పైపుల నీటితోనే భక్తుల పుష్కర స్నానం
మునకలు లేకుండానే మమ..!
Published Wed, Aug 17 2016 9:32 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
సాక్షి, అమరావతి :
నది ప్రవాహ సమయంలో గతంలో భక్తులు పుణ్యస్నానాలు చేసే వారు. మూడు మునకలు వేస్తే పుష్కర స్నానం అని భక్తులు భావిస్తారు. ప్రస్తు తం కృష్ణానది నీటిలో నిండా తడిసే అవకాశం లేక జల్లు స్నానాలతో పుణ్యస్నానాన్ని ము గించు కోవాల్సిన పరిస్థితి. ప్రకాశం బ్యారేజీ దిగువన సాగర సంగమం వరకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 54కు పైగా ఘాట్లలో నీళ్లు లేవు. దీంతో అధికారులు ప్రతామ్నాయాలు ఏర్పాటుచేశారు.
కృష్ణా జిల్లా కేంద్రం బందరుకు ప్రధాన కాలువ ద్వారా కృష్ణానది నీరు వచ్చే అవకాశం లేదు. కాలేఖాన్‌పేట సమీపం నాగులేరులో మున్సిపల్ అధికారులు ట్యాంకర్లతో నీటిని తెచ్చిపోశారు. మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గం కావడంతో అత్యుత్సాహంతో నది లో పుష్కర స్నానాన్ని కాలువలో చేయిం చాలని భావించారు. దాదాపు 20 నీటి ట్యాంకర్లు పోసినా నాగులేరు కాలువలో స్నానాలకు నీరు సరిపడేలా లేదు. అధికార యంత్రాంగం రెండు రోజుల వృథాప్రయాసకు తెరదించారు.
ప్రకాశం బ్యారేజీ ఎగువున దుర్గాఘాట్, పున్నమిఘాట్‌లలో నీరు సమృద్ధిగానే ఉంది. దిగువన కృష్ణవేణి ఘాట్, పద్మావతి ఘాట్‌లో నీరు తగినంత లేదు. దాదాపు 2.1 కిలోమీటర్లు చిన్న పిల్ల కాలువలా కాంక్రీట్ ఫ్లోరింగ్ చేసి ఇసుక బస్తాలతో గట్టు వేసి నీరు వదులుతున్నా మునకలకు వీలులేకపోవడంతో భక్తులు అసంతృప్తికి లోనవుతున్నారు. దీంతో కృష్ణవేణి, పద్మావతి ఘాట్లలలో జల్లు (షవర్) స్నానాలు ఏర్పాటు చేశారు.
విజయవాడకు దిగువన యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం, మద్దూరు ఘాట్లలోను విచిత్ర పరిస్థితి నెలకొంది. నదిలో గతంలో ఇసుక తవ్వకాలతో ఏర్పడిన గోతుల్లో నిలిచిన నీ టితో పుష్కరస్నానం అయ్యిందనిపిస్తున్నారు. మురికినీటిలో వ్యాధుల బారిన పడతామనే జల్లు స్నానాలు చేస్తున్నారు. అవనిగడ్డ ప్రాంతం కొత్తపేటలో జల్లు స్నానాలు ఏర్పాటుచేశారు. తీర ప్రాం తంలోని కృష్ణానది పాయలో సముద్రపు పోటుకు వచ్చే నీటిని గజఈతగాళ్లు డబ్బాలతో తెచ్చి ఇస్తే భక్తులు నెత్తిన పో సుకుంటున్నారు. గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో బోరువేసి మోటారు ద్వారా జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువున గుంటూరు జిల్లాలో చాలా ఘా ట్లలో కనీసం జల్లు స్నానాలు కూడా లేని పరి స్థితి నెలకొనడం కొసమెరుపు.
Advertisement
Advertisement