Football Star Cristiano Ronaldo Takes Shower During Instagram Live, Goes Viral - Sakshi
Sakshi News home page

Cristiano Ronaldo: సంచలనం సృష్టిస్తున్న రొనాల్డో బహిరంగ స్నానం

Mar 7 2022 10:26 AM | Updated on Mar 7 2022 12:23 PM

Football Star Cristiano Ronaldo Takes Shower During Instagram Live - Sakshi

సాధారణంగా సెలబ్రిటీలు ఏం చేసినా వార్తే. మరి అలాంటిది.. పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో చేస్తే సంచలనంగా మారకుండా ఉంటుందా చెప్పండి. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ కలిగిన వ్యక్తిగా రొనాల్డోకు పేరు ఉంది. ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డో.. మాంచెస్టర్‌ సిటీతో కీలక మ్యాచ్‌కు ముందు ఒక లైవ్‌ వీడియోనూ షేర్‌ చేశాడు.

ఆ వీడియోలో రొనాల్డో బహిరంగంగా స్నానం చేయడం కనిపించింది. మాములుగానే రొనాల్డో ఏదైనా షేర్‌ చేస్తే విరగబడి చూసి అతని ఫ్యాన్స్‌.. లైవ్‌ వీడియో అంటే ఊరుకుంటారా. అయితే రొనాల్డో బహిరంగ స్నానం చూసి ఆశ్చర్యపోయినప్పటికి.. తమ ఆరాధ్య ఆటగాడు అలా కనిపించడంతో లైక్స్‌, కామెంట్స్‌ చేశారు. రొనాల్డో స్నానం చేస్తున్న సమయంలో దాదాపు 670,000 మంది లైవ్‌లో చూశారు. సూ.. లాఫింగ్‌ ఎమోజీలు.. జెండాలు ఇలా రకరకాల ఎమోజీలతో కామెంట్స్‌ చేస్తూ పోయారు.

రొనాల్డో ఇలా చేయడం వెనుక సరైన కారణం తెలియదు గానీ.. ఇప్పుడు అతని బహిరంగ స్నానం మాత్రం సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సీజన్‌లో మాంచెస్టర్‌ యునైటెడ్‌ తరపున 31 మ్యాచ్‌లాడిన రొనాల్డో 15 గోల్స్‌ కొట్టాడు.

చదవండి: Shane Warne: దిగ్గజ ఫుట్‌బాలర్స్‌తో వార్న్‌కు దగ్గరి పోలికలు.. మరణం కూడా!

Virat Kohli Jersey Gift: 12వ ఆటగాడికి జెర్సీ గిఫ్ట్‌గా ఇచ్చిన కోహ్లి.. ఎవరా వ్యక్తి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement