56 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఖతార్ గడ్డపై అడుగు పెట్టిన పోర్చుగల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. తన ఆఖరి ప్రపంచకప్‌లోనైనా జట్టుకు ట్రోఫీని అందించాలన్న రోనాల్డో కల కలగానే మిగిలిపోయింది.
శనివారం జరిగిన ఫిఫా ప్రపంచ క్వార్టర్ ఫైనల్లో ఆఫ్రికా జట్టు మొరాకో చేతిలో ఓటమిపాలైన పోర్చుగల్ ఇంటిముఖం పట్టింది. ఎన్నో గోప్ప ట్రోఫీలను సాధించిన రోనాల్డో.. ప్రపంచకప్ టైటిల్ లేకుండానే తన కెరీర్‌ను ముగించాల్సి వస్తుంది. తన వయస్సు దృష్ట్యా రోనాల్డోకు ఇదే ఆఖరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉంది.
కన్నీళ్లు పెట్టుకున్న రోనాల్డో
మొరాకో చేతిలో తమ జట్టు ఓటమిని జీర్ణించుకోలేని రోనాల్డో కన్నీటిపర్యంతమయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ రోనాల్డో కన్నీళ్లు పెట్టుకున్నాడు. రోనాల్డోను అటవంటి పరిస్థితుల్లో చూసిన అభిమానులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. ట్విటర్ వేదికగా అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. "ప్రపంచకప్ గెలవకపోతేనేమీ.. ఎప్పటికీ నీవు మా సూపర్ హీరోవి"అంటూ పోస్టులు పెడుతున్నారు.
కాగా క్రిస్టియానో రొనాల్డోను టీమ్ మేనేజ్‌మెంట్ ఈ మ్యాచ్‌లోనూ ఆరంభంలో ఆడించలేదు. 37 ఏళ్ల రొనాల్డోను 51వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా బరిలోకి దించారు. అయితే మొరాకో పటిష్ట డిఫెన్స్ ముందు రోనాల్డో తలవంచాడు. మరోవైపు సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి ఆఫ్రికా జట్టుగా మొరాకో చరిత్ర సృష్టించింది.
It hurts me to see Ronaldo like this man 💔 pic.twitter.com/MbRGnTcRO2
— WolfRMFC (@WolfRMFC) December 10, 2022
చదవండి: FIFA WC: పోర్చ్‌గల్‌కు షాకిచ్చిన మొరాకో.. సెమీఫైనల్‌కు చేరిన ఆఫ్రికా జట్టు
Comments
Please login to add a commentAdd a comment