Ku
-
31న టీఎస్ ఐసెట్ ఫలితాలు
► కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ వెల్లడి వరంగల్: తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను ఈనెల 18న నిర్వహించిన టీఎస్ ఐసెట్-2017 పరీక్ష ఫలితాలు ఈనెల 31న విడుదల చేయనున్నట్టు టీఎస్ ఐసెట్ కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ సోమవారం వెల్లడించారు. ఈనెల 30వ తేదీనే ఫలితాలను విడుదల చేయాలని తొలుత షెడ్యూల్లో ప్రకటించామని, కానీ, ఈనెల 31న సాయంత్రం 4 గంటలకు హైదారాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేస్తామన్నారు. ఐసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 71,172 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఈనెల 21న ప్రాథమిక కీ విడుదల చేసి 27వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించామన్నారు. 60 నుంచి 70 వరకు అభ్యంతరాలు వచ్చాయని ప్రొఫెసర్ ఓంప్రకాశ్ చెప్పారు. హైదరాబాద్‌లో బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టిపాపిరెడ్డి, కేయూ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న ఫలితాలు విడుదల చేస్తారని, అదేరోజు ఫైనల్ కీ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. -
కేయూలో ఘనంగా ఫార్మసీ డే వేడుకలు
కేయూ క్యాంపస్ : తెలంగాణ ఫార్మా స్టూడెంట్స్ అసోసియేషన్ (టీపీఎస్ఏ) ఆధ్వర్యంలో ఆదివారం కాకతీయ యూనివర్సిటీలో వరల్డ్ ఫార్మసీ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అమ్మ వేణు కేక్ కట్ చేసి మాట్లాడారు. సమాజంలో ఫార్మసిస్ట్ డేకు తగిన గౌరవం లేకపోవడం విచారకరమన్నారు. ఫార్మసీ లైసెన్సులను అద్దెకు ఇచ్చే సంస్కృతి తొలగిపోయి సొంతంగా మెడికల్ షాపులను నిర్వహించినప్పుడే అందరికి తగిని వైద్యం లభిస్తుందన్నారు. ఇతర దేశాలల్లో ఫార్మసిస్టుకు డాక్టర్‌తో సమానంగా గౌరవం ఉంటుందన్నారు. 1948 ఫార్మసీ యాక్ట్ అమలుకు నోచుకోవటంలేదని తెలిపారు. కార్యక్రమంలో టీపీఎస్ఏ బాధ్యులు డాక్టర్ మహేందర్‌రెడ్డి, అల్లి రమేష్, దినేష్, హరిహాసన్, క్రాంతి, ప్రశాంత్, రాకేష్, ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు. -
సింధును స్ఫూర్తిగా తీసుకోవాలి
కేయూ స్పోర్ట్స్ సెక్రెటరీ జి.పాణి ముగిసిన అంతర్ కళాశాలల క్రీడాపోటీలు భీమారం : ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాన్ని సాధించిపెట్టిన సింధూను మహిళా క్రీడాకారిణులు ఆదర్శంగా తీసుకోవాలని కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ సెక్రెటరీ జి.పాణి అన్నారు. కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన అంతర్ కళాశాలల ఉమెన్స్ క్రీడాపోటీలు శనివారం ముగిశాయి. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమానికి పాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాపోటీల్లో గెలుపోటములు సహజమన్నారు. అనంతరం కిట్స్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ క్రీడలు మానసిక వికాసానిక దోహçదపడుతాయన్నారు. కేయూ పరిధిలోని ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి విద్యార్థినులు ఈ పోటీల్లో పాల్గొన్నారన్నారు. వివిధ విభాగాల పోటీలలో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆర్గనైజింగ్ సెక్రెటరీ రమేష్‌రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, వివిధ కళాశాలలకు చెందిన పీడీలు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా జట్ల జయకేతనం.. బాస్కెట్‌బాల్‌లో వరంగల్ కిట్స్ కళాశాల జట్టు విజేతగా నిలిచింది. క్రాస్ కంట్రీ పోటీల్లో హన్మకొండ కేజీసీ కాలేజీకి చెందిన ఎ.స్వప్న మొదటి బహుమతిని కైవసం చేసుకుంది. చెస్‌లో వరంగల్ ఈస్ట్ పరిధిలోని టీఎస్డీఆర్సీ కాలేజీ, హ్యాండ్‌బాల్ విభాగంలో వరంగల్ కిట్స్ జట్టు రన్నరప్‌గా నిలిచాయి. కబడ్డీ విభాగంలో కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టు, టేబుల్ టెన్నిస్‌లో వరంగల్ కిట్స్ జట్టు, వాలీబాల్‌లో హన్మకొండ ఎస్సార్ డిగ్రీ కళాశాల జట్టు రన్నరప్‌గా నిలిచాయి. -
నేడు టీఎస్ ఎంసెట్–3
కేయూ క్యాంపస్ : రాష్ట్రంలోని వైద్య విద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులో ప్రవేశాలు కల్పించేందుకు ఆదివారం ఎంసెట్–3 పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ రీజినల్ కోఆర్డినేటర్, కాకతీయ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి తెలిపారు. టీఎస్ ఎంసెట్–3కు 4,710 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. నేడు(ఆదివారం) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. వరంగల్ నగరంలో 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. హన్మకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కేయూలోని కో ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్ కళాశాల, యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల, హ్యుమానిటీస్ భవనం, యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల, వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాల, వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఎల్బీ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఏర్పాట్లు పూర్తి ఎంసెట్–3 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని రీజినల్ కోఆర్డినేటర్ మల్లారెడ్డి తెలిపారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో నిర్దేశించిన సమయానికి విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందుగానే(9 గంటల వరకు) చేరుకోవాలని సూచించారు. నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రలు, ఫొటోలను సేకరించాల్సి ఉన్నందున విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం మంచిదన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 8 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 12 మంది పరిశీలకులు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 8 మంది ఎన్ఫోర్స్మెంట్ అధికారులను నియమించామన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి నలుగురు, జేఎన్టీయూ నుంచి మరో నలుగురు ప్రత్యేక పరిశీలకులు పర్యవేక్షిస్తారన్నారు. విద్యార్థులు గడియారాలు, సెల్ఫోన్లు లేదా ఇతర ఎలక్రానిక్ పరికరాలు తీసుకెళ్లొద్దన్నారు. ఇక పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తారని మల్లారెడ్డి తెలిపారు. కేయూ ఆవరణలో నాలుగు పరీక్ష కేంద్రాలు.. కాకతీయ యూనివర్సిటీ ఆవరణలో నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మల్లారెడ్డి తెలిపారు. ఇందులో కోఎడ్యుకేషన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రం కెనాల్ ప్రాంతంలో ఉంటుందన్నారు. అక్కడ పరీక్ష రాయాల్సిన విద్యార్థులు యూనివర్సిటీ గేట్ల నుంచి కాకుండా యూనివర్సిటీ రోడ్డులోని డబ్బాలు వయా గుండ్ల సింగారం రోడ్డు మీదుగా కోఎడ్యుకేషన్ కళాశాలకు చేరుకోవచ్చని తెలిపారు. -
16 నుంచి బీ ఫార్మసీ పరీక్షలు
కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 16 నుంచి బీ ఫార్మసీ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16, 19, 21, 23, 26, 28 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, 17వ తేదీ నుంచి మూడో సంవత్సరం విద్యార్థులకు రెండో సెమిస్టర్ పరీక్షలు జ రుగుతాయని వివరించారు. థర్డ్ ఇయర్ వారికి 17న పేపర్–1 మెడిసినల్ కెమిస్ట్రీ–1 (నేచురల్ ప్రొడక్ట్), 20న పేపర్–2 ఫార్మాకాగ్నసీ, 22న థర్డ్పేపర్ ఫార్మకాలజీ, 24న పేపర్–4 ఫార్మస్యూటికల్ జూరిప్రుడెన్స్ పరీక్ష నిర్వహిస్తామని పే ర్కొన్నారు. మూడో సంవత్సరం వారికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు జరుగుతాయన్నారు. -
కేయూ ఎకనామిక్స్ విభాగాధిపతిగా సురేష్‌లాల్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఎకనామిక్స్ విభాగం అధిపతిగా అసోసియేట్ ప్రొఫెసర్ బి.సురేష్‌లాల్ నియామకమయ్యారు. ఈమేరకు ఇన్చార్జి రిజి స్ట్రార్ ప్రొఫెసర్ జి.బెనర్జీ ఉత్తర్వులు జారీ చేయగా ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఎకనామి క్స్ విభాగంలో ఇరవై ఏళ్లుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న సురేష్‌లాల్ కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ బా ధ్యతలు కూడా నిర్వర్తించారు. ఇప్పటివరకు ఆయన రాసిన 76 పరిశోధన పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితం కాగా, పదహారు పుస్తకాలను రచించారు. ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ ఎన్ఎస్ఎస్ జాతీయ అవా ర్డు, అమెరికా అధ్యక్షుడు ప్రదానం చేసే లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు, రాష్ట్రస్థాయి ఉత్తమ ఎన్ఎస్ఎస్ అవార్డును ఆయన 2014లో అందుకున్నారు. కాగా, రెండేళ్ల పాటు ఆయ న ఎకనామిక్స్ విభాగాధిపతిగా కొనసాగనున్నారు. అడ్మిషన్ల డైరెక్టర్, జేడీల కొనసాగింపు కాకతీయ యూనివర్సిటీ అడ్మిషన్ల డైరెక్టర్‌గా ఉన్న జువాలజీ విభాగం ప్రొఫెసర్ ఎం.కృష్ణారెడ్డిని కొనసాగిస్తూ ఇన్చార్జి రిజిస్ట్రార్ జి.»ñ నర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, అడ్మిషన్ల జాయింట్ డైరెక్టర్లుగా ఉన్న జువాలజీ విభాగానికి చెందిన డాక్టర్ వై.వెంక య్య, ఫిజిక్స్ విభాగానికి చెందిన డాక్టర్ లక్ష్మణ్‌ను కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నా రు. వీరి పదవీకాలం గత నెల 30న ముగియగా మళ్లీ కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. -
దూరవిద్య డిగ్రీ పరీక్షల్లో 70 మంది డిబార్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య కేంద్రం(ఎస్డీఎల్సీఈ) డిగ్రీ మెుదటి, చివరి సంవత్సరం శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు వివిధ పరీక్ష కేంద్రాల్లో కాపీయింగ్‌కు పాల్పడిన 70 మందిని డిబార్ చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.పురుషోత్తం, అదనపు పరీక్షల నియంత్రణాధికారి సీహెచ్.రాజేశం తెలిపారు. కాగా, వివిధ పరీక్ష కేంద్రాలను కేయూ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్.దినేష్‌కుమార్ పరిశీలించారు. -
కొలిక్కి వచ్చిన అబ్జర్వర్ల నియామకం
దూర విద్య డిగ్రీ, పీజీ పరీక్షల్లో రెగ్యులర్ అధ్యాపకులకే విధులు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు సెప్టెంబర్ 3 నుంచి, పీజీ పరీక్షలు 4 నుంచి జరుగనున్నాయి. ఈ పరీక్షలకు అబ్జర్వర్లుగా విధులు నిర్వర్తించేందుకు విపరీతంగా పోటీ పెరిగింది. పలువురు అబ్జర్వర్లు తాము కోరుకున్న చోటే డ్యూటీ వేయాలని అధికారులను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కమిటీ సభ్యులతో చర్చించిన కేయూ వీసీ, ప్రొఫెసర్ సాయన్న ఓ నిర్ణయానికి వచ్చారు. మెుత్తం 91 పరీక్ష కేంద్రాలు కేయూతో పాటు శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ, ఉస్మానియా తదితర విశ్వవిద్యాలయాల పరి ధిలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఉన్నాయి. ఆయా యూనివర్సిటీల పరిధిలోని దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్ష కేంద్రాల్లో అక్కడి కళాశాలల రెగ్యులర్ అధ్యాపకులకే అబ్జర్వర్లుగా డ్యూటీలు వేయాలని కేయూ వీసీ ఆర్.సాయన్న పలువురు వీసీలకు ఫోన్ చేసి కోరారు. అందుకు ఆయా వర్సిటీల వీసీలు కూడా అంగీకరించారు. కాగా, ఆదిలాబాద్ జిల్లాలోని పరీక్షా కేంద్రాలకు అబ్జర్వర్ల నియామక బాధ్యతలను కూడా తెలంగాణ వర్సిటీ వీసీకి అప్పగించారు. దీంతో ఎక్కువ శాతం అబ్జర్వర్ల డ్యూటీలు వేసే విషయంలో సమ స్య పరిష్కారమైంది. ఇక కేయూ పరిధిలోని వరంగల్ జిల్లాలో 10, ఖమ్మం జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాలున్నాయి. వీటిలోనూ ఈ యూనివర్సిటీలోని రెగ్యులర్ లెక్చరర్లను అబ్జర్వర్లుగా డ్యూటీలు వేయబోతున్నారని సమాచారం. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్ట్ టైం, కాంట్రాక్టు లెక్చరర్లకు డ్యూటీలు వేయకపోవచ్చని భావిస్తున్నారు. పరీక్షలకు రెండు రోజులే మిగిలి ఉండటం గమనార్హం. -
తొలి దశ పీజీ అడ్మిషన్లు పూర్తి
∙7,275 సీట్ల భర్తీ ∙25,26 తేదీల్లో రెండో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకిగానూ తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. పీజీ కోర్సుల్లో మొత్తం 13,943 సీట్లు ఉండగా, వాటిలో మొదటి విడతగా 7,275 మంది వి ద్యార్థులు కళాశాలల్లో చేరినట్లు కే యూ అడ్మిషన్ల విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. కృష్ణారెడ్డి, జా యింట్ డైరెక్టర్లు డాక్టర్ వై.వెంకయ్య, డాక్టర్ జె. లక్ష్మణ్‌నాయక్ బు««దlవారం తెలిపారు. మెుత్తం 38 కోర్సుల్లో చేరిన విద్యార్థుల వివరాలు, మిగితా ఖాళీల వివరాలను కళాశాలలవారీగా వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. గతంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకానివారు, తొలిదశలో సీట్లు పొందలేకపోయిన వారు 25,26 తేదీల్లో అడ్మిషన్ల ప్రక్రియకు హాజరుకావాలన్నారు. వీరు ఈనెల 26 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నారు. మొదటిదశలో సీట్ల కేటాయింపు పూర్తయి, కళాశాలల్లో చేరిన విద్యార్థులు ఈనెల 25 నుంచి 30 వరకు స్లైడింగ్ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. సీట్ల కేటాయింపునకు సంబంధించిన రెండో జాబితాను సెప్టెంబర్ 2న ప్రకటిస్తామన్నారు. వారంతా వచ్చే నెల 6లోగా ఫీజు చెల్లించి కళాశాలల్లో చేరొచ్చన్నారు. పూర్తి వివరాలకు కేయూ వెబ్సైట్లో చూడాలన్నారు. ప్రవేశ పరీక్షలు లేని సంస్కృతం ,హిందీ, ఎంఐటీ, ఉర్దూ, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ , నానో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 24న అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
కేయూ పీజీ సీట్ల అలాట్మెంట్ జాబితా విడుదల
ఈనెల 20న కళాశాలల్లో రిపోర్టు చేయాలి కేయూ క్యాంపస్ : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు సీట్ అలాట్మెంట్ జాబితాను కేయూ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న సోమవారం విడుదల చేశారు. విద్యార్థులు ఎంచుకున్న వెబ్ ఆప్షన్ల ప్రాధాన్యతలను బట్టి కంప్యూటర్ సహాయంతో జాబితా తయారు చేశారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఈనెల 20వతేదీ వరకు విద్యార్హతలు తదితర ఒరిజనల్ సర్టిఫికెట్లతో కెటాయించిన కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.కృష్ణారెడ్డి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వై.వెంకయ్య, డాక్టర్ జె.లక్ష్మణ్‌నాయక్ తెలిపారు. విద్యార్థులకు ఎస్ఎంఎస్ ద్వారా సీట్ల కెటాయింపు సమాచారం తెలియజేశామని, ఏకళాశాలలో సీటు లభించిందో తెలుసుకునేందుకు ఈనెల 16న యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా లేదా అడ్మిషన్ల డైరెక్టరేట్‌లో సంప్రదిచ్చవచ్చని చెప్పారు. సీటు పొందిన విద్యార్థులు ముందుగా ఎస్బీఐ ఆన్లైన్ ద్వారా లేదా ఎస్బీఐ బిల్yð స్క్ ద్వారా ఫీజు చెల్లించాలని, 24 గంటల తరువాత అడ్మిషన్ కార్డును డౌన్లోడు చేసుకోవాలని సూచించారు. అడ్మిషన్కార్డు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 20న సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాలన్నారు. గతంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాని అభ్యర్థులు ఈనెల 25, 26 తేదీల్లో కేయూ అడ్మిషన్ల డైరెక్టరేట్‌లో వెరిఫికేషన్ చేయించుకోవచ్చని, వీరు ఈనెల 26నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వివరించారు. సీటు అలాట్మెంట్ రెండవ జాబితాను సెప్టంబర్ 2న ప్రకటిస్తామని, సెప్టంబర్ 6 వరకు ఫీజు చెల్లించి కళాశాలల్లో చేరవచ్చని, పూర్తివివరాలకు కేయూ వెబ్సైట్, అడ్మిషన్ల వెబ్సైట్లో చూసుకోవచ్చని చెప్పారు. ప్రవేశ పరీక్షలు లేని కోర్సులకు 24న సర్టిఫికెట్ల పరిశీలన కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో ప్రవేశపరీక్షలులేని సంస్కృతం, హిందీ, ఎంఐటీ, ఉర్దూ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ పీజీ కోర్సులకు ఈనెల 24న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, సీట్ అలాట్మెంట్ కూడా చేస్తారని సంబంధిత అడ్మిషన్ల డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. -
17 నుంచి కేయూ దూరవిద్య డిగ్రీ పరీక్షలు
కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య డిగ్రీ బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ పరీక్షలు ఈనెల 17 నుంచి నిర్వహించనున్నారు. ఈమేరకు మంగళవారం కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్ తెలిపారు. డిగ్రీ కోర్సుల ప్రథమ, ఫైనల్ ఇయర్ పరీక్షలు ఈనెల 17 నుంచి జరుగుతాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1 వరకు ఫస్టియర్ పరీక్షలు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఈనెల 18 నుంచి సెప్టంబర్ 2 వరకు, ఫైనల్ ఇయర్ పరీక్షలు ఈనెల 17నుంచి సెప్టెంబర్ 2 వరకు జరుగుతాయని వివరించారు. ఫైనల్ ఇయర్ పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఫస్టియర్ పరీక్ష లు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఈపరీక్షలు 45వేల మందికిపైగా పరీక్షలు రాయబోతున్నారు. కేయూ దూరవిద్య పీజీ పరీక్షలు కేయూ దూరవిద్య పరిధిలోని పీజీ కోర్సుల ఎంఏ, ఎంకామ్, హెచ్ఆర్ఎం, రూరల్‌డెవలప్‌మెంట్, ఎమ్మెస్సీమ్యాథ్స్, ఎల్ఎల్ఎం ఫైనల్ఇయర్ పరీక్షలు ఈనెల 18 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ పురుషోత్తమ్ తెలిపారు. సెప్టెంబర్ 3 వరకు మ«ధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. దూరవిద్య పీజీ కోర్సుల మొదటి సంవత్సరం పరీక్షలు ఈనెల 20నుంచి సెప్టెంబర్ 3వతేదీ వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటాయని వివరించారు. -
లక్ష్యసాధనకు కృషి చేయాలి
ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుమతి ఉమామహేశ్వరి కేయూక్యాంపస్ : ఉన్నత లక్ష్యాల ను సాధించేం దు కు విద్యార్థినులు కృషి చేయాలని కాకతీయ యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుమతి ఉమామహేశ్వరి అన్నారు. సోమవారం ఇంజనీరింగ్ కళాశాలలో ఈ విద్యాసంవత్స రం.. బీటెక్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థినులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిం చారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థినులు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం టాస్క్ పాప్ బెన్సన్‌చే విద్యార్థినులకు సైకాలజీ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ నర్సింహారెడ్డి, డాక్టర్ సలీమ్, డాక్టర్ ఎన్.వీణ, డాక్టర్ ఎన్.స్వాతి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాల కోసం నిరీక్షణ
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరి«ధిలోని బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ రీవాల్యుయేషన్ ఫలితాల కోసం విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 12న ఆయా డిగ్రీ కోర్సుల వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల చేశారు. జూన్ 13 నుంచి 15 రోజులపాటు రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు స్వీకరించారు. సుమారు 14 వేల మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. 40 రోజులు గడిచినా ఇంకా ఫలితాలు ఇవ్వలేదు. రీవాల్యుయేషన్ కోసం వచ్చిన దరఖాస్తులతో ఆయా విద్యార్థులు ఏ సబ్జెక్టు పేపర్‌కు రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు చేశారో ఆయా సబ్జెక్టుల జవాబు పత్రాలను మళ్లీ ఇతర యూనివర్సిటీల అధ్యాపకులతో రీవాల్యుయేషన్ చేయించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇంకా పదిరోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుందని భావిస్తున్నారు. పది రోజుల తర్వాత పరీక్షల విభాగం అ«ధికారులు ఫలితాలను వెల్లడించే అవకాశాలున్నాయి. ఎంతమంది విద్యార్థులకు బెనిఫిట్స్ జరుగుతుందో వేచి చూడాల్సిందే. -
బాటనీ పరీక్షా ఫలితాలెన్నడో..?
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరధిలో ఎమ్మెస్సీ బాటనీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు జరిగి ఆరు నెలలు గడుస్తున్నా ఫలితాలు మా త్రం విడుదల కావడం లేదు. ఈ ఏడాది జనవరిలో జరిగిన పరీక్షకు సుమారు 700 మంది వి ద్యార్థులు హాజరయ్యారు. మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలు ఇవ్వకుండానే వారికి రెండో సెమిస్టర్ పరీక్షలు కూడా ఈ ఏడాది మే–జూన్ లో నిర్వహించారు. ఇప్పుడు ఆ విద్యార్థులు ఎమ్మెస్సీ ఫైనల్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ క్లాస్‌లకు హాజరవుతున్నారు. అయినా ఇప్పటివరకు మొ దటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలు ఇవ్వకపోవడం గమనార్హం. వాస్తవానికి పరీక్షలు జరిగిన 44రోజుల్లో ఫలితాలు ఇవ్వాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వాల్యూయేషన్‌ను సకాలంలో నిర్వహించడంలో సంబంధిత అధికారు ల నిర్లక్ష్యం వల్లే ఫలితాల వెల్లడిలో ఆలస్యమవు తోందని తెలుస్తోంది. -
డిగ్రీ కళాశాలల్లో సగం సీట్లు ఖాళీ!
కేయూ పరిధిలో ముగిసిన మూడో దశ దరఖాస్తు గడువు రెండు దశల్లో కలిపి 43,578 మందికి ప్రవేశాలు రేపు సీట్ల కేటాయింపు ఇప్పటివరకు 26 కళాశాలల్లో ప్రవేశాలే లేవు.. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ కళాశాలల్లో ఈ ఏడాది సగానికి పైగా సీట్లు ఖాళీగానే ఉండనున్నాయి. యూనివర్సిటీ పరిధిలో 1,28,080 సీట్లు ఉన్నాయి. ఇప్పటివరకు మూడు దశల్లో ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. మొదటి దశలో 41,909, రెండో దశలో 17,563 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. పలువురు వెబ్ ఆప్షన్లు ఇవ్వలేదు. రెండు దశల్లో కలిపి మొత్తంగా 43,578 మంది విద్యార్థులు వివిధ కళాశాలల్లో ప్రవేశాలు పొందారు. కాగా, యూనివర్సటీ పరిధిలోని 26 డిగ్రీ కళాశాలల్లో అసలు ఒక్కరు కూడా చేరకపోవడం గమనార్హం. మరో ఎనిమిది కళాశాలల్లో పది మంది లోపు విద్యార్థులే చేరారు. దీంతో ఆయా కళాశాలలను మూసివేయక తప్పదనే భావన నెలకొంది. మూడో దశలో 4,943 దరఖాస్తులు యూనివర్సిటీ పరిధిలోని పెద్దసంఖ్యలో కళాశాలల్లో సీట్లు ఖాళీగా ఉండడంతో మళ్లీ మూడో దశలో దరఖాస్తులు స్వీకరించారు. గతంలో దరఖాస్తు చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోని వారు, మొదటి దశలో సీట్లు రాని వారు, కొందరు కళాశాలల్లో చేరినా మార్పు కోసం మళ్లీ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఈ దశలో అవకాశం కల్పించారు. అయితే, మూడో దశలో ఆన్లైన్ దరఖాస్తు గడువు శనివారం ముగియగా మొత్తం 4,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 492మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే, ఈ దశలో దరఖాస్తు చేసుకున్న వారికి, గతంలో దరఖాస్తులు చేసి ఇప్పుడు వెబ్‌ఆఫ్షన్లు ఇచ్చుకున్న వారికి, కళాశాలల మార్పునకు ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి మంగళవారం సీట్ల కేటాయింపు జరగనుంది. ఆయా విద్యార్థులు 4వ తేదీన కళాశాలల్లో చేరా>ల్సి ఉంటుంది. మూడో దశ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసే నాటికి మొత్తంగా యూనివర్సిటీ పరిధిలో 1,28,080 సీట్లలో 50శాతం సీట్లు కూడా భర్తీ అవుతాయా అనేది అనుమానంగా ఉంది. 50శాతంలోపే సీట్లు భర్తీ అవుతాయని భావిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన అడ్మిషన్లలో యూనివర్సిటీ పరిధిలో కొన్ని కళాశాలల్లో సీట్లు ఎక్కువ శాతం మేర భర్తీ కాగా మరికొన్ని కళాశాలల్లో అంతంత మాత్రంగానే సీట్లు నిండాయి. ఇక కొన్ని రకాల కాంబినేషన్ కోర్సులకైతే అసలే ఆదరణ లేనట్లు సమాచారం. అలాగే, పలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరినట్లు తెలుస్తోంది. మూడో దశ సీట్ల కేటాయింపు, విద్యార్థుల చేరిక ప్రక్రియ పూర్తయితే తప్ప ఎన్ని సీట్లు మిగిలిపోతాయనే అంశం తేలనుంది. కాగా, 4వ తేదీ నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. -
పీజీలో ప్రవేశానికి చివరి అవకాశం
కేయూ క్యాంపస్ : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు చివరి అవకాశం కల్పిస్తున్నట్లు కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. కృష్ణారెడ్డి, జాయింట్ డైరెక్టర్లు డాక్టర్ జె.లక్ష్మణ్‌నాయక్ తెలిపారు. ఇప్పటివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోని అభ్యర్థులు ఈనెల 29, 30వ తేదీల్లో కామర్స్ విభాగంలో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించారు. పీజీలో ప్రవేశానికి ఇదే చివరి అవకాశమని అభ్యర్థులు గమనించాలని పేర్కొన్నారు. అలాగే, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే గడువు ఆగస్టు 5వ తేదీతో ముగియనుందని తెలిపారు. అయితే, గతంలో ఆప్షన్లు ఇచ్చుకోని అభ్యర్థులకు ఆగస్టు 6, 7వ తేదీల్లో అవకాశం కల్పిస్తున్నట్లు వారు వివరించారు. -
వీసీలుగా కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్లు
తెలంగాణ యూనివర్సిటీకి సాంబయ్య అంబేద్కర్ ఓపెన్‌కు సీతారామారావు జిల్లా నుంచి వీసీలుగా నియామకమైన ముగ్గురు ప్రొఫెసర్లు కేయూ క్యాంపస్ : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కాకతీయ యూనివర్సిటీ నుంచి ముగ్గురు ప్రొఫెసర్లకు వీసీలుగా అవకాశం కల్పించింది. ఇప్పటికే నల్లగొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా కేయూ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్‌హుస్సేన్‌ను నియమించిన విషయం తెలిసిందే. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ వీసీగా కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ పి. సాంబయ్యను, హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా రిటైర్డ్ ప్రొఫెసర్ కె. సీతారామారావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1992లో కేయూలో సాంబయ్య నియామకం వరంగల్ జిల్లా పరకాల మండలంలోని నాగారం గ్రామానికి చెందిన సాంబయ్య ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన కాకతీయ యూనివర్సిటీలోనే పీజీ, పీహెచ్డీ పూర్తి చేశారు. 1984లో హన్మ కొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. 1992లో కేయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకమయ్యారు. అలాగే యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతిగా, బీఓఎస్‌గా, కేయూ హాస్టళ్ల డైరెక్టర్‌గా, కేయూ అడ్మిషన్ల డైరెక్టర్‌గా పనిచేసి గత ఏడాది ఉద్యోగ విరమణ పొందారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న సాంబయ్య సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా కూడా మెదిలారు. ఈ క్రమంలో వీసీల నియామకాల్లో సామాజిక వర్గాల సమీకరణలో ఎస్సీ మాదిగ నుంచి ప్రభుత్వం సాంబయ్యకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆయనను నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ వీసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీతారామారావును వరించిన అవకాశం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రిటైర్డ్ ప్రొఫెసర్ కె. సీతారామారావు నియామకమయ్యారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపెల్లికి చెందిన సీతారామారావు హన్మకొండలోని గోపాలపురంలో స్థిరపడ్డారు. ఆయన కేయూలోనే ఎంఏ, ఎం ఫిల్, పీహెచ్డీ పూర్తి చేశారు. 1978–1987లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, 1987–1995లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా కేయూ లో పనిచేశారు. అనంతరం 1999 నుంచి ప్రొఫెసర్‌గా పనిచేసి రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. సీతారామారావు 2011లో కేయూ యూజీసీ కోఆర్డినేటింగ్ ఆఫీసర్‌గా, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ డైరెక్టర్‌గా, 2002లో ఎస్డీఎల్సీఈ జాయింట్ డైరెక్టర్‌గా, డిప్యూటీ డైరెక్టర్‌గా, కేయూ లైబ్రరీ ఇన్చార్జిగా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతితోపాటు పలు పదవులు చేపట్టారు. దివంగత ప్రొఫెసర్లు కొత్తపెల్లి జయశంకర్, బియ్యాల జనార్ధన్‌రావు, బుర్ర రాములుతో కలిసి పలు ప్రజాస్వామిక ఉద్యమాల్లో పనిచేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేయూ నుంచి కీలకపాత్ర పోషించారు. వీసీ నియామకం కోసం కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నంలో సీతారామారావు సఫలీకృతులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం మెుత్తంగా జిల్లా నుంచి ముగ్గురు ప్రొఫెసర్లకు వీసీలుగా బాధ్యతలు కట్టబెట్టారు. -
28,30 తేదీల్లో కేయూ ప్రీపీహెచ్‌డీ పరీక్షలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని మ్యా«థమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జూవాలజీ, బయోటెక్నాలజీ, బయెకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జీయాలజీ, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మసీ పరిశోధకులకు ఈనెల 28,30 తేదీల్లో ప్రీపీహెచ్‌డీ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వి. రాంచంద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28న రీసెర్చ్ మెథడాలజీ, 30న ఎలెక్టివ్ పేపర్ (స్పెషలైజేషన్) పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
26 డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు నిల్
l కేయూ పరిధిలోని కాలేజీల్లో 67 శాతం సీట్లు ఖాళీ l రెండు దశల్లో ప్రవేశాలు పొందింది 43,401 మంది విద్యార్థులే l 27 నుంచి మూడో దశ అడ్మిషన్లు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం 67 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. మెుత్తం 305 డిగ్రీ కళాశాలల్లో 1,28,080 సీట్లు ఉన్నాయి. రెండు దశల్లో 43,401 మం ది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందారు. 33 శా తం సీట్లే భర్తీ అయ్యాయి. 26 డిగ్రీ కళాశాలల్లో ఒక్క వి ద్యార్థి కూడా చేరలేదు. మరో 8 కళాశాలల్లో పది మంది లోపు విద్యార్థులే ప్రవేశాలు పొందారు. కొన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో స్వల్పంగానే ప్రవేశాలు.. హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో 1130 సీట్లకు 584 మంది ప్రవేశాలు పొందారు. పింగిళి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1000 సీట్లకు 441 మంది, మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 425 సీట్లకు 165 సీట్లు భర్తీఅయ్యాయి. మరిపెడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 220కి 28 మంది విద్యార్థులు, ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 280కి 95 మంది ,నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 600కు 127 మంది, పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 160కి 27 మంది, రంగశాయిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 220కి 31 మంది, తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 220కి 32మంది, వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 440కి 15 మంది, భూపాలపల్లి ప్రభుత్వడి గ్రీకళాశాలలో 220కి ఏడుగురు, చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 280కి 59 మంది, ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 640కి 162 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. నగరంలోని ఎల్బీ డిగ్రీ కళాశాలలో 860కి 582 మంది, సీకేఎం డిగ్రీ కళాశాలలో 780 సీట్లకు 373 మంది, హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 910 సీట్లకు 566 మంది విద్యార్థులు చేరారు. మడికొండలోని రెసిడెన్షియల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 240 సీట్లు ఉంటే కేవలం 36 మంది విద్యార్థినులే చేరారు. ఆన్‌లైన్‌పై అవగాహన లేకనే.. డిగ్రీ కళాశాలల్లో చాలా సీట్లు మిగిలిపోవడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఎంసెట్ ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాల్లో ప్రవేశాలు పూర్తికాకపోవడం లాంటి సమస్యలున్నాయి. ఆయా కోర్సుల ప్రవేశాల ప్రక్రియ పూర్తియితే మూడో దశలో కొంతమేర సీట్లు భర్తీ అవుతాయని భావిస్తున్నారు. ఆ¯Œæలైన్ దరఖాస్తులపై సరైన అవగాహన లేకపోవడంతో కొంతమంది విద్యార్థులకు రెండు దశల్లోనూ సీట్లు రాని పరిస్థితి నెలకొంది. తక్కువగా ఆప్షన్లు, ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడం వలన కూడా సీట్లు పొందలేదు. మరికొందరు పాస్వర్డ్ మరిచిపోయి రెండో దశలో వెబ్ఆప్షన్లు ఇచ్చుకోలేకపోయారు. మంచి మార్కులు వచ్చి న విద్యార్థులు కొందరు తమకు ఇష్టమైన కళాశాలను ప్రా«ధాన్యత క్రమంలో ముందుగా కాకుండా తర్వాత పేర్కొనడం వలన కూడా తమకు ఇష్టం లేని కళాశాలలో సీటు రావటంతో చేరాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు. ఓపెన్ స్కూల్ ఇంటర్ పూర్తయినవారు తప్పనిసరిగా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్‌సైన్స్ కళాశాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా చేయకుండా కొందరు వెబ్ఆప్షన్లు ఇచ్చారు. వారికి సీట్లు కేటాయించలేదు. ఇప్పుడు వచ్చి వెరిఫికేషన్ చేయించుకుంటున్నారు. మూడో దశ అడ్మిషన్లకు ఈనెల 27 నుంచి అవకాశం కల్పించారు. మెుదటి, రెండు దశల్లో సీట్లు రాని వారు, సీట్లు పొంది కళాశాలల్లో చేరనివారు, ప్రవేశాలు పొంది ఇష్టం లేకుంటే వేరే కళాశాలల్లో చేరాలనుకునే వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మూడో దశ అడ్మిషన్ల ప్రక్రియే ఇక చివరిదని భావిస్తున్నారు. -
కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్ (వరంగల్) : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగిన డిగ్రీ బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, ఫైనల్ ఇయర్ ఫలితాలను శనివారం కేయూ ఇన్చార్జి వీసీ టి.చిరంజీవులు, ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్ విడుదల చేశారు. ఫైనల్ ఇయర్ ఫలితాల్లో 28.40 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫైనల్ ఇయర్లో మొత్తంగా 44,506 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా,అందులో 12,641 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల ఫలితాలు www.kakatiya.ac.in వెబ్సైట్లో అందుబాటులోఉన్నాయి. -
రూల్స్.. రివర్స్..!
కేయూ, దూరవిద్య కేంద్రం బాగోతం ఫీజులు చెల్లించకుండానే పీజీ పరీక్షల నిర్వహణ నకిలీ హాల్ టికెట్లతో ఎంవోయూ సెంటర్ నిర్వాకం నామినల్ రోల్స్‌లో పేర్లు ఉన్న విద్యార్థుల ప్రశ్నపత్రాలనే మూల్యాంకనం చేయూలి. కానీ.. ఇక్కడ ఇవేమీ పట్టించుకోకుండా ప్రొవిజనల్, మెమోలు సిద్ధం చేస్తున్నారు..! ఇక.. ఎక్కడైనా అడ్మిషన్, టర్మ్ ఫీజు చెల్లించిన తర్వాతే తరగతులు ప్రారంభమవుతారుు. ఆ తర్వాత నామినల్ రోల్స్‌లో పేర్లు నమోదవుతారుు. ఈ మేరకు సదరు విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అర్హులు. కానీ.. ఇక్కడ పరీక్షలు రాసిన తర్వాతే అడ్మిషన్ తీసుకుంటున్నారు..! కేయూ, దూరవిద్య కేంద్రంలో నిరాటంకంగా సాగుతున్న ఈ తంతు కొందరికి కాసులు కురిపిస్తోంది. దూరవిద్యా కేంద్రం పరిధిలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎంఓయూ స్టడీ సెంటర్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనే నిదర్శనం.. కొనసాగుతున్న అక్రమ బాగోతం ఇది. నకిలీ హాల్‌టికెట్లతో పరీక్షలు రారుుంచిన సదరు ఎంఓయూ స్టడీ సెంటర్‌పై చర్యలు తీసుకోకుండా.. ప్రేమ ఒలకబోయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. కేయూ దూరవిద్యా కేంద్రం పరిధిలోని రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన ఓ డిగ్రీ కాలేజీ ఎంఓయూ స్టడీ సెంటర్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఈ స్టడీ సెంటర్లో 2011-12 అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు కొందరు ప్రథమ సంవత్సరం పూర్తి చేశాక.. ద్వితీయ సంవత్సరం 2012-2013 అడ్మిషన్లకు సంబంధించి దూరవిద్యా కేంద్రానికి ఎలాంటి టర్మ్, పరీక్ష ఫీజు చెల్లించలేదు. ఈ మేరకు వారికి యూనివర్సిటీ పరీక్షల విభాగం హాల్ టికెట్లు పంపిణీ చేయలేదు. కానీ, సంబంధిత ఎంఓయూ సెంటర్ యూజమాన్యం.. ఫీజు చెల్లించని వారిలో కొందరు విద్యార్థులకు 2013లో నిర్వహించిన పీజీ ఫైనలియర్ పరీక్షలకు అనుమతి ఇచ్చింది. అదీ.. నకిలీ హాల్‌టికెట్లను సృష్టించి, నామినల్ రోల్స్‌లో పేరు లేని అభ్యర్థులకు అందజేసి పరీక్షలు రాయించారు.ఆయా జవాబుపత్రాలను కేయూ పరీక్షల విభాగానికి పంపారు. నిబంధనల ప్రకారం నామినల్ రోల్స్‌లో పేరు లేని విద్యార్థుల జవాబు పత్రాలను వాల్యుయేషన్ చేయకూడదు. ఇదేమీ పట్టని కేయూ పరీక్షల విభాగం అధికారులు మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసి, ఆ తర్వాత ఫలితాలను నిలిపివేశారు. దీంతో తాండూరు స్టడీసెంటర్ యాజమాన్యం పలు సార్లు కేయూ పరీక్షల విభాగం అధికారుల చుట్టు తిరిగారు. ఫీజులు చెల్లించకుండా విద్యార్థులతో పరీక్షలు రాయించడం నిబంధనలకు విరుద్ధమని, ఫలితాలు ప్రకటించేది లేదని కొద్దిరోజులుగా అధికారులు తిరస్కరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఏదోలా సదరు ఎంఓయూ సెంటర్ నిర్వాహకులు.. కేయూ పరీక్షల విభాగం అధికారులను మచ్చిక చేసుకుని కొంత ముట్టజెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా.. కొందరు విద్యార్థులు దూరవిద్యా కేంద్రం డెరైక్టర్‌కు లేఖపెట్టుకున్నారు. చివరకు ఒక్కో అభ్యర్థి రూ.7,200 ఫీజు చెల్లిస్తూ నో డ్యూస్ సర్టిఫికెట్ ఇస్తామని ఒప్పందానికి వచ్చారు. దీంతో రెండు రోజులుగా విద్యార్థులు దూరవిద్యా కేంద్రానికి ఫైన్‌తో సహా టర్మ్ ఫీజు చెల్లించి, కేయూలో ప్రొవిజనల్, మెమోలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 8 మంది అభ్యర్థులు సర్టిపికెట్లను తీసుకున్నారు. ఇందులో ఏడుగురు ఎంఏ సోషియాలజీ, ఒకరు ఎంఏ పోలిటికల్ సైన్స్ విద్యార్థులు ఉన్నారు. సదు ఎంఓయూ స్టడీ సెంటర్లో ఇలా 50 మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. కానీ.. ఇక్కడ నకిలీ హాల్‌టికెట్లతో పరీక్ష రారుుంచిన ఎంఓయూ సెంటర్‌పై యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం.. పరీక్షలు రాసిన తర్వాత దూరవిద్యా కేంద్రం అధికారులు అడ్మిషన్లు తీసుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఉన్నతాధికారులు సైతం మిన్నకుండి పోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. -
కెయూలో ర్యాగింగ్ కలకలం