట్
హైదరాబాద్:సచివాలయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ ముగ్గురు వ్యక్తులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలిప్పిస్తామని చెబుతూ సచివాలయం ప్రాంగణంలో తిరుగుతున్న వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.