portugal football team
-
Cristiano Ronaldo: కోచ్ కాదు.. నోటి మాటలే శాపంగా మారాయా?
క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్‌బాల్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఈ దశాబ్దంలో అత్యున్నత ఆటగాళ్లలో రొనాల్డో ఒకడిగా ఉన్నాడు. మైదానంలో పాదరసంలా కదులుతూ రొనాల్డో చేసే విన్యాసాలు అభిమానులను అలరిస్తుంటాయి. పోర్చుగల్ తరపున 195 మ్యాచ్‌ల్లో 118 గోల్స్ కొట్టిన రొనాల్డోకు ఫిఫా వరల్డ్‌కప్ తీరని కలగా మిగిలిపోయింది. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టి ఆ కోరికను నెరవేర్చుకోవాలనుకున్నాడు. కానీ అది సాధ్యపడలేదు. మొరాకో చేతిలో 2-1 తేడాతో ఓడి క్వార్టర్‌లోనే వెనుదిరిగింది. అంతే చిన్న పిల్లాడిలా మారిపోయిన రొనాల్డో వెక్కివెక్కి ఏడ్చాడు. ప్రస్తుతం రొనాల్డో వయస్సు 37 ఏళ్లు. అంటే ఫిట్నెస్ కాపాడుకుంటే తప్ప వచ్చే ఫిఫా వరల్డ్‌కప్ అతను ఆడడం కష్టమే. అయితే కీలకమైన క్వార్టర్ ఫైనల్లో రొనాల్డోను బెంచ్‌కే పరిమితం చేయడంపై పోర్చుగల్ కోచ్ ఫెర్నాండో శాంటోజ్ను అందరూ తప్పుబడుతున్నారు. ఫెర్నాండో చేసింది తప్పే కావొచ్చు.. ఎందుకంటే రొనాల్డో ఒక సూపర్‌స్టార్. పోర్చుగల్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. కీలక మ్యాచ్‌లో ఒక స్టార్‌ను పక్కనబెడితే ఆ ప్రభావం జట్టుపై బలంగా ఉంటుంది. ఈ విషయంలో శాంటోజ్ను తప్పుబట్టడం కరెక్టే. నిజానికి రొనాల్డో ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో పెద్దగా ప్రభావం చూపించింది లేదు. మెగాటోర్నీలో నాలుగు మ్యాచ్‌లాడిన రొనాల్డో కేవలం ఒక్క గోల్‌కే పరిమితమయ్యాడు. రొనాల్డో కొంతమంది అభిమానులు మాత్రం అతని నోటి మాటలే జట్టుకు దూరం చేశాయని.. అదే అతనికి శాపంగా మారిందని పేర్కొనడం ఆసక్తి రేపింది. ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు పియర్స్ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రొనాల్డో సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాంచెస్టర్ యునైటెడ్ కోచ్‌తో గొడవను బయటపెట్టిన రొనాల్డో.. ఆ తర్వాత వారితో జరిగిన అనుభవాలను వరుసగా చెప్పుకొచ్చాడు. ఇవే అతనికి శాపంగా మారాయి. ఆ తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ రొనాల్డోతో బంధం ముగిసిందంటూ లేఖ విడుదల చేయడం.. అప్పటికి తగ్గని రొనాల్డో విమర్శలు చేస్తూ పోవడం అతనికి నెగిటివిటిని తెచ్చిపెట్టింది. ఒకవైపు తన సమకాలీకుడు అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ.. ఆటలో దూసుకుపోతుంటే.. రొనాల్డో మాత్రం వివాదాలతో కాలక్షేపం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పరిస్థితులు అతనికి విలన్‌గా మారాయి.. ఎంతలా అంటే స్విట్జర్లాండ్‌తో కీలకమైన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో రొనాల్డోను బెంచ్‌కే పరిమితం చేశారు. అప్పుడు కోచ్ ఫెర్నాండో శాంటెజ్ తన నిర్ణయాన్ని తప్పుబట్టలేదు. రొనాల్డో పక్కనబెట్టడంపై తానేం బాధపడపడడం లేదని చెప్పుకొచ్చాడు. తాజాగా మొరాకోతో మ్యాచ్‌లోనూ మొదట రొనాల్డో బెంచ్‌కే పరిమితమయ్యాడు. తొలి అర్థభాగం ఆటకు దూరంగా ఉన్న రొనాల్డో.. రెండో అర్థభాగంలో వచ్చినప్పటికి పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా మొరాకో చేతిలో ఓడాలని రాసిపెట్టుంటే రొనాల్డో మాత్రం అద్భుతాలు ఏం చేయగలడు. ఏమో రొనాల్డో వ్యాఖ్యలను మనసులో