ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ రెగ్యులర్, దూరవిద్య బీఏ, బీకాం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, తృతీయ వార్షిక పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. క్యాంపస్‌లోని అతిథి గృహంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేష్‌కుమార్, అకడమిక్ ఆడిట్ సెల్ డెరైక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు, కంట్రోలర్ ప్రొఫెసర్ భిక్షమయ్య ఫలితాల సీడీని ఆవిష్కరించారు. మొత్తం 1,90,518 అభ్యర్థుల్లో 96,442 బాలురు, 94,076 బాలికలు ఉత్తీర్ణులయ్యారు.
ఉత్తీర్ణత శాతం 52.43 శాతంగా ఉన్నట్లు తెలిపారు. మార్కుల జాబితాలను జులై 1 నుంచి ఆయా కళాశాలల నుంచి తీసుకోవచ్చు. ఫెయిల్ అయిన అభ్యర్థులు రూ.200 చెల్లించి రీకౌంటింగ్, రీవాల్యూయేషన్ కోసం ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 13 నుంచి 24 వరకు, రూ.100 అపరాధ రుసుముతో 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాలను, పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్లో చూడవచ్చు.
ఓయూ డిగ్రీ ఫలితాలు విడుదల
Published Fri, Jun 12 2015 6:21 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement