పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానొ రొనాల్డో పేరిట ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులు ఉన్నాయి. మైదానంలో తన ఆటతో రికార్డులను సొంతం చేసుకునే రొనాల్డో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. తాజాగా సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య 400 మిలియన్ల మార్క్‌ను టచ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన తొలి వ్యక్తిగా రొనాల్డో రికార్డులెక్కాడు.
చదవండి: Munich Air Disaster: ఫిబ్రవరి 6, 1958.. ఫుట్‌బాల్ చరిత్రలో అతి పెద్ద విషాదం
అటు ఆటగానిగా.. ఇటు వ్యక్తిగా ఏ విధంగా చూసినా ఇన్‌స్టాగ్రామ్‌లో 400 మిలియన్ ఫాలోవర్ల సంఖ్య రొనాల్డోకు మాత్రమే సాధ్యమైంది. ఎందుకంటే రొనాల్డో తర్వాత రెండోస్థానంలో ఉన్న అమెరికన్ స్టార్ మోడల్ కైలీ జెన్నర్ ఫాలోవర్ల సంఖ్య 309. వీరిద్దరి మధ్య దాదాపు వంద మిలియన్లు తేడా ఉంది. ఈ మధ్యనే రొనాల్డో(ఫిబ్రవరి 5న) తన 37వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే.
కాగా గతేడాది సెప్టెంబర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య 230 మిలియన్‌గా ఉండేది. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే తన ఫాలోయింగ్‌ను డబుల్ రేంజ్‌కు పెంచుకున్నాడు. గతేడాది 12 ఏళ్ల తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు రీఎంట్రీ ఇచ్చిన రొనాల్డో.. సూపర్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. అదే సమయంలోనూ సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్‌లోనూ తన ఫాలోవర్ల సంఖ్యను అంతకంతకూ పెంచుకుంటూ వెళుతున్నాడు. కాగా రొనాల్డో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకు 3,242 పోస్టులు చేశాడు.. విచిత్రమేంటంటే రొనాల్డో తాను ఫాలో అవుతున్న సంఖ్య 501 మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment