Euro Cup 2024: క్వార్టర్‌ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్న ఎంబపే, రొనాల్డో జట్లు | Euro Cup 2024: Portugal Defeat Slovenia In Penalties, Book Spot In Quarter Finals | Sakshi
Sakshi News home page

Euro Cup 2024: క్వార్టర్‌ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్న ఎంబపే, రొనాల్డో జట్లు

Published Tue, Jul 2 2024 1:56 PM | Last Updated on Tue, Jul 2 2024 1:56 PM

Euro Cup 2024: Portugal Defeat Slovenia In Penalties, Book Spot In Quarter Finals

యూరో కప్‌ 2024లో ఆరు క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. స్పెయిన్‌, జర్మనీ, ఇంగ్లండ్‌, స్విట్జర్‌లాండ్‌, పోర్చుగల్‌, ఫ్రాన్స్‌ జట్లు ఫైనల్‌-8కు చేరాయి.  మరో రెండు బెర్త్‌లు ఖరారు కావల్సి ఉంది.

ఇవాళ (జులై 2) జరిగిన మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చుగల్‌.. స్లొవేనియాపై 3-0 గోల్స్‌ తేడాతో గెలుపొందింది. నిర్ణీత సమయంతో పాటు (90 నిమిషాలు) అదనపు సమయంలోనూ (30 నిమిషాలు) గోల్స్‌ నమోదు కాకపోవడంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌ల వరకు వెళ్లింది. 

పెనాల్టీ షూటౌట్స్‌లో పోర్చుగల్‌ మూడు అవకాశాలను గోల్స్‌గా మలచగా.. స్లొవేనియా మూడు అవకాశాలను వృధా చేసుకుంది. పోర్చుగల్‌ గోల్‌ కీపర్‌ డియోగో కోస్టా అద్భుతమైన ప్రదర్శన కనబర్చి స్లోవేనియా మూడు ప్రయత్నాలను అడ్డుకున్నాడు. నిర్ణీత సమయంలో లభించిన పెనాల్టీని గోల్‌గా మలచడంలో విఫలమైన క్రిస్టియానో రొనాల్డో.. షూటౌట్స్‌లో ఓ గోల్‌ చేశాడు. పోర్చుగల్‌ క్వార్టర్‌ ఫైనల్లో కైలియన్‌ ఎంబపే జట్టు ఫ్రాన్స్‌తో తలపడనుంది.

క్వార్టర్‌ ఫైనల్స్‌ షెడ్యూల్‌..

స్పెయిన్‌ వర్సెస్‌ జర్మనీ (జులై 5)
పోర్చుగల్‌ వర్సెస్‌ ఫ్రాన్స్‌ (జులై 6)
ఇంగ్లండ్‌ వర్సెస్‌ స్విట్జర్లాండ్‌ (జులై 6)
నాలుగో క్వార్టర్‌ ఫైనల్‌ (జులై 7)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement