- ఈనెల 20న కళాశాలల్లో రిపోర్టు చేయాలి
కేయూ పీజీ సీట్ల అలాట్‌మెంట్ జాబితా విడుదల
Published Mon, Aug 15 2016 10:58 PM | Last Updated on Fri, May 25 2018 3:26 PM
కేయూ క్యాంపస్ : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు సీట్ అలాట్‌మెంట్ జాబితాను కేయూ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న సోమవారం విడుదల చేశారు. విద్యార్థులు ఎంచుకున్న వెబ్ ఆప్షన్‌ల ప్రాధాన్యతలను బట్టి కంప్యూటర్ సహాయంతో జాబితా తయారు చేశారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఈనెల 20వతేదీ వరకు విద్యార్హతలు తదితర ఒరిజనల్ సర్టిఫికెట్లతో కెటాయించిన కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.కృష్ణారెడ్డి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వై.వెంకయ్య, డాక్టర్ జె.లక్ష్మణ్‌నాయక్ తెలిపారు. విద్యార్థులకు ఎస్‌ఎంఎస్ ద్వారా సీట్ల కెటాయింపు సమాచారం తెలియజేశామని, ఏకళాశాలలో సీటు లభించిందో తెలుసుకునేందుకు ఈనెల 16న యూనివర్సిటీ వెబ్‌సైట్ ద్వారా లేదా అడ్మిషన్ల డైరెక్టరేట్‌లో సంప్రదిచ్చవచ్చని చెప్పారు. సీటు పొందిన విద్యార్థులు ముందుగా ఎస్‌బీఐ ఆన్‌లైన్ ద్వారా లేదా ఎస్‌బీఐ బిల్yð స్క్ ద్వారా ఫీజు చెల్లించాలని, 24 గంటల తరువాత అడ్మిషన్ కార్డును డౌన్‌లోడు చేసుకోవాలని సూచించారు. అడ్మిషన్‌కార్డు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 20న సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాలన్నారు. గతంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాని అభ్యర్థులు ఈనెల 25, 26 తేదీల్లో కేయూ అడ్మిషన్ల డైరెక్టరేట్‌లో వెరిఫికేషన్ చేయించుకోవచ్చని, వీరు ఈనెల 26నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వివరించారు. సీటు అలాట్‌మెంట్ రెండవ జాబితాను సెప్టంబర్ 2న ప్రకటిస్తామని, సెప్టంబర్ 6 వరకు ఫీజు చెల్లించి కళాశాలల్లో చేరవచ్చని, పూర్తివివరాలకు కేయూ వెబ్‌సైట్, అడ్మిషన్ల వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని చెప్పారు.
ప్రవేశ పరీక్షలు లేని కోర్సులకు
24న సర్టిఫికెట్ల పరిశీలన
కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో ప్రవేశపరీక్షలులేని సంస్కృతం, హిందీ, ఎంఐటీ, ఉర్దూ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ పీజీ కోర్సులకు ఈనెల 24న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, సీట్ అలాట్‌మెంట్ కూడా చేస్తారని సంబంధిత అడ్మిషన్ల డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు.
Advertisement