Euro Cup 2024: బోణీ కొట్టిన రొనాల్డో టీమ్‌ | Euro Cup 2024: Portugal Beat Czech Republic In Group F, See More Details Inside | Sakshi
Sakshi News home page

Euro Cup 2024: బోణీ కొట్టిన రొనాల్డో టీమ్‌

Published Wed, Jun 19 2024 4:18 PM | Last Updated on Wed, Jun 19 2024 4:34 PM

Euro Cup 2024: Portugal Beat Czech Republic In Group F

యూరో కప్‌ 2024లో దిగ్గజ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చుగల్‌ బోణీ కొట్టింది. గ్రూప్‌-ఎఫ్‌లో భాగంగా ఇవాళ (జూన్‌ 19) జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్‌.. చెక్‌ రిపబ్లిక్‌పై 2-1 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. 

ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి అర్ద భాగంలో ఇరు జట్లు ఒక్క గోల్‌ కూడా సాధించలేదు. ద్వితియార్ధంలో తొలుత (62వ నిమిషంలో, లుకాస్‌ ప్రొవోద్‌) చెక్‌ రిపబ్లిక్‌, ఆతర్వాత పోర్చుగల్‌ (69వ నిమిషంలో, రాబిన్‌ హ్రనాక్‌) గోల్స్‌ చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి. అయితే నిర్ణీత సమయం ముగిశాక 92వ నిమిషంలో ఫ్రాన్సిస్కో అద్భుతమైన గోల్‌ చేయడంతో పోర్చుగల్‌ 2-1 తేడాతో విజయం సాధించింది.

చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో
చెక్‌ రిపబ్లిక్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా పోర్చుగల్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. రొనాల్డో ఆరు యూరో కప్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రొనాల్డో 2004, 2008, 2012, 206, 2020, 2024 ఎడిషన్లలో పాల్గొన్నాడు. రొనాల్డో తర్వాత క్రొయేషియా ఆటగాడు లూకా మోడ్రిక్‌, పోర్చుగల్‌ ఆటగాడు పెపె అత్యధికంగా ఐదు యూరో కప్‌లు ఆడాడు.

జార్జియాను చిత్తు చేసిన తుర్కియే
గ్రూప్‌-ఎఫ్‌లో భాగంగా నిన్న జరిగిన మరో మ్యాచ్‌లో జార్జియాపై తుర్కియే 3-1 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. తుర్కియే తరఫున మెర్ట్‌ ముల్దర్‌ (25వ నిమిషం), ఆర్దా గులెర్‌ (65వ నిమిషం), ముహమ్మెద్‌ కెరెమ్‌ (97వ నిమిషం) గోల్స్‌ చేయగా.. జార్జియా తరఫున జార్జెస్‌ 32వ నిమిషంలో గోల్‌ చేశాడు.

ఇవాల్టి మ్యాచ్‌లు..

క్రొయేషియా వర్సెస్‌ అల్బేనియా (గ్రూప్‌-బి)

జర్మనీ వర్సెస్‌ హంగేరీ (గ్రూప్‌-ఏ)

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement