పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన రొనాల్డోకు విశ్వవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పోర్చుగల్ జాతీయ జట్టుతో పాటు.. మంచెస్టర్ యునైటెడ్ లీగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సాధారణంగా రొనాల్డో ఎక్కడికైనా వెళ్తున్నాడనే సమాచారం వస్తే చాలు.. వేల సంఖ్యలో అభిమానులు గూమికడతారు. మరి వారి నుంచి రొనాల్డోకు రక్షణ కల్పించడానికి బాడీగార్డులు అవసరం చాలా ఉంది. అయితే రొనాల్డోకు బాడీగార్డ్స్‌గా వ్యవహరిస్తున్న సెర్జియో, జార్జ్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి.
చదవండి: Lieonal Messi: మెస్సీ చరిత్ర.. 34 ఏళ్ల వయసులో ఏడోసారి
పోర్చుగల్‌కు చెందిన సెర్జియో, జార్జ్ ఇద్దరు కవల పిల్లలు. చిన్నప్పటి నుంచి సైన్యంలో పని చేయాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకు తగ్గట్లే.. భద్రతా విభాగంలో కీలక పదవులు నిర్వహించారు. ఆ తర్వాత ఇద్దరూ పోర్చుగల్ పోలీసు విభాగంలో చేరారు. పోర్చుగల్‌లో ప్రముఖులకు భద్రత.. బాధ్యత పోలీసులదే. అలా ఈ ఇద్దరు సోదరులు రొనాల్డో.. వారి కుటుంబానికి ముఖ్య భద్రతాధికారులుగా పని చేస్తున్నారు.
రొనాల్డోతో తరుచూ బయట కనపడే ఈ ఇద్దరు అన్నదమ్ములు.. సూటు, బూటు వేసుకొని అందమైన మోడల్స్‌లాగా కనిపిస్తుంటారు. చాలా సాఫ్ట్‌గా కనిపించే అన్నదమ్ములు రొనాల్డోకు అన్ని వేళలా రక్షణగా ఉంటారు. ఎలాంటి స్థితిలో అయినా పోరాడే లక్షణాలు వీరిద్దరికి ఉన్నాయి. తమ తెలివి తేటలు ఉపయోగించి రక్షణ బాధ్యతలు చూస్తుంటారు. అందుకే రొనాల్డోకు వారిద్దరిపై అపారమైన విశ్వాసం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment