Degree results
-
డిగ్రీ పూర్తి చేయడానికి 54 ఏళ్లు
ఒట్టావా: డిగ్రీ అంటే మూడేళ్లు చదువుతారు. బ్యాక్‌ల్యాగ్స్ ఉంటే మహా అయితే మరో ఏడాది అంతే. కానీ కెనడాకు చెందిన ఆర్థూర్ రోజ్ అనే వ్యక్తికి డిగ్రీ పూర్తి చేయడానికి ఏకంగా 54 ఏళ్లు పట్టింది. ప్రపంచంలో నత్తనడకన డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తిగా రోజ్ రికార్డు సృష్టించాడు. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో 1969లో డిగ్రీలో చేరిన రోజ్ ఎట్టకేలకు తన 71 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా తీసుకున్నారు. ఆర్థూర్ రోజ్ కెనడాకు చెందిన నటుడు. డిగ్రీలో చేరిన ఏడాది తర్వాత అతనికి నాటకాల పిచ్చి పట్టుకుంది. అందులో పడిపోయి చదువుని పట్టించుకోలేదు. మధ్యలో కొన్నాళ్లు నటనలో కూడా కోర్సులు చేశారు. అలా జీవితమంతా గడిచిపోయి రిటైర్ అయిపోయాక మళ్లీ చదువుపై ఆసక్తి వచ్చింది. 2016లో యూనివర్సిటీ ఆఫ్ కొలంబియాలో మళ్లీ హిస్టరీ స్టూడెంట్‌గా దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసి గురువారం పట్టా అందుకున్నారు. -
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత..!
-
పరీక్ష రాసినా ఫలితంలేదు!
ఎస్కేయూ :శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఫలితాలు విడుదల చేసినా ఫలితంలేకపోతోంది. విద్యార్థులకు తప్పుల తడకన మార్కులు వస్తున్నాయి. కాలం చెల్లిన సాఫ్ట్‌వేర్‌తో సమస్య వస్తోంది. ఫలితాలు విడుదలైనప్పుడు పాస్ అయిన విద్యార్థులు ఫెయిల్ అని, ఫెయిల్ అయిన వారు పాస్ అయినట్లు వస్తోంది. గైర్హాజరైన వారు సైతం ఏకంగా ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. నాలుగేళ్లుగా ఇదే తంతు.. ఈ ఏడాది 40 వేల మంది సెమిస్టర్ ఫరీక్షలు రాశారు. ఇందులో అధికశాతం విద్యార్థుల మార్కులు జంబ్లింగ్ అయ్యాయి. ఏటా ఇలానే జరుగుతున్నా సమస్య పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశీలించకుండానే ఫలితాలు విడుదల : డిగ్రీ 5వ సెమిస్టర్లో మార్కుల నమోదులో తప్పిదాలు చోటు చేసుకోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న వర్సిటీ యాజమాన్యం ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని సమగ్ర దర్యాప్తునకు నియమించింది. ప్రొఫెసర్ రెడ్డి వెంకటరాజు కన్వీనర్‌గా ఉన్న కమిటీలో ప్రొఫెసర్ ఏవీ రమణ, ప్రొఫెసర్ చింతా సుధాకర్ సభ్యులుగా ఉన్నారు. కమిటీ సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. ఫలితాల్లో వ్యత్యాసం : అవార్డు షీట్ (ఎగ్జామినర్ వేసిన మార్కులు) ఆధారంగా చెక్‌లిస్ట్‌లో మార్కులు పొందుపరుస్తారు. చెక్‌లిస్ట్‌లోని మార్కుల ఆధారంగా ట్యాబులేషన్‌లో మార్కులు నమోదవుతాయి. అనంతరం మార్క్స్‌కార్డులు ప్రింట్ అవుతాయి. చెక్‌లిస్ట్‌లో ఉన్న మార్కులకు ట్యాబులేషన్‌లో నమోదైన మార్కులకు వ్యత్యాసం అధికంగా ఉంది. మూడో సబ్జెక్టులో నమోదైన మార్కులు తక్కిన అన్ని సబ్జెక్టులకూ యథాతథంగా పునరావృతమయ్యాయి. ఆ సబ్జెక్టులో ఫెయిల్ అయితే తక్కిన అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయినట్లే. ఈ విధంగా మార్కులు నమోదు అయినట్లు కమిటీ నిర్ధారణకు వచ్చింది. వాస్తవానికి ఫలితాలు విడుదలకు ముందు చెక్‌లిస్ట్‌లోని మార్కులు, ట్యాబులేషన్‌లోని మార్కులను పరిశీలించిన తర్వాత ఫలితాలు విడుదల చేయాలి. కాలం చెల్లిన సాప్ట్వేర్ : 2015లో సెమిస్టర్ విధానం అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇదే పరిస్థితి తలెత్తుతోంది. మార్కుల నమోదు వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ కాలం చెల్లింది. అయినా దాన్నే వాడుతున్నారు. గతంలో ఏడాది పరీక్షలు కాబట్టి..తక్కువ డేటాబేస్ సరిపోయేది. ప్రస్తుతం సెమిస్టర్ విధానం కొనసాగుతోంది. అయినా వర్సిటీ సాఫ్ట్వేర్ సామర్థ్యాన్ని పెంచలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిజిటలైజేషన్ విధానంలో పరీక్షల విభాగంలో పూర్తిగా సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందనే భావన వ్యక్తమవుతోంది. రెండు సార్లు ఫలితాలువిడుదల చేసినా... డిగ్రీ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులందరూ ఫలితాలు చూసుకున్నారు. ఫలితాలు తప్పులతడక వచ్చాయని ఫిర్యాదులు అందాయి. దీంతో సోమవారం తిరిగి ఫలితాలు విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఫలితాలు పరీక్షలకు గైర్హాజరయిన వారు సైతం ఉత్తీర్ణత చెందినట్లు వచ్చింది. దీంతో సమస్య మొదటికొచ్చింది. కమిటీ అవార్డు షీట్‌లోని ప్రతి విద్యార్థీ మార్కులను పరిశీలిస్తోంది. వారం రోజుల్లో మొత్తం అన్నీ మార్కులను పరిశీలించి.. తుది ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
ఉదయం పాస్.. సాయంత్రానికి ఫెయిల్
కదిరి: ఎస్కేయూ డిగ్రీ ఫలితాలు విద్యార్థులను అయోమయంలో పడేశాయి. సోమవారం డిగ్రీ చివరి సంవత్సరం ఫలితాలు విడుదల కాగా ఉదయం ఉత్తీర్ణులైనట్లు చూపించిన ఫలితాలు... సాయంత్రంలోపు మారిపోయి ఫెయిల్ అయినట్లు చూపించాయి. ఇందుకు నిరసనగా డిగ్రీ విద్యార్థులు స్థానిక వేమారెడ్డి కూడిలి సమీపంలో కదిరి–హిందూపురం రహదారిపై రాత్రి సమయంలో గంటపాటు బైఠాయించారు. అదే సమయంలో అశోక్, అజయ్, ప్రతీష్, రవితేజ, త్యాగి, శ్రీకాంత్ అనే ఐదురుగు డిగ్రీ విద్యార్థులు అక్కడే సమీపంలోని సెల్ టవర్ ఎక్కి దూకేస్తామంటూ గట్టిగా కేకలు వేశారు. విద్యార్థులు రాస్తారోకోతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ హేమంత్ కుమార్ సంఘటనా స్థలానికి వచ్చి విద్యార్థులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. అక్కడి నుంచి టవర్ దగ్గరకు చేరుకుని టవర్‌పైకి ఎక్కిన విద్యార్థులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చి వారు దిగేలా చేశారు. -
భవిత తారుమారు
ఒక సబ్జెక్ట్‌లో పాసైతే అన్నింట్లో పాసైనట్లే.. ఒక సబ్జెక్ట్‌లో ఫెయిలైతే అన్నింట్లో ఫెయిలే.. ఏమిటీ వింత అనుకుంటున్నారా? శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ యంత్రాంగం సృష్టించిన గందరగోళం ఇది. శనివారం విడుదలైన డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాలు యూనివర్సటీ యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తును తారుమారు చేశాయి. మార్కుల నమోదులో నిర్లక్ష్యం కారణంగా ఉండటంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాల్లో ఒక సబ్జెక్టులో వచ్చిన మార్కులే మిగతా సబ్జెక్టుల్లోనూ పునరావృతమయ్యాయి. అనంతపురం నగరంలోని ఒక డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులందరికీ ఇలాంటి ఫలితాలే వచ్చాయి. దీంతో విద్యార్థుల్లో అయోమయం, ఆందోళన నెలకొంది. ♦ బీఎస్సీలో హాల్ టికెట్ నంబర్ 16841099గల విద్యార్థినికి స్టాటిస్టిక్స్ విత్ మేథమేటిక్స్–5లో 18 మార్కులు వచ్చాయి. స్టాటిస్టిక్స్ విత్ మేథమేటిక్స్–6, కంప్యూటర్ అప్లికేషన్స్–5, కంప్యూటర్ అప్లికేషన్స్–6లోనూ 18 మార్కులే వచ్చాయి. ♦ ఇక బీకాంలో హాల్‌టికెట్ నంబర్ –16835141గల విద్యార్థికి ఓ సబ్జెక్టులో 32 మార్కులు వచ్చాయి. ప్రోగ్రామింగ్ ఇన్ సీ, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సబ్జెక్టుల్లోనూ 32 మార్కులే వచ్చాయి. ఇలా ఒకే కళాశాలకు చెందిన విద్యార్థులందరికీ మార్కులు తారుమారు అయ్యాయి. తప్పులు సరిచేస్తాం మార్కుల నమోదులో తప్పిదాలను సరిచేస్తాం. బాధిత విద్యార్థులు నేరుగా వచ్చి పర్సనల్ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులందరికీ న్యాయం జరిగేలా చూస్తాం. –ప్రొఫెసర్ జె.శ్రీరాములు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్, ఎస్కేయూ -
నేడు డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ మొదటి, రెండో సంవత్సరం డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు ఆదివారం విడుదల చేస్తున్నట్లు యూజీ డీన్ ఆచార్య జీవన్‌కుమార్ తెలిపారు. -
బోనస్.. బోగస్
► డిగ్రీలో జంబ్లింగ్ విధానంతో తగ్గిన ఉత్తీర్ణత ► ప్రతి సబ్జెక్ట్‌కు 15 మార్కులు కలిపి ఉత్తీర్ణత శాతం పెంపు ► రీవాల్యుయేషన్లో నిగ్గుతేలుతున్న నిజాలు ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని యూజీ పరీక్షల విభాగం అస్తవ్యస్తంగా తయారైంది. ఒక దఫా ఫెయిల్, మరో దఫా ఉత్తీర్ణత ఇలా ఏరకమైన ఫలితం వస్తుందో విద్యార్థులకు దిక్కతోచని స్థితి నెలకొంది. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ‘జంబ్లింగ్ ’ విధానం తెచ్చిన తంటా : యూజీ పరీక్ష కేంద్రాల్లో జంబింగ్ విధానం ప్రవేశపెట్టడంతో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో జరిగిన డిగ్రీ పరీక్షలు కట్టుదిట్టంగా జరిగాయి. దీంతో ఆ ప్రభావం ఫలితాలపై పడింది. మొదట్లో కేవలం 10 శాతమే ఉత్తీర్ణత వచ్చినట్లు అధికారులకు అర్థమైంది. దీంతో విషయాన్ని పైస్థాయి అధికారులకు తెలిపారు. 10 అదనంగా మార్కులు వేయాలని అధికారులు సూచించినా ఉత్తీర్ణత శాతం 20కి మించలేదు. ఆఖరికి ప్రతి సబ్జెక్టుకు 15 మార్కులు కలపడంతో 32 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఎక్కువ మంది విద్యార్థులు 30 మార్కుల దగ్గరే ఆగిపోయారు. దీంతో ఈ ఏడాది ఏకంగా 15 వేల మంది రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థుల జేబులకు చిళ్లు బోనస్ మార్కుల ఫలితంగా విద్యార్థులు ఒక్కొక్కరు 4 ,5 సబ్జెక్టులకు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేశారు. కారణమేమిటంటే ఉదాహరణకు 25 మార్కులు వచ్చిన విద్యార్థికి అసలు మార్కులు 10 మాత్రమే వచ్చి ఉంటాయి. రీవాల్యుయేషన్లో ఈ 10 మార్కులు పెరిగితేనే పెరిగినట్టు నిర్ధారిస్తారు. లేదంటే పాత మార్కులు వచ్చినట్టు ధ్రువపరుస్తారు. విద్యార్థులు ఆశావహ దృక్పథంతో రూ.60 లక్షల రూపాయలు రీవాల్యుయేషన్ ఫీజులు చెల్లించినా వారికి ఒరిగిందేమీలేదు. కేవలం వర్సిటీకి ఆదాయం చేకూరిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా, మూడు, నాలుగు సబ్జెక్టులకు రీవాల్యుయేషన్ దరఖాస్తు చేసుకోగా, ఒక్క సబ్జెక్టుకు మాత్రమే ఫలితాలు ప్రకటించారు. తక్కిన మూడు సబ్జెక్టులకు ఫలితాలు రావడం లేదు. కాగా, ఎస్కేయూ చరిత్రలో ఎస్కేయూసెట్–2016లో అర్హత మార్కులు పెంపు, డిగ్రీ పరీక్షల్లో అదనపు మార్కులు వేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీన్ని బట్టి డిగ్రీ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు ఏ మేరకు ఉన్నాయో ఇట్టే అర్థం అవుతోందని విద్యావేత్తలు భావిస్తున్నారు. ఉన్నతాధికారుల సూచనతోనే బోనస్ మార్కులు ఉన్నతాధికారుల సూచనల మేరకు 15 బోనస్ మార్కులు వేశాము. జంబ్లింగ్ విధానం ద్వారా ఉత్తీర్ణత శాతం తగ్గుముఖం పట్టింది. దీంతో నిబంధనల మేరకు బోనస్ మార్కులు కలిపాము. కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయాలు అమలు చేశాము. –ఆచార్య జీవన్‌కుమార్, యూజీ డీన్, ఎస్కేయూ. -
కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్ (వరంగల్) : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగిన డిగ్రీ బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, ఫైనల్ ఇయర్ ఫలితాలను శనివారం కేయూ ఇన్చార్జి వీసీ టి.చిరంజీవులు, ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్ విడుదల చేశారు. ఫైనల్ ఇయర్ ఫలితాల్లో 28.40 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫైనల్ ఇయర్లో మొత్తంగా 44,506 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా,అందులో 12,641 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల ఫలితాలు www.kakatiya.ac.in వెబ్సైట్లో అందుబాటులోఉన్నాయి. -
ఓయూ డిగ్రీ ఫలితాలు విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ రెగ్యులర్, దూరవిద్య బీఏ, బీకాం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, తృతీయ వార్షిక పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. క్యాంపస్‌లోని అతిథి గృహంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేష్‌కుమార్, అకడమిక్ ఆడిట్ సెల్ డెరైక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వర్రావు, కంట్రోలర్ ప్రొఫెసర్ భిక్షమయ్య ఫలితాల సీడీని ఆవిష్కరించారు. మొత్తం 1,90,518 అభ్యర్థుల్లో 96,442 బాలురు, 94,076 బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 52.43 శాతంగా ఉన్నట్లు తెలిపారు. మార్కుల జాబితాలను జులై 1 నుంచి ఆయా కళాశాలల నుంచి తీసుకోవచ్చు. ఫెయిల్ అయిన అభ్యర్థులు రూ.200 చెల్లించి రీకౌంటింగ్, రీవాల్యూయేషన్ కోసం ఆన్లైన్ ద్వారా ఈ నెల 13 నుంచి 24 వరకు, రూ.100 అపరాధ రుసుముతో 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాలను, పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చు. -
10న ఓయూ డిగ్రీ ఫలితాలు!
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ వార్షిక పరీక్షా ఫలితాలు ఈ నెల 10 లేదా 11న ప్రకటించనున్నట్లు సమాచారం. మూల్యాంకనం పనులు ముగిసినట్లు సోమవారం వర్సిటీ అధికారులు తెలిపారు. ఇన్ఛార్జ్ వీసీ ఆర్ఆర్ ఆచార్య అనుమతి లభించిన వెంటనే ఫలితాలను ప్రకటించనున్నట్లు చెప్పారు. -
తెలంగాణ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాల విడుదల
నిజామాబాద్: తెలంగాణా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షా ఫలితాలను ఉన్నత విద్యాశాఖ వైస్ చైర్మెన్ ప్రొఫెసర్ మల్లేశ్, యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లింబాద్రి సంయుక్తంగా విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 33 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఫలితాల కోసం తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు. -
ఏయూ వెబ్సైట్లో డిగ్రీ ఫలితాలు
విశాఖపట్టణం: ఆంధ్ర విశ్వవిద్యాలయం డిగ్రీ మూడో సంవత్సరం ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. బీఎస్సీలో 24.26 శాతం, బీకామ్(ఒకేషనల్)లో 45.33 శాతం, బీఏలో 28.09 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను విశ్వవిద్యాలయం వెబ్సైట్ http://andhrauniversity.edu.in/లో అందుబాటులో ఉంచారు. -
ఓయూ డిగ్రీ వార్షిక ఫలితాల విడుదల
-
తెయూ డిగ్రీ ఫలితాలు విడుదల
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల డిగ్రీ పరీక్షల ఫలితాలను వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అక్బర్ అలీఖాన్, రిజిస్ట్రార్ ప్రొపెసర్ లింబాద్రి మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో ఆన్లైన్లో వీసీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలిసారి యూనివర్సిటీ ఆధ్వర్యంలో మూడేళ్లకు సంబంధించిన డిగ్రీ ఫలితాలు విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. తాను వీసీగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఓయూ నుంచి తెయూకు అఫిలియేషన్ అనుమతి వచ్చిందన్నారు. గత రెండేళ్లుగా తెయూ ద్వారా డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు విడుదల చేశామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల ఫలితాలు విడుదల చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ నసీం, పరీక్షల అదనపు నియంత్రణాధికారి నాగరాజు, అసిస్టెంట్ అకడమిక్ ఆడిట్ సెల్ డైరక్టర్ రాంబాబు, ప్రిన్సిపాల్ కనకయ్య, నాగరాజు, సాయాగౌడ్, అసిస్టెంట్ పీఆర్వో ఖవి పాల్గొన్నారు. తొలిసారి గ్రేడింగ్ విధానం.. తెయూ పరిధిలో మంగళవారం విడుదల చేసిన డిగ్రీ ఫరీక్ష ఫలితాల్లో తొలిసారి గ్రేడింగ్ పద్ధతిలో కన్సాలిడేటెడ్ మెమోలు జారీ చేస్తున్నట్లు వీసీ అక్బర్ అలీఖాన్ తెలిపారు. విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ కేటాయిస్తామని ఆయన తెలిపారు. ఈ విద్యా సంవత్సరం (2013-14)లో డిగ్రీ ఫలితాల్లో ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 26 శాతం, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 26 శాతం, తృతీయ సంవత్సరం పరీక్షల్లో 33 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వీసీ తెలిపారు. మూడేళ్లకు సంబంధిం చి అన్ని కోర్సుల ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువ ఉత్తీర్ణత శాతం సాధించినట్లు తెలిపారు.