assistant profeessor
-
బికినీలో ‘మేడమ్’ హల్చల్.. కంగుతిన్న పేరెంట్స్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఓ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోల కారణంగా ఆమె ఉద్యోగం ఊడింది. అందుకు కారణం.. ఆ ఫొటోలు అభ్యంతకరంగా ఉన్నాయని పేరెంట్స్ ఫిర్యాదు చేయడమే!. ఏడాది కాలంగా నడుస్తోంది ఈ కేసు.. కోల్‌కతాకు చెందిన ఓ ప్రముఖ కాలేజీలో సదరు అసిస్టెంట్ ఫ్రొఫెసర్ పని చేస్తోంది. అయితే ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తరచూ ఫొటోలు అప్లోడ్ చేస్తూ వెళ్తోంది. ఈ క్రమంలో ఓరోజు ఫ్లస్ టూ చదువుతున్న ఓ విద్యార్థి(18) ఆమె ఫొటోలను పదే పదే చూస్తూ ఉండిపోయాడట. అది రహస్యంగా గమనించిన అతని తండ్రి బీకే ముఖర్జీ.. కాలేజీ యాజమాన్యానికి ఓ లేఖ రాశాడు. సదరు మేడమ్‌గారు అలాంటి ఫొటోలు అప్లోడ్ చేయడం సిగ్గుచేటని.. ఆమె వల్ల తమ పిల్లలు పాడైపోతున్నారని, ఆమె బికినీలో ఫొటోలు అప్లోడ్ చేయడం విద్యార్థులను రెచ్చగొట్టడమే అవుతుందని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదు ఆమె ఫొటోలను సైతం ఎటాచ్ చేసి మరీ పంపించాడట. ఈ నేపథ్యంలో.. కిందటి ఏడాది అక్టోబర్‌లో మీటింగ్ పెట్టి మరీ ఆమెను తొలగించక తప్పలేదు కాలేజీ యాజమాన్యానికి. అయితే ఆమె తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసిందని.. అభ్యంతరకర ఫొటోల విషయంలో కాదని కాలేజీ యాజమాన్యం ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అయితే ఆ మరుసటిరోజే ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇదిలా ఉంటే.. తన ఫోన్‌ను, సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసి ఎవరో.. వ్యక్తిగత ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన క్యారెక్టర్‌ను దిగజార్చే క్రమంలోనే ఇదంతా జరుగుతోందని, ఇది ముమ్మాటికీ కాలేజీ యాజమాన్యం తనపై చేస్తున్న వేధింపుల కిందకే వస్తుందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. A student of St. Xavier’s Kolkata was recently caught looking at a pic of a Prof in her swimsuit (taken from her private IG). His father sent a letter to the uni condemning HER for his son’s leching. Prof was forced to resign in a strikingly humiliating manner. 2022… damn. pic.twitter.com/2RNLnXBd0p — Sukhnidh ⚆ _ ⚆ (@skhndh) August 8, 2022 ఈలోపు తనకు సదరు విద్యార్థి తండ్రి చేసిన ఫిర్యాదు కాపీ ఇవ్వాలంటూ యూనివర్సిటీకి సదరు ప్రొఫెసర్ లీగల్ నోటీసులు పంపింది. ఆ నోటీసులు ఈ ఏడాది మార్చ్ 28న యూనివర్సిటీ స్పందించింది. లీగల్ నోటీసులను దురద్దేశ పూర్వకంగా పంపారని, ఇది కాలేజీ ప్రతిష్టను దెబ్బ తీయడమే అవుతుందని బదులు ఇచ్చింది. అంతేకాదు భేషరతు క్షమాపణలు చెప్పాలని, నష్టపరిహారం కింద 99 కోట్ల రూపాయలు చెల్లించాలని సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు బదులు ఇచ్చింది యూనివర్సిటీ. దీంతో ప్రస్తుతం ఆమె హైకోర్టుకు వెళ్లనున్నారు. ఇదీ చదవండి: హాయ్.. నేను కలెక్టర్ టీనా దాబిని! -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. హత్యాయత్నం
తార్నాక : పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్ల పాటు స్నేహం చేసి అమె నుంచి అందినకాడికి డబ్బులు తీసుకుని మరో పెళ్లి చేసుకోవడమే కాకుండా మరో ఇద్దరితో కలిసి యువతిపై హత్యాయత్నానికి పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను ఓయూ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరించారు. కాచిగూడ ఏసీపీ నర్సయ్య, ఓయూ ఇన్స్పెక్టర్ జగన్ మంగళవారం వివరాలు వెల్లడించారు. ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫె సర్గా పని చేస్తున్న కిరణ్‌కుమార్ అదే విభాగంలో పీహెచ్డీ చేస్తున్న మరో అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో స్నేహం కుదిరింది. ఇద్దరి కులాలు ఒకటే కావడంతో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. పదేళ్ల పాటు ఇద్దరూ కలిసి తిరిగారు. ఈ నేపథ్యంలో కిరణ్‌కుమార్ ఆమె వద్ద రూ.6లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బుల విష యమై సదరు యువతి కిరణ్‌కుమార్‌పై ఒత్తిడి చేయగా, పెళ్లి చేసుకుందామని, పెళ్లయిన తరువాత ఇస్తానని చెప్పాడు. పెళ్లి విషయమై వాయి దాలు వేస్తున్నాడు. సదరు యువతికి మరో యూ నివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం రావడంతో ఆమె అక్కడికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన కిరణ్‌కుమార్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో బాధితురాలు ఓయూ క్యాంపస్‌కు వచ్చి కిరణ్‌ను నిలదీయగా, తాను ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని, తన భార్యను చంపి నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మిం చాడు. అంతేగాక ఆమె పీహెచ్డీ డిజర్టేషన్ వర్క్ పూర్తి చేస్తానంటూ మరికొంత డబ్బులు తీసుకున్నాడు. గత నెల 18న తన పీహెచ్డీ విషయమై క్యాంపస్‌కు వచ్చి వెళుతున్న ఆమెను ఓయూ ప్రెస్ వద్ద అడ్డుకున్న కిరణ్‌కుమార్ మరో ఇద్దరితో కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె ఇంటికి వెళ్లి దాడి చేయడంతో బాధితురాలు గత నెల 19న ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సమాచారం అందడంతో ఓయూ అధికారులు అ తడిని సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న కిరణ్ భద్రాచలంలోని ఓ లాడ్జిలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ రంజిత్, శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకు న్నారు. మంగళవారం అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
అటెండర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి..
సాక్షి, హైదరాబాద్: ఆయన ఆత్మ విశ్వాసం ముందు అంగవైకల్యం ఓడిపోయింది. పట్టుదలతో సాధించిన విజయం యువతకు స్ఫూర్తిగా నిలిచింది. బతుకుదెరువు కోసం అటెండర్‌గా పని చేసిన ఆయన ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి అర్హత సాధించారు. ఆయనే సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలా నికి చెందిన దళిత యువకుడు పిట్ల నర్సింహులు. మంత్రి కె.తారకరామారావు ఇచ్చిన చేయూతే నర్సింహులు జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడాయనకు మంత్రి మరింత భరోసా కల్పించారు. రూ. 2 లక్షలు నగదు అందించారు. గుడిసెలో నివాసం ఉంటున్న వారి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పేదరికం కారణంగా.. పిట్ల నర్సింహులుకు పుట్టుకతోనే అంగవైకల్యం. అయినా విధిరాతకు ఎదురొడ్డి పీజీ వరకు చదువుకున్నారు. ఆపై చదవాలనుకున్నా పేదరికం అడ్డుపడింది. వయసైపోయిన తల్లిదండ్రులు, పెళ్లీడుకొచ్చిన నలుగురు చెల్లెళ్లు ఉన్నారు. దాంతో ఏదో ఒక ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎంత ప్రయత్నించినా ఏ ఉద్యోగమూ దొరకలేదు. దాంతో ఒక రోజు గ్రామ సభకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ను కలసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. జీవితంలో ఏదో సాధించాలన్న నర్సింహులు తపనను గుర్తించిన మంత్రి కేటీఆర్.. సిరిసిల్లలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఉద్యోగం ఇప్పించారు. పైచదువులు చదవాలని, సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. దీంతో నర్సింహులు అటు కుటుంబాన్ని పోషిస్తూనే ఇటు చదువుకున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష (జేఆర్ఎఫ్)లో ఉత్తీర్ణత సాధిం చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. శుక్రవారం నర్సింహులును తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. ఆయ న విజయాన్ని అభినందించి, రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించారు. గుడిసెలో ఉంటున్న నర్సింహులు కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. వచ్చే దసరా నాటికి ఆ కొత్త ఇంట్లో భోజనం చేస్తావని నర్సింహులుకు మాటిచ్చారు. ‘‘అంగవైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో జయించిన నర్సింహులు గెలుపు అందరికీ స్ఫూర్తినిస్తుంది. యువతకు నర్సింహులు రియల్ ఇన్స్పిరేషన్. స్పష్టమైన లక్ష్యంతో ప్రయత్నిస్తే కష్టాలెన్ని ఎదురొచ్చినా కలను నెరవేర్చుకోవచ్చన్న నిజం మరోసారి స్పష్టంగా తెలిసింది..’’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక అటెండర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగిన నర్సింహులును చూసి తాము గర్వపడుతున్నామని నర్సింహులుకు ఉద్యోగం ఇచ్చిన వెన్నెల జూనియర్ కాలేజీ ప్రిన్సి పాల్ చైతన్యకుమార్ పేర్కొన్నారు. -
వైవీయూ అధ్యాపకులకు కొత్త బాధ్యతలు
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలో నెలరోజులుగా కొనసాగుతున్న పదవుల పంచాయతీ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఇద్దరు ఆచార్యులకు విభాగాధిపతులుగా, 15 మంది సహాయ ఆచార్యులకు విభాగాల సమన్వయకర్తలు నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. జూన్ చివరివారంలో వైవీయూలో అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 10మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించారు. దీంతో విశ్వవిద్యాలయంలో సహ ఆచార్యులు అన్నవారే లేకుండా పోయింది. దీంతో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే మిగిలారు. దీంతో పదోన్నతులు పొందిన కొందరు కేవలం ప్రొఫెసర్లు మాత్రమే విభాగాధిపతులు ఉండాలని పేర్కొనగా.. ఎప్పుడూ వారేనా అంటూ సహాయ ఆచార్యులు సైతం తమ గళం వినిపిస్తూ వచ్చారు. దీంతో వారి మధ్య కొన్ని విభాగాల్లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. దీంతో వీరి మధ్య సయోధ్య కుదర్చి గత వారంలో నలుగురికి ఇవ్వగా తాజగా 17 మందికి విభాగాల బాధ్యతలను ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వీరంతా బాధ్యతలు స్వీకరించి విధులకు హాజరయ్యారు. –––––––––––––––––––––––––––––––––––––––––––––– అధ్యాపకుడి పేరు హోదా విభాగం ––––––––––––––––––––––––––––––––––––––––––––––– ఆచార్య టి. రామకృష్ణారెడ్డి విభాగాధిపతి తెలుగు ఆచార్య ఎం. రామకృష్ణారెడ్డి విభాగాధిపతి ఎర్త్‌సైన్స్ ––––––––––––––––––––––––––––––––––––––––––––––– డా. ఎం. శ్రీధర్‌బాబు సమన్వయకర్త అప్లైడ్ మ్యాథ్స్ డా.ఎ. చంద్రశేఖర్ సమన్వయకర్త బయోటెక్నాలజీ డా.వి. రామకృష్ణ సమన్వయకర్త బయోటెక్నాలజీ అండ్ బయోఇన్మర్మాటిక్స్ టి. శ్యామ్స్వరూప్ సమన్వయకర్త కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం డా. బి. దీనామార్గరేట్ సమన్వయకర్త ఎకనామిక్స్ డా.ఎస్. సుమిత్ర సమన్వయకర్త ఎన్విరాన్మెంటల్ సైన్స్ డా. ఎం. మల్లికార్జునరెడ్డి సమన్వయకర్త ఫైన్ఆర్ట్స్ డా.బి. రమేష్ సమన్వయకర్త జెనిటిక్స్ అండ్ జీనోమిక్స్ డా. వి. వారిజ సమన్వయకర్త హిస్టరీ అండ్ ఆర్కియాలజీ డా. ఎస్. ఆదినారాయణరెడ్డి సమన్వయకర్త మెటీరియల్ సైన్స్ అండ్ నానోటెక్నాలజీ డా. డి. విజయలక్ష్మి సమన్వయకర్త మైక్రోబయాలజీ డా. ఎస్. చాన్‌బాషా సమన్వయకర్త ఫిజికల్ ఎడ్యుకేషన్ డా. వి. లాజర్ సమన్వయకర్త సైకాలజీ డా. ఎస్. గోవర్దన్‌నాయుడు సమన్వయకర్త పీఎస్ అండ్ పీఏ కె. శ్రీనివాసరావు సమన్వయకర్త కంప్యూటర్ అప్లికేషన్