దూరవిద్య డిగ్రీ పరీక్షల్లో 70 మంది డిబార్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య కేంద్రం(ఎస్డీఎల్‌సీఈ) డిగ్రీ మెుదటి, చివరి సంవత్సరం శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు వివిధ పరీక్ష కేంద్రాల్లో కాపీయింగ్‌కు పాల్పడిన 70 మందిని డిబార్ చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.పురుషోత్తం, అదనపు పరీక్షల నియంత్రణాధికారి సీహెచ్.రాజేశం తెలిపారు. కాగా, వివిధ పరీక్ష కేంద్రాలను కేయూ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్.దినేష్‌కుమార్ పరిశీలించారు.