కేయూ క్యాంపస్ (వరంగల్) : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగిన డిగ్రీ బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, ఫైనల్ ఇయర్ ఫలితాలను శనివారం కేయూ ఇన్‌చార్జి వీసీ టి.చిరంజీవులు, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్ విడుదల చేశారు. ఫైనల్ ఇయర్ ఫలితాల్లో 28.40 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫైనల్ ఇయర్‌లో మొత్తంగా 44,506 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా,అందులో 12,641 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల ఫలితాలు www.kakatiya.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులోఉన్నాయి.