Lionel Messi Poses With FIFA World Cup 2022 Trophy In Bed, Pics Viral - Sakshi
Sakshi News home page

Lionel Messi: వరల్డ్‌కప్‌ను పక్కలో పెట్టుకుని పడుకున్న మెస్సీ.. వైరల్‌ ఫోటో

Published Tue, Dec 20 2022 9:49 PM | Last Updated on Wed, Dec 21 2022 10:12 AM

Lionel Messi Poses With World Cup Trophy In Bed - Sakshi

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ గెలవాలన్న తన చిరకాల కోరికను ఆఖరి ప్రయత్నంలో నెరవేర్చుకోవడంతో పాటు అర్జెంటీనాను మూడోసారి జగజ్జేతగా నిలిపిన గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ (GOAT), అర్జెంటీనా కెప్టెన్‌ లియోనల్‌ మెస్సీకి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఫిఫా వరల్డ్‌కప్‌-2022 గెలిచాక ఖతార్‌ నుంచి జట్టుతో పాటు స్వదేశానికి చేరుకున్న మెస్సీ.. తన 17 ఏళ్ల కెరీర్‌లో వరల్డ్‌కప్‌ గెలుపుకున్న ప్రాధాన్యత ఏంటో ప్రపంచానికి మరోసారి రుజువు చేశాడు.

వరల్డ్‌కప్‌ గెలిచి రెండు రోజు పూర్తయ్యాక కూడా ఆ మూడ్‌లోనుంచి ఇంకా బయటికి రాని మెస్సీ.. పడుకున్నప్పుడు కూడా ట్రోఫీని తన పక్కలోనే పెట్టుకుని వరల్డ్‌కప్‌ టైటిల్‌పై తనకున్న మమకారాన్ని చాటుకున్నాడు. మెస్సీ.. వరల్డ్‌కప్‌ ట్రోఫీపై చేయి వేసుకుని పడుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

ఈ ఫోటోను మెస్సీ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఈ పిక్‌ను చూసిన మెస్సీ అభిమానులు.. తమ ఆరాధ్య ఫుట్‌బాలర్‌ వరల్డ్‌కప్‌ను పక్కలో పెట్టుకుని పడుకోవడాన్ని చూసి మురిసిపోతున్నారు. దిగ్గజ ఆటగాడికి ఆట పట్ల ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు. మెస్సీ.. వరల్డ్‌కప్‌ ట్రోఫీని తన బిడ్డల కంటే అధికంగా ప్రేమిస్తున్నాడనడానికి ఇది నిదర్శమని అంటున్నారు. ఈ పోస్ట్‌ 3 కోట్లకు పైగా లైక్స్‌ సాధించడం విశేషం.

కాగా, డిసెంబర్‌ 18న జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌-2022 ఫైనల్లో అర్జెంటీనా 4-2 గోల్స్‌ తేడాతో ఫ్రాన్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మెస్సీ 2 గోల్స్‌ చేయడంతో పాటు మరో గోల్స్‌ సాధించడంలో డి మారియాకు తోడ్పడ్డారు. 

ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌ గెలిచిన అనంతరం మెస్సీ ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్ట్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పోస్ట్‌కు రికార్డు స్థాయిలో 6 కోట్లకు పైగా లైక్స్‌ వచ్చాయి. గతంలో ఇన్‌స్టాలో అత్యధిక లైక్స్‌ వచ్చిన రికార్డు పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో పేరిట ఉండేది. తాజాగా మెస్సీ.. రొనాల్డో రికార్డును బద్దలు కొట్టాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement