shower bath
-
నిప్పూ, నీళ్లూ! వెరైటీ షవర్ : ఇలా ఉన్నారేంట్రా మీరు! వైరల్ వీడియో
షవర్ బాత్ తెలుసు.. ఐస్ బాత్ గురించి విన్నాం...కానీ మీరెపుడైనా ఫైర్ బాత్ గురించి విన్నారా? అవును నిజంగానే ఫైర్ బాత్ స్నానం చేస్తున్నాడు ఓ వ్యక్తి, నీళ్లు, నిప్పుతో కలిసి బాత్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్ హల్ చల్ చేస్తోంది.ఈ వీడియోలో ఒక పైప్ నుంచి నీళ్లతోపాటు, అగ్ని కూడా సెగలు కక్కుతూ ఒకేసారి కలిసి వస్తున్నాయి. లావాలా ఉబికి వస్తున్న ఈ నీళ్లలోనే ఒక వ్యక్తి ఎంచక్కా షవర్ బాత్ చేస్తున్నాడు. అచ్చం పైనుంచి జాలువారే జలపాతం వద్ద ఎంజాయ్ చేస్తున్నట్టుగా. ఈ వీడియోపై నెటిజనులు విభిన్నంగా స్పందించారు. అతని ఆరోగ్యంపై కొందరు ఆందోళనవ్యక్తం చేశారు. ఇలాంటి ఫీట్స్ ప్రమాదకరమని కొందరు, ఇలా చేస్తే కేన్సర్ బారిన పడటం ఖాయమని కొందరు వ్యాఖ్యానించారు.This must be one of the strangest showers in the world! 🚿🔥It's apparently located in Russia & spews both water and fire at the same time! 🤔 pic.twitter.com/Gh5fpW3ZQ4— H0W_THlNGS_W0RK (@HowThingsWork_) June 17, 2024 సహజ వాయువు, నిప్పు, నీరుతో స్నానం ఇదని, ఈ నీటిలో ఎక్కడో ఒక రకమైన గ్యాస్ ఉందని, దీంతో నీటితో పాటు తేలికగా మంటలు వస్తున్నాయని కమెంట్స్ ఎక్కువగా కనిపించాయి. అలాగే చాలా చల్లగా ఉంటుంది కానీ దుర్వాసన కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ విచిత్రమైన ఘటన రష్యాలో జరిగిందని, ఇలాంటి ఘటనలు రష్యాలోనే మాత్రమే చోటు చేసుకుంటాయంటూ మరికొందరు కమెంట్ చేశారు. -
Health tip : కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయొద్దు
తినే సమయంలో ఆహారంపై మనసు కేంద్రీకరించడం వల్ల అది మన మనస్తత్వ శాస్త్రాన్ని ప్రభావితం చేస్తుందని, జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తుందని వెల్నెస్ కోచ్, ఆయుర్వేద ఔత్సాహికురాలు అమృత కౌర్ రాణా తెలిపారు. FICCI లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) హైదరాబాద్ చాప్టర్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు అమృత. ఆమె చెప్పిన హెల్త్ టిప్స్ ఇవి. కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయకండి (షవర్ తీసుకోకండి), ఇది రక్తపోటు క్రమరాహిత్యానికి కారణమవుతుంది ఆయుర్వేదం 'జీవిత శాస్త్రం'. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడంలో సహాయపడుతోంది శరీరాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచుకోవడం మన కర్తవ్యం, లేకుంటే మన మనస్సును బలంగా మరియు స్పష్టంగా ఉంచుకోలేము ప్రతిరోజూ, మన ఆరోగ్యాన్ని నిర్దేశించే ఎంపికలను చాలా తరచుగా, మనకు తెలియకుండానే మార్చుకుంటాం. వేగవంతమైన జీవితాలు మరియు అనేక బాహ్య కారకాలచే ప్రభావితమవుతున్నాయి. వేదాలు ప్రకృతిలోని ఐదు అంశాలను - గాలి, నీరు, అంతరిక్షం, అగ్ని మరియు భూమి - పంచమహాభూతంగా సూచిస్తాయి. మానవ శరీరంలో ఈ మూలకాల ఉనికి లేదా లేకపోవడం దాని జీవ స్వభావం లేదా దోషాన్ని నిర్ణయిస్తుంది. ఆధునిక జీవనం కోసం ఆరోగ్యకరమైన శరీరం & మనస్సు కోసం ఆయుర్వేద సూత్రాల ఆధారంగా రోజువారీ అభ్యాసాలు చాలా ముఖ్యమైనవి శక్తితో కూడిన శరీరం కోసం మనస్సు తేలికగా ఉండాలి ఎప్పుడు మానసిక ఒత్తిడితో జీవితం గడిపితే అది కచ్చితంగా శరీరంపై, తద్వారా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఆయుర్వేద పోషకాహారం ప్రకారం రోజువారీ మంచి ఆహారపు అలవాట్లు పెంచుకోవాలి మంచి జీర్ణ శక్తి, సరైన రుతుస్రావం మెరుగైన హార్మోన్లకు దోహదపడతాయి ఒత్తిడి లేని జీవితం గడిపేలా స్వీయ-సంరక్షణ పద్ధతులను పాటించాలి కంటి నిండా నిద్ర, మానసిక ఆరోగ్యం వల్ల చర్మం, జుట్టు సంరక్షింపబడతాయి మైండ్‌ఫుల్‌గా తినడం అంటే ఎక్కువ తినమని కాదు అర్థం. దీనికి కేలరీలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు లేదా ప్రోటీన్‌తో సంబంధం లేదు. కానీ ఏం తింటున్నామో.. మనసుకు తెలియజేయాలి. మనం నోట్లో పెట్టుకున్నప్పుడు మనసు దాన్ని జీర్ణింపజేయడానికి కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. ఇంద్రియ జ్ఞానం వల్ల తినే తిండి సత్పలితాలను ఇస్తుంది. తినే సమయంలో ఆహారంపై మనసు కేంద్రీకరించడం మన శరీరధర్మాన్ని ప్రభావితం చేస్తుంది. ఆహారం తిన్న కొద్దిసేపటి వరకు నీళ్లు తాగకుండా చూసుకోండి. భోజనం చేసిన వెంటనే కనీసం 100 అడుగులు నడవడం మంచిది. ఇలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. మీరు అతిగా తింటే, మీ తదుపరి భోజనాన్ని తగ్గించండి లేదా దానిని దాటవేయండి. సూర్యాస్తమయం తర్వాత పెరుగు తినకూడదు. కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయకండి. ఇది రక్తపోటు క్రమరాహిత్యానికి కారణమవుతుంది. స్నానం మీ హృదయ స్పందన రేటును కూడా పెంచుతుంది ఇది కడుపు నిండినప్పుడు అసౌకర్యంగా అనిపిస్తుంది అని ఆమె తెలిపారు (అమృత ఫుడ్ బ్లాగర్ మరియు సర్టిఫైడ్ ఆయుర్వేద పోషకాహార సలహాదారు, జర్నలిస్ట్, రేడియో జాకీ, కంటెంట్ సృష్టికర్త మరియు ఉపాధ్యాయురాలు) -
సంచలనం సృష్టిస్తున్న రొనాల్డో బహిరంగ స్నానం
సాధారణంగా సెలబ్రిటీలు ఏం చేసినా వార్తే. మరి అలాంటిది.. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో చేస్తే సంచలనంగా మారకుండా ఉంటుందా చెప్పండి. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా రొనాల్డోకు పేరు ఉంది. ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డో.. మాంచెస్టర్ సిటీతో కీలక మ్యాచ్‌కు ముందు ఒక లైవ్ వీడియోనూ షేర్ చేశాడు. ఆ వీడియోలో రొనాల్డో బహిరంగంగా స్నానం చేయడం కనిపించింది. మాములుగానే రొనాల్డో ఏదైనా షేర్ చేస్తే విరగబడి చూసి అతని ఫ్యాన్స్.. లైవ్ వీడియో అంటే ఊరుకుంటారా. అయితే రొనాల్డో బహిరంగ స్నానం చూసి ఆశ్చర్యపోయినప్పటికి.. తమ ఆరాధ్య ఆటగాడు అలా కనిపించడంతో లైక్స్, కామెంట్స్ చేశారు. రొనాల్డో స్నానం చేస్తున్న సమయంలో దాదాపు 670,000 మంది లైవ్‌లో చూశారు. సూ.. లాఫింగ్ ఎమోజీలు.. జెండాలు ఇలా రకరకాల ఎమోజీలతో కామెంట్స్ చేస్తూ పోయారు. రొనాల్డో ఇలా చేయడం వెనుక సరైన కారణం తెలియదు గానీ.. ఇప్పుడు అతని బహిరంగ స్నానం మాత్రం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సీజన్లో మాంచెస్టర్ యునైటెడ్ తరపున 31 మ్యాచ్‌లాడిన రొనాల్డో 15 గోల్స్ కొట్టాడు. చదవండి: Shane Warne: దిగ్గజ ఫుట్‌బాలర్స్‌తో వార్న్‌కు దగ్గరి పోలికలు.. మరణం కూడా! Virat Kohli Jersey Gift: 12వ ఆటగాడికి జెర్సీ గిఫ్ట్‌గా ఇచ్చిన కోహ్లి.. ఎవరా వ్యక్తి? Never would I have thought I’d be watching Cristiano Ronaldo have a shower on Instagram live half naked. pic.twitter.com/FJSLDKfVfz — Ziyad⚡️🇲🇦 (@mcfcziyad) February 28, 2022 -
మునకలు లేకుండానే మమ..!
సాక్షి, అమరావతి : నది ప్రవాహ సమయంలో గతంలో భక్తులు పుణ్యస్నానాలు చేసే వారు. మూడు మునకలు వేస్తే పుష్కర స్నానం అని భక్తులు భావిస్తారు. ప్రస్తు తం కృష్ణానది నీటిలో నిండా తడిసే అవకాశం లేక జల్లు స్నానాలతో పుణ్యస్నానాన్ని ము గించు కోవాల్సిన పరిస్థితి. ప్రకాశం బ్యారేజీ దిగువన సాగర సంగమం వరకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 54కు పైగా ఘాట్లలో నీళ్లు లేవు. దీంతో అధికారులు ప్రతామ్నాయాలు ఏర్పాటుచేశారు. కృష్ణా జిల్లా కేంద్రం బందరుకు ప్రధాన కాలువ ద్వారా కృష్ణానది నీరు వచ్చే అవకాశం లేదు. కాలేఖాన్‌పేట సమీపం నాగులేరులో మున్సిపల్ అధికారులు ట్యాంకర్లతో నీటిని తెచ్చిపోశారు. మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గం కావడంతో అత్యుత్సాహంతో నది లో పుష్కర స్నానాన్ని కాలువలో చేయిం చాలని భావించారు. దాదాపు 20 నీటి ట్యాంకర్లు పోసినా నాగులేరు కాలువలో స్నానాలకు నీరు సరిపడేలా లేదు. అధికార యంత్రాంగం రెండు రోజుల వృథాప్రయాసకు తెరదించారు. ప్రకాశం బ్యారేజీ ఎగువున దుర్గాఘాట్, పున్నమిఘాట్‌లలో నీరు సమృద్ధిగానే ఉంది. దిగువన కృష్ణవేణి ఘాట్, పద్మావతి ఘాట్‌లో నీరు తగినంత లేదు. దాదాపు 2.1 కిలోమీటర్లు చిన్న పిల్ల కాలువలా కాంక్రీట్ ఫ్లోరింగ్ చేసి ఇసుక బస్తాలతో గట్టు వేసి నీరు వదులుతున్నా మునకలకు వీలులేకపోవడంతో భక్తులు అసంతృప్తికి లోనవుతున్నారు. దీంతో కృష్ణవేణి, పద్మావతి ఘాట్లలలో జల్లు (షవర్) స్నానాలు ఏర్పాటు చేశారు. విజయవాడకు దిగువన యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం, మద్దూరు ఘాట్లలోను విచిత్ర పరిస్థితి నెలకొంది. నదిలో గతంలో ఇసుక తవ్వకాలతో ఏర్పడిన గోతుల్లో నిలిచిన నీ టితో పుష్కరస్నానం అయ్యిందనిపిస్తున్నారు. మురికినీటిలో వ్యాధుల బారిన పడతామనే జల్లు స్నానాలు చేస్తున్నారు. అవనిగడ్డ ప్రాంతం కొత్తపేటలో జల్లు స్నానాలు ఏర్పాటుచేశారు. తీర ప్రాం తంలోని కృష్ణానది పాయలో సముద్రపు పోటుకు వచ్చే నీటిని గజఈతగాళ్లు డబ్బాలతో తెచ్చి ఇస్తే భక్తులు నెత్తిన పో సుకుంటున్నారు. గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో బోరువేసి మోటారు ద్వారా జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువున గుంటూరు జిల్లాలో చాలా ఘా ట్లలో కనీసం జల్లు స్నానాలు కూడా లేని పరి స్థితి నెలకొనడం కొసమెరుపు. -
పుష్కరస్నానంలో హై‘టెక్’లు..
సాక్షి, అమరావతి : నది ప్రవాహ సమయంలో భకు ్తలు చెంబులతో తడుపుకొని పుణ్యస్నానం అయ్యిందనేపించేవారు గతం లో. మరి ఇప్పుడో.. పరిస్థితి తారుమారు. కృష్ణా నది నీటిలో నిండా తడిసే అవకాశం లేదు. జల్లు స్నానాలతో పుణ్యస్నానాన్నిముగించుకోవాల్సిన పరిస్థితి. 2003 పుష్కరాల్లో గోదావరికి నీటి కొరత ఏర్పడింది. నరసాపురంలో తొలి సారి షవర్లతో స్నానాలకు తెరతీశారు. ఇప్పుడు కృష్ణా పుష్కరాల్లో ప్రకాశం బ్యా రేజి దిగువన అమలుకు సిద్దం చేశారు. పుష్కల జలసిరిలో మూడు మునకలు వేస్తే పుష్కర స్నానం అని భక్తులు భావిస్తారు. 12 ఏళ్లకు ఒకమారు పుణ్యస్నానం చేసేందుకు ప్రజల సెంటిమెంట్ అంతా ఇంతా కాదు. అటువంటిది తల తడుపుకొనే అవకాశం లేకపోతే వారి మనోవేదన వర్ణనాతీతం. ప్రకాశం బ్యా రేజి దిగువన సాగర సంగమం వరకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సు మారు 54కి పైగా ఘాట్లలో జలం లేదు. పుణ్యఫలం దక్కదని భక్తుల ఆం దోళన దృష్టిలో పెట్టుకుని ప్రతామ్నాయ మార్గాలతో ఆకట్టుకునే ప్రయత్నాల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణా జిల్లా కేంద్రం బందరుకు ప్రధాన కాలువ ద్వారా కృష్ణా నది నీరు వచ్చే అవకాశం లేదు. కాలేఖాన్‌పేట సమీప నాగులేరులో మున్సిపల్ అధికారులు ట్యాంకర్లతో నీటిని తెచ్చిపోశారు. మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గం కావడంతో అత్యుత్సాహంతో నదిలో పుష్కర స్నానాన్ని కాలువలో చేయించాలని భావించారు. దాదా పు 20 నీటి ట్యాంకర్లు పోసినా నాగులేరు కాలువలో స్నానాలకు నీరు సరిపడేలా లేదు. అధికార యంత్రాంగం రెం డు రోజుల వృధాప్రయాసకు తెరదించారు. ప్రకాశం బ్యాకేజి ఎగువన దుర్గాఘాట్, పున్నమిఘాట్‌లలో నీరు సమృద్ధిగానే ఉంది. దిగువన కృష్ణవేణి ఘాట్, పద్మావతి ఘాట్‌లో నీరు తగి నంత లేదు. దాదాపు 2.1 కిలోమీటర్లు చిన్న పిల్ల కాలువలో కాంక్రీట్ ఫ్లోరింగ్ చేసి ఇసుక బస్తాలతో గట్టు వేసి నీరు వదులుతున్నా అవి మొదటి రోజు మోకాలి లో తు రావడమే గగనమైంది. రెండో రోజు నడుం వరకు వచ్చేలా విడుదల చేశారు. భక్తులు అసంతృప్తికి లోనవుతుండటంతో కృష్ణవేణి, పద్మావతి ఘాట్లలలో జల్లు(షవర్)స్నానాలు ఏర్పాటు చేశారు. విజయవాడకు దిగువన యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం, మద్దూరు ఘాట్లలోను విచిత్ర పరిస్థితి నెలకొంది. నదిలో గతంలో ఇసుక తవ్వకాలతో ఏర్పడిన గుంతల్లో నిలిచిన నీటితో పుష్కరస్నానం అయ్యిందనిపిస్తున్నారు. మురికినీటిలో రోగాల బారిన పడతామనే జల్లు స్నానాలు చేస్తున్నారు. అవనిగడ్డ(దివిసీమ) ప్రాంతంలో కొత్తపేటలో జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. తీర ప్రాంతంలోని కృష్ణా నది పాయలో సముద్రపు పోటుకు వచ్చే నీటిని గజ ఈతగాళ్లు డబ్బాలతో తెచ్చి ఇస్తే భక్తులు నెత్తిన పోసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో బోరువేసి మోటారు ద్వారా జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యాకేజీ దిగువన గుంటూరు జిల్లాలో చాలా ఘాట్లలో కనీసం జల్లు స్నానాలు కూడా లేని పరిస్థితి నెలకొనడం కొసమెరుపు. -
ముఖానికి ఆవిరి ఎంత సేపు?
బ్యూటిప్స్ బ్యూటీపార్లర్లలో ఫేసియల్ చేసేటప్పుడు ముఖానికి ఆవిరిపట్టడం (స్టీమ్) చూస్తుంటాం. అయితే ఆవిరి ఎంత సమయం పట్టాలి? ఎలా పట్టాలి? అసలు ఆవిరిపట్టడం వల్ల ఉపయోగాలేమిటో ముందు తెలుసుకుంటే మనకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోతాయి. మరీ ముఖచర్మానికి దగ్గరగా ఆవిరి వేడి తగలకూడదు. షవర్ బాత్ చేసేటప్పుడు నీరు ఎంత దూరం నుంచి పడుతున్నాయో అంత దూరం నుంచి ఆవిరి చర్మానికి తగలాలి. లేదంటే చర్మం తన సహజత్వాన్ని కోల్పోవడానికి ఆవిరి ప్రధాన కారణం అవుతుంది.ఐదు నిమిషాలకు మించి ఆవిరి పట్టకూడదు. అన్ని చర్మతత్వాలూ ఒకేలా ఉండవు. అందుకని అందరికీ ఒకేవిధంగా ఆవిరిపట్టడం సరైన విధానం కాదు. దీని వల్ల చర్మంలోని పోర్స్ తెరుచుకుని, సహజసిద్ధంగా నూనె స్రవించే గ్రంథులు పొడిబారుతాయి. దీనివల్ల చర్మం త్వరగా ముడతలు రావడానికి ఆస్కారం అవుతుంది. ఆవిరి పట్టిన తర్వాత క్లెన్సర్‌తో ముఖాన్ని ఒకసారి శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల పోర్స్‌లో ఉన్న మలినాలు తొలగిపోతాయి. తర్వాత... పొడిగా ఉన్న మెత్తని టవల్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి. ఆవిరిపట్టిన తర్వాత కొంతమంది చర్మం మరీ పొడిబారినట్టుగా అనిపిస్తుంది. అందుకని ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి. ఆవిరిపట్టడం అనేది సున్నితమైన ప్రక్రియ. ముందుగా చర్మతత్వాన్ని తెలుసుకుని, దానికి తగిన విధంగా ట్రీట్మెంట్ ఇచ్చే నిపుణుల చేతనే ఫేసియల్ చేయించుకోవడం, స్టీమ్ పట్టడం మేలు. -
గంట నుంచి నిలిచిన పుష్కర స్నానాలు
ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లోని పుష్కర ఘాట్‌లో స్నానాలు నిలిచిపోయాయి. గోదావరిలో పుష్కర స్నానం ఆచరించేందుకు మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం 11 గంటల వరకు సుమారు 15 వేల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే, ఆ తర్వాత విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక్కడ గోదావరిలో సరిపడా నీరు లేకపోవడంతో షవర్లు ఏర్పాటు చేసి వాటి కింద పుష్కర స్నానానికి ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అయితే, విద్యుత్ లేకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో భక్తులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
పుష్కరవేళ.. బాసర గోదారమ్మ వెలవెల!
భైంసా (ఆదిలాబాద్): పుష్కరసంబరానికి సమయం దగ్గరపడుతుంటే ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో గోదారమ్మ వెలవెలబోతోంది. ఈ నెల 1న మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తడంతో అదే రోజు సాయంత్రానికి బాసరలో గోదావరి పరవళ్లు తొక్కింది. అయితే రెండు రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. గేట్లు ఎత్తి నీరు వదలడంతో పుష్కర భక్తులకు ఇబ్బందులు తీరుతాయని అంతా ఆశపడ్డారు. కానీ, రెండు రోజుల్లోనే బాసరలోని స్నానఘట్టాల వద్ద నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో నల్లని మట్టి పైకితేలి కనిపిస్తోంది. నదిలో రైలు, బస్సు వంతెనల మధ్య బండరాళ్లు, మట్టికుప్పలు పైకి తేలి కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే మరో తొమ్మిది రోజుల్లో ఉన్న నీరు ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీంతో భక్తుల పుణ్య స్నానాలకు ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి. మరోవైపు పుష్కరాల్లోపు వర్షాలు కురియకపోతే గోదావరిలో పల్లపు ప్రాంతాల్లో నిలిచే నీటిని పైపులతో స్నానఘట్టాలకు మళ్లించే ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. షవర్ల ద్వారా పుణ్య స్నానాలకు అవకాశం కల్పించనున్నారు.