తార్నాక : పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్ల పాటు స్నేహం చేసి అమె నుంచి అందినకాడికి డబ్బులు తీసుకుని మరో పెళ్లి చేసుకోవడమే కాకుండా మరో ఇద్దరితో కలిసి యువతిపై హత్యాయత్నానికి పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను ఓయూ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరించారు. కాచిగూడ ఏసీపీ నర్సయ్య, ఓయూ ఇన్‌స్పెక్టర్ జగన్ మంగళవారం వివరాలు వెల్లడించారు. ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫె సర్‌గా పని చేస్తున్న కిరణ్‌కుమార్ అదే విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్న మరో అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో స్నేహం కుదిరింది. ఇద్దరి కులాలు ఒకటే కావడంతో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు.
పదేళ్ల పాటు ఇద్దరూ కలిసి తిరిగారు. ఈ నేపథ్యంలో కిరణ్‌కుమార్ ఆమె వద్ద రూ.6లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బుల విష యమై సదరు యువతి కిరణ్‌కుమార్‌పై ఒత్తిడి చేయగా, పెళ్లి చేసుకుందామని, పెళ్లయిన తరువాత ఇస్తానని చెప్పాడు. పెళ్లి విషయమై వాయి దాలు వేస్తున్నాడు. సదరు యువతికి మరో యూ నివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం రావడంతో ఆమె అక్కడికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన కిరణ్‌కుమార్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో బాధితురాలు ఓయూ క్యాంపస్‌కు వచ్చి కిరణ్‌ను నిలదీయగా, తాను ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని, తన భార్యను చంపి నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మిం చాడు.
అంతేగాక ఆమె పీహెచ్‌డీ డిజర్టేషన్ వర్క్ పూర్తి చేస్తానంటూ మరికొంత డబ్బులు తీసుకున్నాడు. గత నెల 18న తన పీహెచ్‌డీ విషయమై క్యాంపస్‌కు వచ్చి వెళుతున్న ఆమెను ఓయూ ప్రెస్ వద్ద అడ్డుకున్న కిరణ్‌కుమార్ మరో ఇద్దరితో కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె ఇంటికి వెళ్లి దాడి చేయడంతో బాధితురాలు గత నెల 19న ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సమాచారం అందడంతో ఓయూ అధికారులు అ తడిని సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న కిరణ్ భద్రాచలంలోని ఓ లాడ్జిలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఐ రంజిత్, శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకు న్నారు. మంగళవారం అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment