చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా | Cristiano Ronaldo Becomes First Celebrity To Cross 1 Billion Followers On Social Media, Check Out The Details | Sakshi
Sakshi News home page

Cristiano Ronaldo Followers: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా

Sep 13 2024 12:33 PM | Updated on Sep 13 2024 1:02 PM

Cristiano Ronaldo crosses 1 Billion followers on social media

క్రిస్టియానో రొనాల్డో.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ సాకర్ దిగ్గజాల్లో ఒకరిగా ఎదిగిన ఈ పోర్చుగల్ స్టార్ ఫుట్‌ బాలర్‌.. తనకంటూ ప్రత్యేకంగా అభిమాన ఘనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 

మైదానంలోనే కాదు ఆఫ్‌ది ఫీల్డ్‌లో కూడా రికార్డులు కొల్లగొట్టడంలో రొనాల్డోకి మించిన వారే లేరు. ఇటీవలే తన కెరీర్‌లో 900 గోల్‌లను సాధించి చరిత్ర సృష్టించిన రొనాల్డో.. తాజాగా మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

సోష‌ల్ మీడియా కింగ్‌..
రొనాల్డో తన సోషల్‌ మీడియా ఖాతాలన్నింటిలో కలిపి ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 100 కోట్లను దాటింది. త‌ద్వారా సోష‌ల్‌మీడియాలో ఈ అరుదైన‌ ఘ‌న‌త సాధించిన తొలి వ్యక్తిగా రొనాల్డో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు.

తాజాగా ఈ విషయాన్ని రొనాల్డోనే అభిమానులతో పంచుకున్నాడు. "మనం చరిత్ర సృష్టించాము. 1 బిలియన్(100 కోట్లు) ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాము. ఇది కేవలం సంఖ్యమాత్రమే కాదు. కోట్లాది మంది ప్రేమకు, అభిమానానికి నిదర్శనం. మదీరా వీధుల్లో ఫుట్‌బాల్ ఆడే స్థాయి నుంచి ప్రపంచంలోని అతిపెద్ద వేదికలపై ఆడగలిగాను. 

నేను ఎల్లప్పుడూ నా కుటుంబం కోసం, మీ కోసమే ఆడాను. ఇప్పుడు ఏకంగా  వంద కోట్ల మంది నా వెనక ఉన్నారు. నా కెరీర్‌లో నేను చవిచూసిన ఎత్తుపల్లాల్లో, నేను వేసే ప్రతీ అడుగులోనూ మీరున్నారు. అభిమానుల ఆదరాభిమానాలతోనే నా ఈ ప్రయాణం సాధ్యమైంది. మనమంతా కలిస్తే ఏదైనా సాధించగలమని నిరూపించాం. 

నన్ను సపోర్ట్ చేసి నా జీవితంలో భాగమైనందుకు అందరికి ధన్యవాదాలు. మనం ఇంకా చాలా సాధించాలి. మనమంతా కలిసి ముందుకు సాగుతాం అని ఎక్స్‌లో రొనాల్డో రాసుకొచ్చాడు. కాగా రొనాల్డో ఇటీవలే యువర్ క్రిస్టియానో" పేరుతో యూట్యూబ్‌ చానెల్‌ను ప్రారంభించగా.. 90 నిమిషాల వ్యవధిలోనే ఇది ఒక మిలియన్ సబ్‌స్క్రైబర్స్‌ను పొందాడు. 

ప్రస్తుతం అతడి యూట్యూబ్‌ ఖాతాకు 6 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఇన్‌స్టాలో ఈ ఫుట్‌బాల్‌ స్టార్‌ను 63.9కోట్ల మందికి పైగా అనుసరిస్తున్నారు. ‘ఎక్స్‌’లో 11.3 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 17 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
చదవండి: వాళ్లు వచ్చిన తరువాతే ఆడతామన్నారు...

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement