వైవీయూ అధ్యాపకులకు కొత్త బాధ్యతలు
వైవీయూ :
యోగివేమన విశ్వవిద్యాలయంలో నెలరోజులుగా కొనసాగుతున్న పదవుల పంచాయతీ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఇద్దరు ఆచార్యులకు విభాగాధిపతులుగా, 15 మంది సహాయ ఆచార్యులకు విభాగాల సమన్వయకర్తలు నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. జూన్ చివరివారంలో వైవీయూలో అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 10మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించారు. దీంతో విశ్వవిద్యాలయంలో సహ ఆచార్యులు అన్నవారే లేకుండా పోయింది. దీంతో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే మిగిలారు. దీంతో పదోన్నతులు పొందిన కొందరు కేవలం ప్రొఫెసర్లు మాత్రమే విభాగాధిపతులు ఉండాలని పేర్కొనగా.. ఎప్పుడూ వారేనా అంటూ సహాయ ఆచార్యులు సైతం తమ గళం వినిపిస్తూ వచ్చారు. దీంతో వారి మధ్య కొన్ని విభాగాల్లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. దీంతో వీరి మధ్య సయోధ్య కుదర్చి గత వారంలో నలుగురికి ఇవ్వగా తాజగా 17 మందికి విభాగాల బాధ్యతలను ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వీరంతా బాధ్యతలు స్వీకరించి విధులకు హాజరయ్యారు.
––––––––––––––––––––––––––––––––––––––––––––––
అధ్యాపకుడి పేరు హోదా విభాగం
–––––––––––––––––––––––––––––––––––––––––––––––
ఆచార్య టి. రామకృష్ణారెడ్డి విభాగాధిపతి తెలుగు
ఆచార్య ఎం. రామకృష్ణారెడ్డి విభాగాధిపతి ఎర్త్‌సైన్స్
–––––––––––––––––––––––––––––––––––––––––––––––
డా. ఎం. శ్రీధర్‌బాబు సమన్వయకర్త అప్లైడ్ మ్యాథ్స్
డా.ఎ. చంద్రశేఖర్ సమన్వయకర్త బయోటెక్నాలజీ
డా.వి. రామకృష్ణ సమన్వయకర్త బయోటెక్నాలజీ అండ్ బయోఇన్మర్మాటిక్స్
టి. శ్యామ్‌స్వరూప్ సమన్వయకర్త కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం
డా. బి. దీనామార్గరేట్ సమన్వయకర్త ఎకనామిక్స్
డా.ఎస్. సుమిత్ర సమన్వయకర్త ఎన్విరాన్‌మెంటల్ సైన్స్
డా. ఎం. మల్లికార్జునరెడ్డి సమన్వయకర్త ఫైన్‌ఆర్ట్స్
డా.బి. రమేష్ సమన్వయకర్త జెనిటిక్స్ అండ్ జీనోమిక్స్
డా. వి. వారిజ సమన్వయకర్త హిస్టరీ అండ్ ఆర్కియాలజీ
డా. ఎస్. ఆదినారాయణరెడ్డి సమన్వయకర్త మెటీరియల్ సైన్స్ అండ్ నానోటెక్నాలజీ
డా. డి. విజయలక్ష్మి సమన్వయకర్త మైక్రోబయాలజీ
డా. ఎస్. చాన్‌బాషా సమన్వయకర్త ఫిజికల్ ఎడ్యుకేషన్
డా. వి. లాజర్ సమన్వయకర్త సైకాలజీ
డా. ఎస్. గోవర్దన్‌నాయుడు సమన్వయకర్త పీఎస్ అండ్ పీఏ
కె. శ్రీనివాసరావు సమన్వయకర్త కంప్యూటర్ అప్లికేషన్