ఓయూ పీజీ హాస్టల్‌లో విద్యార్థి మృతి | Student Suspicious Death At OU PG Hostel Hyderabad | Sakshi
Sakshi News home page

ఓయూ పీజీ హాస్టల్‌లో విద్యార్థి మృతి

Feb 17 2020 4:32 PM | Updated on Feb 17 2020 4:47 PM

Student Suspicious Death At OU PG Hostel Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పీజీ హాస్టల్‌లో నర్సయ్య అనే జాగ్రఫీ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రిన్సిపల్‌ ప్రతాప్‌రెడ్డితో మాట్లాడి.. కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్‌ టీం ఆధారంగా విచారణ చేస్తున్నారు.

మనస్తాపంతో మరో విద్యార్థి..
గేట్‌ పరీక్షలో అర్హత సాధించలేననే మనస్తాపంతో గుజరాత్‌కు చెందిన హరీష్‌ బాయ్‌ అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మూసారాంబాగ్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement