17 నుంచి కేయూ దూరవిద్య డిగ్రీ పరీక్షలు
Published Wed, Aug 10 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య డిగ్రీ బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ పరీక్షలు ఈనెల 17 నుంచి నిర్వహించనున్నారు. ఈమేరకు మంగళవారం కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్ తెలిపారు. డిగ్రీ కోర్సుల ప్రథమ, ఫైనల్ ఇయర్ పరీక్షలు ఈనెల 17 నుంచి జరుగుతాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1 వరకు ఫస్టియర్ పరీక్షలు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఈనెల 18 నుంచి సెప్టంబర్ 2 వరకు, ఫైనల్ ఇయర్ పరీక్షలు ఈనెల 17నుంచి సెప్టెంబర్ 2 వరకు జరుగుతాయని వివరించారు. ఫైనల్ ఇయర్ పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఫస్టియర్ పరీక్ష లు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఈపరీక్షలు 45వేల మందికిపైగా పరీక్షలు రాయబోతున్నారు.
కేయూ దూరవిద్య పీజీ పరీక్షలు
కేయూ దూరవిద్య పరిధిలోని పీజీ కోర్సుల ఎంఏ, ఎంకామ్, హెచ్‌ఆర్‌ఎం, రూరల్‌డెవలప్‌మెంట్, ఎమ్మెస్సీమ్యాథ్స్, ఎల్‌ఎల్‌ఎం ఫైనల్‌ఇయర్ పరీక్షలు ఈనెల 18 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ పురుషోత్తమ్ తెలిపారు. సెప్టెంబర్ 3 వరకు మ«ధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. దూరవిద్య పీజీ కోర్సుల మొదటి సంవత్సరం పరీక్షలు ఈనెల 20నుంచి సెప్టెంబర్ 3వతేదీ వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటాయని వివరించారు.
Advertisement