పెట్టుకొని పోర్చుగల్ జట్టు మేనేజ్మెంట్ కావాలనే అతన్ని కీలక మ్యాచ్‌లో తప్పించిందేమోనన్న అనుమానం కలగక మానదు. ఇక మొరాకోతో మ్యాచ్ ఓటమి అనంతరం రొనాల్డో ఇన్స్టాగ్రామ్ ద్వారా తన సమాధానం రాసుకొచ్చాడు. ''మొరాకోతో మ్యాచ్ మాకు ఒక పీడకల. వరల్డ్‌కప్ గెలవాలనే డ్రీమ్‌తో ఖతర్‌లో అడుగుపెట్టా. కానీ ఆ కల నెరవేరకుండానే ఇలా పోర్చుగల్ వెళ్లిపోతానని ఊహించలేదు. కీలక సమయంలో మొరాకో జట్టు బాగా ఆడింది. వారి డిఫెన్స్ పటిష్టంగా ఉంది. కోచ్ శాంటోజ్తో నాకు ఎలాంటి వివాదాలు లేవు. నా అవసరం జట్టుకు లేదు అన్నప్పుడు పక్కనబెట్టడం నాకు బాధ కలిగించలేదు. అయితే ఫిఫా వరల్డ్‌కప్‌ను తీసుకురావాలన్న దేశ ప్రజల కోరికను నెరవేర్చనందుకు బాధగా ఉంది. థాంక్యూ ఖతర్.. ఇక్కడి అభిమానాన్ని ఎప్పటికి మరిచిపోనూ.. థాంక్యూ పోర్చుగల్'' అంటూ పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano) చదవండి: పోర్చుగల్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్న అడల్ట్ స్టార్ Harry Kane: హీరో అనుకుంటే జీరో అయ్యాడు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పోర్చుగల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన రోనాల్డో! వీడియో వైరల్
56 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఖతార్ గడ్డపై అడుగు పెట్టిన పోర్చుగల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. తన ఆఖరి ప్రపంచకప్‌లోనైనా జట్టుకు ట్రోఫీని అందించాలన్న రోనాల్డో కల కలగానే మిగిలిపోయింది. శనివారం జరిగిన ఫిఫా ప్రపంచ క్వార్టర్ ఫైనల్లో ఆఫ్రికా జట్టు మొరాకో చేతిలో ఓటమిపాలైన పోర్చుగల్ ఇంటిముఖం పట్టింది. ఎన్నో గోప్ప ట్రోఫీలను సాధించిన రోనాల్డో.. ప్రపంచకప్ టైటిల్ లేకుండానే తన కెరీర్‌ను ముగించాల్సి వస్తుంది. తన వయస్సు దృష్ట్యా రోనాల్డోకు ఇదే ఆఖరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉంది. కన్నీళ్లు పెట్టుకున్న రోనాల్డో మొరాకో చేతిలో తమ జట్టు ఓటమిని జీర్ణించుకోలేని రోనాల్డో కన్నీటిపర్యంతమయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ రోనాల్డో కన్నీళ్లు పెట్టుకున్నాడు. రోనాల్డోను అటవంటి పరిస్థితుల్లో చూసిన అభిమానులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. ట్విటర్ వేదికగా అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. "ప్రపంచకప్ గెలవకపోతేనేమీ.. ఎప్పటికీ నీవు మా సూపర్ హీరోవి"అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా క్రిస్టియానో రొనాల్డోను టీమ్ మేనేజ్మెంట్ ఈ మ్యాచ్‌లోనూ ఆరంభంలో ఆడించలేదు. 37 ఏళ్ల రొనాల్డోను 51వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా బరిలోకి దించారు. అయితే మొరాకో పటిష్ట డిఫెన్స్ ముందు రోనాల్డో తలవంచాడు. మరోవైపు సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి ఆఫ్రికా జట్టుగా మొరాకో చరిత్ర సృష్టించింది. It hurts me to see Ronaldo like this man 💔 pic.twitter.com/MbRGnTcRO2 — WolfRMFC (@WolfRMFC) December 10, 2022 చదవండి: FIFA WC: పోర్చ్‌గల్‌కు షాకిచ్చిన మొరాకో.. సెమీఫైనల్‌కు చేరిన ఆఫ్రికా జట్టు -
రొనాల్డో అరుదైన ఘనత.. సోషల్ మీడియాను వదల్లేదు
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానొ రొనాల్డో పేరిట ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులు ఉన్నాయి. మైదానంలో తన ఆటతో రికార్డులను సొంతం చేసుకునే రొనాల్డో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. తాజాగా సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య 400 మిలియన్ల మార్క్‌ను టచ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన తొలి వ్యక్తిగా రొనాల్డో రికార్డులెక్కాడు. చదవండి: Munich Air Disaster: ఫిబ్రవరి 6, 1958.. ఫుట్‌బాల్ చరిత్రలో అతి పెద్ద విషాదం అటు ఆటగానిగా.. ఇటు వ్యక్తిగా ఏ విధంగా చూసినా ఇన్‌స్టాగ్రామ్‌లో 400 మిలియన్ ఫాలోవర్ల సంఖ్య రొనాల్డోకు మాత్రమే సాధ్యమైంది. ఎందుకంటే రొనాల్డో తర్వాత రెండోస్థానంలో ఉన్న అమెరికన్ స్టార్ మోడల్ కైలీ జెన్నర్ ఫాలోవర్ల సంఖ్య 309. వీరిద్దరి మధ్య దాదాపు వంద మిలియన్లు తేడా ఉంది. ఈ మధ్యనే రొనాల్డో(ఫిబ్రవరి 5న) తన 37వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా గతేడాది సెప్టెంబర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య 230 మిలియన్గా ఉండేది. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే తన ఫాలోయింగ్‌ను డబుల్ రేంజ్‌కు పెంచుకున్నాడు. గతేడాది 12 ఏళ్ల తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు రీఎంట్రీ ఇచ్చిన రొనాల్డో.. సూపర్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. అదే సమయంలోనూ సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్‌లోనూ తన ఫాలోవర్ల సంఖ్యను అంతకంతకూ పెంచుకుంటూ వెళుతున్నాడు. కాగా రొనాల్డో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకు 3,242 పోస్టులు చేశాడు.. విచిత్రమేంటంటే రొనాల్డో తాను ఫాలో అవుతున్న సంఖ్య 501 మాత్రమే. చదవండి: కోల్‌కతా థండర్‌బోల్ట్స్ ఉత్కంఠ విజయం -
రొనాల్డో బాడీగార్డ్స్‌గా వ్యవహరిస్తున్నదెవరో తెలుసా!
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన రొనాల్డోకు విశ్వవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పోర్చుగల్ జాతీయ జట్టుతో పాటు.. మంచెస్టర్ యునైటెడ్ లీగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సాధారణంగా రొనాల్డో ఎక్కడికైనా వెళ్తున్నాడనే సమాచారం వస్తే చాలు.. వేల సంఖ్యలో అభిమానులు గూమికడతారు. మరి వారి నుంచి రొనాల్డోకు రక్షణ కల్పించడానికి బాడీగార్డులు అవసరం చాలా ఉంది. అయితే రొనాల్డోకు బాడీగార్డ్స్‌గా వ్యవహరిస్తున్న సెర్జియో, జార్జ్ల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. చదవండి: Lieonal Messi: మెస్సీ చరిత్ర.. 34 ఏళ్ల వయసులో ఏడోసారి పోర్చుగల్‌కు చెందిన సెర్జియో, జార్జ్ ఇద్దరు కవల పిల్లలు. చిన్నప్పటి నుంచి సైన్యంలో పని చేయాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకు తగ్గట్లే.. భద్రతా విభాగంలో కీలక పదవులు నిర్వహించారు. ఆ తర్వాత ఇద్దరూ పోర్చుగల్ పోలీసు విభాగంలో చేరారు. పోర్చుగల్‌లో ప్రముఖులకు భద్రత.. బాధ్యత పోలీసులదే. అలా ఈ ఇద్దరు సోదరులు రొనాల్డో.. వారి కుటుంబానికి ముఖ్య భద్రతాధికారులుగా పని చేస్తున్నారు. రొనాల్డోతో తరుచూ బయట కనపడే ఈ ఇద్దరు అన్నదమ్ములు.. సూటు, బూటు వేసుకొని అందమైన మోడల్స్‌లాగా కనిపిస్తుంటారు. చాలా సాఫ్ట్‌గా కనిపించే అన్నదమ్ములు రొనాల్డోకు అన్ని వేళలా రక్షణగా ఉంటారు. ఎలాంటి స్థితిలో అయినా పోరాడే లక్షణాలు వీరిద్దరికి ఉన్నాయి. తమ తెలివి తేటలు ఉపయోగించి రక్షణ బాధ్యతలు చూస్తుంటారు. అందుకే రొనాల్డోకు వారిద్దరిపై అపారమైన విశ్వాసం ఉంటుంది. చదవండి: గోల్ కొట్టే అవకాశం.. ప్రత్యర్థి ఆటగాడికి గాయం -
Cristiano Ronaldo: ముంగిట ప్రపంచ రికార్డు
లిస్బన్: ప్రతిష్టాత్మక ‘యూరో కప్’ ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలో 26 మంది సభ్యులతో కూడిన పోర్చుగల్ జట్టు బరిలోకి దిగనుంది. యూరప్‌లోని 11 వేదికల్లో 24 జట్ల మధ్య జూన్ 11 నుంచి జూలై 11 వరకు ఈ టోర్నీ జరగనుంది. రొనాల్డో కెప్టెన్సీలోనే పోర్చుగల్ జట్టు 2016లో తొలిసారి ‘యూరో’ చాంపియన్‌గా అవతరించింది. 36 ఏళ్ల రొనాల్డోకిది వరుసగా ఆరో ‘యూరో’ చాంపియన్‌షిప్ కావడం విశేషం. రొనాల్డో మరో ఏడు గోల్స్ చేస్తే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఒక దేశం తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఇరాన్ మాజీ ప్లేయర్ అలీ దాయి (109 గోల్స్) పేరిట ఉంది. ఈసారి పోర్చుగల్ జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. గ్రూప్ ‘ఎఫ్’లో ప్రపంచ చాంపియన్ ఫ్రాన్స్, మాజీ విశ్వవిజేత జర్మనీ, హంగేరిలతో పోర్చు గల్ ఆడనుంది. ఈనెల 27న ‘యూరో’ కోసం పోర్చుగల్ సన్నాహాలు మొదలుపెట్టనుంది. చదవండి: French Open: మరో స్టార్ ప్లేయర్ దూరం -
రొనాల్డో కూడా పన్ను ఎగ్గొట్టాడు
మాడ్రిడ్ (స్పెయిన్): పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్, రియల్ మాడ్రిడ్ క్లబ్ హీరో క్రిస్టియానో రోనాల్డో రూ. 106 కోట్ల 28 లక్షల మేర పన్ను ఎగవేతకు పాల్పడినట్లు మాడ్రిడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించారు. 2011–2014 మధ్య కాలంలో వివిధ ఎండార్స్మెంట్ల ద్వారా వచ్చిన ఆదాయంపై పన్ను కట్టకుండా ప్రభుత్వ ఖజానాకు లోటు తెచ్చాడని మాడ్రిడ్ పీపీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రీడాకారుడిగా రికార్డులకెక్కిన ఈ 32 ఏళ్ల సాకర్ స్టార్ నాలుగు ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు మాడ్రిడ్ పీపీ తెలిపింది. దీనిపై స్పెయిన్ కోర్టులో విచారణ జరుగుతోంది. నేరం రుజువైతే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశముంది. అయితే స్పెయిన్ చట్టాల ప్రకారం క్రిమినల్ నేరం కాని తొలి శిక్షకు కారాగారం తప్పే వెసులుబాటు ఉంది. ఇటీవల అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీకి పన్ను ఎగవేత ఆరోపణలపై స్పెయిన్ కోర్టు 21 నెలల జైలుశిక్ష, రూ. 15 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. జరిమానా కట్టేందుకు మెస్సీ అంగీకరించారు. -
నిను వీడని నీడను నేనే..!
తన ఆటతీరుతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు.. బ్రెజిల్ మోడల్ అండ్రెసా ఉరాచ్ ముచ్చెమటలు పట్టిస్తోంది. రొనాల్డోతో తనకు శారీరక సంబంధం ఉందంటూ ఈమె గత ఏడాది సంచలనం రేపింది. వివరణ ఇవ్వడానికి రొనాల్డో నానా తంటాలు పడ్డాడు. ఇక రొనాల్డో తమ దేశానికి వస్తే ఊరుకుంటుందా... శరీరానికి రంగు వేసుకుని అర్ధనగ్నంగా పోర్చుగల్ జట్టుకు స్వాగతం పలికింది. సెక్యూరిటీని ఛేదించుకుని ప్రాక్టీస్ జరుగుతున్న మైదానంలోకి వెళ్లింది. దీంతో రొనాల్డో తలపట్టుకున్నాడు. కాగా జర్మనీతో జరిగిన మ్యాచ్ లో క్రిస్టియానో రొనాల్డో గాయపడ్డాడు. దీంతో తర్వాతి మ్యాచుల్లో అతడు ఆడతాడా, లేదా అనేది అనమానంగా మారింది. కాలి గాయం కారణంగా అతడు ఈ ప్రపంచకప్ కు దూరమయ్యే అవకశముందంటున్నారు.