
ఒట్టావా: డిగ్రీ అంటే మూడేళ్లు చదువుతారు. బ్యాక్‌ల్యాగ్స్ ఉంటే మహా అయితే మరో ఏడాది అంతే. కానీ కెనడాకు చెందిన ఆర్థూర్ రోజ్ అనే వ్యక్తికి డిగ్రీ పూర్తి చేయడానికి ఏకంగా 54 ఏళ్లు పట్టింది. ప్రపంచంలో నత్తనడకన డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తిగా రోజ్ రికార్డు సృష్టించాడు. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో 1969లో డిగ్రీలో చేరిన రోజ్ ఎట్టకేలకు తన 71 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా తీసుకున్నారు.
ఆర్థూర్ రోజ్ కెనడాకు చెందిన నటుడు. డిగ్రీలో చేరిన ఏడాది తర్వాత అతనికి నాటకాల పిచ్చి పట్టుకుంది. అందులో పడిపోయి చదువుని పట్టించుకోలేదు. మధ్యలో కొన్నాళ్లు నటనలో కూడా కోర్సులు చేశారు. అలా జీవితమంతా గడిచిపోయి రిటైర్ అయిపోయాక మళ్లీ చదువుపై ఆసక్తి వచ్చింది. 2016లో యూనివర్సిటీ ఆఫ్ కొలంబియాలో మళ్లీ హిస్టరీ స్టూడెంట్‌గా దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసి గురువారం పట్టా అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment