- l కేయూ పరిధిలోని కాలేజీల్లో
- 67 శాతం సీట్లు ఖాళీ
- l రెండు దశల్లో ప్రవేశాలు పొందింది 43,401 మంది విద్యార్థులే
- l 27 నుంచి మూడో దశ అడ్మిషన్లు
26 డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు నిల్
Published Wed, Jul 20 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం 67 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి.
మెుత్తం 305 డిగ్రీ కళాశాలల్లో 1,28,080 సీట్లు ఉన్నాయి. రెండు దశల్లో 43,401 మం ది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందారు. 33 శా తం సీట్లే భర్తీ అయ్యాయి. 26 డిగ్రీ కళాశాలల్లో ఒక్క వి ద్యార్థి కూడా చేరలేదు. మరో 8 కళాశాలల్లో పది మంది లోపు విద్యార్థులే ప్రవేశాలు పొందారు.
కొన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో స్వల్పంగానే ప్రవేశాలు..
హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో 1130 సీట్లకు 584 మంది ప్రవేశాలు పొందారు. పింగిళి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1000 సీట్లకు 441 మంది, మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 425 సీట్లకు 165 సీట్లు భర్తీఅయ్యాయి. మరిపెడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 220కి 28 మంది విద్యార్థులు, ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 280కి 95 మంది ,నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 600కు 127 మంది, పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 160కి 27 మంది, రంగశాయిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 220కి 31 మంది, తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 220కి 32మంది, వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 440కి 15 మంది, భూపాలపల్లి ప్రభుత్వడి గ్రీకళాశాలలో 220కి ఏడుగురు, చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 280కి 59 మంది, ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 640కి 162 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. నగరంలోని ఎల్‌బీ డిగ్రీ కళాశాలలో 860కి 582 మంది, సీకేఎం డిగ్రీ కళాశాలలో 780 సీట్లకు 373 మంది, హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 910 సీట్లకు 566 మంది విద్యార్థులు చేరారు. మడికొండలోని రెసిడెన్షియల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 240 సీట్లు ఉంటే కేవలం 36 మంది విద్యార్థినులే చేరారు.
ఆన్‌లైన్‌పై అవగాహన లేకనే..
డిగ్రీ కళాశాలల్లో చాలా సీట్లు మిగిలిపోవడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఎంసెట్ ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాల్లో ప్రవేశాలు పూర్తికాకపోవడం లాంటి సమస్యలున్నాయి. ఆయా కోర్సుల ప్రవేశాల ప్రక్రియ పూర్తియితే మూడో దశలో కొంతమేర సీట్లు భర్తీ అవుతాయని భావిస్తున్నారు. ఆ¯Œæలైన్ దరఖాస్తులపై సరైన అవగాహన లేకపోవడంతో కొంతమంది విద్యార్థులకు రెండు దశల్లోనూ సీట్లు రాని పరిస్థితి నెలకొంది. తక్కువగా ఆప్షన్లు, ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడం వలన కూడా సీట్లు పొందలేదు. మరికొందరు పాస్‌వర్డ్ మరిచిపోయి రెండో దశలో వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోలేకపోయారు. మంచి మార్కులు వచ్చి న విద్యార్థులు కొందరు తమకు ఇష్టమైన కళాశాలను ప్రా«ధాన్యత క్రమంలో ముందుగా కాకుండా తర్వాత పేర్కొనడం వలన కూడా తమకు ఇష్టం లేని కళాశాలలో సీటు రావటంతో చేరాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు. ఓపెన్ స్కూల్ ఇంటర్ పూర్తయినవారు తప్పనిసరిగా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్‌సైన్స్ కళాశాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా చేయకుండా కొందరు వెబ్‌ఆప్షన్లు ఇచ్చారు. వారికి సీట్లు కేటాయించలేదు. ఇప్పుడు వచ్చి వెరిఫికేషన్ చేయించుకుంటున్నారు. మూడో దశ అడ్మిషన్లకు ఈనెల 27 నుంచి అవకాశం కల్పించారు. మెుదటి, రెండు దశల్లో సీట్లు రాని వారు, సీట్లు పొంది కళాశాలల్లో చేరనివారు, ప్రవేశాలు పొంది ఇష్టం లేకుంటే వేరే కళాశాలల్లో చేరాలనుకునే వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మూడో దశ అడ్మిషన్ల ప్రక్రియే ఇక చివరిదని భావిస్తున్నారు.
Advertisement
Advertisement