nill
-
8 రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాల నేపథ్యంలో ట్రేడర్స్ జాగ్రత్త పడ్డారు. దీంతో 8 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఇక, బుధవారం సాయంత్రం మార్కెట్లు సెన్సెక్స్ 61,193 వద్ద, నిఫ్టీ 18,090 వద్ద ముగిసింది. ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, టీసీఎస్ షేర్లు 1శాతం నష్టపోయాయి. హెచ్‌యూఎల్, ఏసియన్ పెయింట్స్, టాటా మోటార్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, నెస్లే షేర్లు భారీ లాభాలతో ముగింపు పలికాయి. -
ఎంజీ మోటారు అమ్మకాలకు కరోనా షాక్
సాక్షి,ముంబై : కరోనా ప్రభావంతో ఆటో అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. ఇప్పటికే దేశీయ కార్ల దిగ్గజం మారుతి జీరో అమ్మకాలను నమోదు చేయగా తాజాగా ఈ జాబితాలో ఎంజీ మోటార్ ఇండియా చేరింది. దేశ వ్యాప్త లాక్డౌన్ కారణంగా విక్రయాలు సున్నా శాతానికి పడిపోయాయని సంస్థ శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. కరోనా వైరస్ మహమ్మారి కట్టడి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా షోరూమ్‌లు మూసి వేయడంతో 2020 ఏప్రిల్ రిటైల్ అమ్మకాలు పడిపోయాయని ఎంజి మోటార్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఏప్రిల్ 2020 చివరి వారంలో హలోల్‌లోని తన సౌకర్యం వద్ద చిన్నస్థాయిలో కార్యకలాపాలు, తయారీని ప్రారంభించామని, దీంతో మే నెలలో ఉత్పత్తి తిరిగి పుంజుకుంటుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు స్థానిక సరఫరా చెయిన్ మద్దతు కోసం కృషి చేస్తున్నట్టు తెలిపింది. (కరోనా : అయ్యయ్యో మారుతి!) కాగా మార్చి 22న జనతా కర్ఫ్యూ అమలు, ఆ తరువాతి రోజునుంచి 21 రోజుల లాక్డౌన్ అమలైంది. అయినా వైరస్ కు అడ్డుకట్టపడకపోవడంతో పొడిగింపుతో మే 3 వరకు దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా వైరస్ బారిన పడకుండా వుండేందుకు ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని దేశప్రధాని పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశీయంగా, అంతర్జాతీయంగా రవాణా,ఇతర వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. అత్యవసర సేవలు, వస్తువుల విక్రయం మినహా అన్ని ఆర్థిక కార్యకలాపాలు నిలిచి పోయాయి. (లాక్డౌన్ పొడిగింపుపై ఇన్ఫీ మూర్తి స్పందన) (భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర) -
అభివృద్ధికి దూరంగా గూడూరు..
సాక్షి, గూడూరు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాద్‌రావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వేకువనే నిద్ర లేస్తూ.. పార్టీ కౌన్సిలర్లు, నాయకులతో కలసి పట్టణంలో ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లలో ఆయన గురువారం ప్రచారం నిర్వహించారు. మాంసం మార్కెట్లో ఎదురైన దుర్భర పరిస్థితిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కడ వస్తున్న దుర్వాసన ఎలా తట్లుకుంటున్నారంటూ అక్కడి వ్యాపారులను అడిగారు. ఇదేనా ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి అంటూ విమర్శించారు. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ నూతన మార్కెట్‌ను కట్టించేందుకు ప్రతిపాదనలు చేస్తే... ఎమ్మెల్యే ఆ పనులను సాగనివ్వలేదంటూ కొందరు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తాను ఎమ్మెల్యే అయిన మూడు నెలల్లోనే మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తానని, లేదంటే తనను నిలదీయాలని హామీ ఇచ్చారు. చేపల మార్కెట్లో మహిళలు యూరిన్‌కు వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు. ఆయన వెంట జిల్లా అధికార ప్రతినిధి నాశిన నాగులు, బొమిడి శ్రీనివాసులు, నాయకులు పడియాల శ్రీహరి, రుదీప్రెడ్డి, ఎస్సీసెల్ నాయకులు నర్సయ్య, మనోహర్, చంద్రనీల్, సురేష్, వినీల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల రుణం తీర్చుకుంటా గూడూరు రూరల్: తనను గూడూరు ప్రజలు ఆదరించి అసెంబ్లీకి పంపితే నిబద్ధతో పనిచేసి మీ రుణం తీర్చుకుంటానని వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌రావు అన్నారు. గూడూరు మండలంలోని మంగళపూరు గ్రామంలో గురువారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుని వైఎస్సార్సీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు యద్దల నరేంద్రరెడ్డి నివాసానికి వెళ్లి గూడూరు మండల నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. నామినేషన్ వేసిన తరువాత గ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేస్తానని అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకునేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా వరప్రసాద్రావును శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు అట్ల శ్రీనివాసులురెడ్డి, వెందోటి శ్రీనివాసులురెడ్డి, వెంకటేశ్వర్లు, సునీల్‌రెడ్డి, రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గూడూరు నిమ్మ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానని వెలగలపల్లి వరప్రసాద్‌రావు తెలిపారు. పట్టణ సమీపంలోని నిమ్మ మార్కెట్లో ఆయన పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నాయకులు పొనకా శివకుమార్‌రెడ్డి, తలమంచి సిద్దారెడ్డి, రూరల్ మండల అధ్యక్షుడు మల్లు విజయకుమార్‌రెడ్డి, బొమిడి శ్రీనివాసులు, డాక్టర్ రాధా జోత్స్నలత, పిట్టి నాగరాజు తదితరులతో కలసి గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. నిమ్మ పంటపై ఆధారపడిన రైతుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. -
హౌస్‌ఫుల్ నుంచి హౌస్నిల్కు థియేటర్లు
-
మునకలు లేకుండానే మమ..!
సాక్షి, అమరావతి : నది ప్రవాహ సమయంలో గతంలో భక్తులు పుణ్యస్నానాలు చేసే వారు. మూడు మునకలు వేస్తే పుష్కర స్నానం అని భక్తులు భావిస్తారు. ప్రస్తు తం కృష్ణానది నీటిలో నిండా తడిసే అవకాశం లేక జల్లు స్నానాలతో పుణ్యస్నానాన్ని ము గించు కోవాల్సిన పరిస్థితి. ప్రకాశం బ్యారేజీ దిగువన సాగర సంగమం వరకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 54కు పైగా ఘాట్లలో నీళ్లు లేవు. దీంతో అధికారులు ప్రతామ్నాయాలు ఏర్పాటుచేశారు. కృష్ణా జిల్లా కేంద్రం బందరుకు ప్రధాన కాలువ ద్వారా కృష్ణానది నీరు వచ్చే అవకాశం లేదు. కాలేఖాన్‌పేట సమీపం నాగులేరులో మున్సిపల్ అధికారులు ట్యాంకర్లతో నీటిని తెచ్చిపోశారు. మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గం కావడంతో అత్యుత్సాహంతో నది లో పుష్కర స్నానాన్ని కాలువలో చేయిం చాలని భావించారు. దాదాపు 20 నీటి ట్యాంకర్లు పోసినా నాగులేరు కాలువలో స్నానాలకు నీరు సరిపడేలా లేదు. అధికార యంత్రాంగం రెండు రోజుల వృథాప్రయాసకు తెరదించారు. ప్రకాశం బ్యారేజీ ఎగువున దుర్గాఘాట్, పున్నమిఘాట్‌లలో నీరు సమృద్ధిగానే ఉంది. దిగువన కృష్ణవేణి ఘాట్, పద్మావతి ఘాట్‌లో నీరు తగినంత లేదు. దాదాపు 2.1 కిలోమీటర్లు చిన్న పిల్ల కాలువలా కాంక్రీట్ ఫ్లోరింగ్ చేసి ఇసుక బస్తాలతో గట్టు వేసి నీరు వదులుతున్నా మునకలకు వీలులేకపోవడంతో భక్తులు అసంతృప్తికి లోనవుతున్నారు. దీంతో కృష్ణవేణి, పద్మావతి ఘాట్లలలో జల్లు (షవర్) స్నానాలు ఏర్పాటు చేశారు. విజయవాడకు దిగువన యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం, మద్దూరు ఘాట్లలోను విచిత్ర పరిస్థితి నెలకొంది. నదిలో గతంలో ఇసుక తవ్వకాలతో ఏర్పడిన గోతుల్లో నిలిచిన నీ టితో పుష్కరస్నానం అయ్యిందనిపిస్తున్నారు. మురికినీటిలో వ్యాధుల బారిన పడతామనే జల్లు స్నానాలు చేస్తున్నారు. అవనిగడ్డ ప్రాంతం కొత్తపేటలో జల్లు స్నానాలు ఏర్పాటుచేశారు. తీర ప్రాం తంలోని కృష్ణానది పాయలో సముద్రపు పోటుకు వచ్చే నీటిని గజఈతగాళ్లు డబ్బాలతో తెచ్చి ఇస్తే భక్తులు నెత్తిన పో సుకుంటున్నారు. గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో బోరువేసి మోటారు ద్వారా జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువున గుంటూరు జిల్లాలో చాలా ఘా ట్లలో కనీసం జల్లు స్నానాలు కూడా లేని పరి స్థితి నెలకొనడం కొసమెరుపు. -
26 డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు నిల్
l కేయూ పరిధిలోని కాలేజీల్లో 67 శాతం సీట్లు ఖాళీ l రెండు దశల్లో ప్రవేశాలు పొందింది 43,401 మంది విద్యార్థులే l 27 నుంచి మూడో దశ అడ్మిషన్లు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం 67 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. మెుత్తం 305 డిగ్రీ కళాశాలల్లో 1,28,080 సీట్లు ఉన్నాయి. రెండు దశల్లో 43,401 మం ది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందారు. 33 శా తం సీట్లే భర్తీ అయ్యాయి. 26 డిగ్రీ కళాశాలల్లో ఒక్క వి ద్యార్థి కూడా చేరలేదు. మరో 8 కళాశాలల్లో పది మంది లోపు విద్యార్థులే ప్రవేశాలు పొందారు. కొన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో స్వల్పంగానే ప్రవేశాలు.. హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో 1130 సీట్లకు 584 మంది ప్రవేశాలు పొందారు. పింగిళి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1000 సీట్లకు 441 మంది, మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 425 సీట్లకు 165 సీట్లు భర్తీఅయ్యాయి. మరిపెడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 220కి 28 మంది విద్యార్థులు, ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 280కి 95 మంది ,నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 600కు 127 మంది, పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 160కి 27 మంది, రంగశాయిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 220కి 31 మంది, తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 220కి 32మంది, వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 440కి 15 మంది, భూపాలపల్లి ప్రభుత్వడి గ్రీకళాశాలలో 220కి ఏడుగురు, చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 280కి 59 మంది, ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 640కి 162 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. నగరంలోని ఎల్బీ డిగ్రీ కళాశాలలో 860కి 582 మంది, సీకేఎం డిగ్రీ కళాశాలలో 780 సీట్లకు 373 మంది, హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 910 సీట్లకు 566 మంది విద్యార్థులు చేరారు. మడికొండలోని రెసిడెన్షియల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 240 సీట్లు ఉంటే కేవలం 36 మంది విద్యార్థినులే చేరారు. ఆన్‌లైన్‌పై అవగాహన లేకనే.. డిగ్రీ కళాశాలల్లో చాలా సీట్లు మిగిలిపోవడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఎంసెట్ ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాల్లో ప్రవేశాలు పూర్తికాకపోవడం లాంటి సమస్యలున్నాయి. ఆయా కోర్సుల ప్రవేశాల ప్రక్రియ పూర్తియితే మూడో దశలో కొంతమేర సీట్లు భర్తీ అవుతాయని భావిస్తున్నారు. ఆ¯Œæలైన్ దరఖాస్తులపై సరైన అవగాహన లేకపోవడంతో కొంతమంది విద్యార్థులకు రెండు దశల్లోనూ సీట్లు రాని పరిస్థితి నెలకొంది. తక్కువగా ఆప్షన్లు, ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడం వలన కూడా సీట్లు పొందలేదు. మరికొందరు పాస్వర్డ్ మరిచిపోయి రెండో దశలో వెబ్ఆప్షన్లు ఇచ్చుకోలేకపోయారు. మంచి మార్కులు వచ్చి న విద్యార్థులు కొందరు తమకు ఇష్టమైన కళాశాలను ప్రా«ధాన్యత క్రమంలో ముందుగా కాకుండా తర్వాత పేర్కొనడం వలన కూడా తమకు ఇష్టం లేని కళాశాలలో సీటు రావటంతో చేరాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు. ఓపెన్ స్కూల్ ఇంటర్ పూర్తయినవారు తప్పనిసరిగా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్‌సైన్స్ కళాశాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా చేయకుండా కొందరు వెబ్ఆప్షన్లు ఇచ్చారు. వారికి సీట్లు కేటాయించలేదు. ఇప్పుడు వచ్చి వెరిఫికేషన్ చేయించుకుంటున్నారు. మూడో దశ అడ్మిషన్లకు ఈనెల 27 నుంచి అవకాశం కల్పించారు. మెుదటి, రెండు దశల్లో సీట్లు రాని వారు, సీట్లు పొంది కళాశాలల్లో చేరనివారు, ప్రవేశాలు పొంది ఇష్టం లేకుంటే వేరే కళాశాలల్లో చేరాలనుకునే వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మూడో దశ అడ్మిషన్ల ప్రక్రియే ఇక చివరిదని భావిస్తున్నారు.