![Sensex Ends 161 Pts Lower, Nifty Below 18,100 - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/3/sensex.jpg.webp?itok=N26lodha)
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాల నేపథ్యంలో ట్రేడర్స్ జాగ్రత్త పడ్డారు. దీంతో 8 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఇక, బుధవారం సాయంత్రం మార్కెట్లు సెన్సెక్స్ 61,193 వద్ద, నిఫ్టీ 18,090 వద్ద ముగిసింది.
ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, టీసీఎస్ షేర్లు 1శాతం నష్టపోయాయి. హెచ్‌యూఎల్, ఏసియన్ పెయింట్స్, టాటా మోటార్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, నెస్లే షేర్లు భారీ లాభాలతో ముగింపు పలికాయి.
Comments
Please login to add a commentAdd a comment