కాకతీయ, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు చివరి అవకాశం కల్పిస్తున్నట్లు కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. కృష్ణారెడ్డి, జాయింట్ డైరెక్టర్లు డాక్టర్ జె.లక్ష్మణ్‌నాయక్ తెలిపారు.
పీజీలో ప్రవేశానికి చివరి అవకాశం
Jul 29 2016 12:16 AM | Updated on Sep 4 2017 6:46 AM
కేయూ క్యాంపస్ : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు చివరి అవకాశం కల్పిస్తున్నట్లు కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. కృష్ణారెడ్డి, జాయింట్ డైరెక్టర్లు డాక్టర్ జె.లక్ష్మణ్‌నాయక్ తెలిపారు. ఇప్పటివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోని అభ్యర్థులు ఈనెల 29, 30వ తేదీల్లో కామర్స్ విభాగంలో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించారు. పీజీలో ప్రవేశానికి ఇదే చివరి అవకాశమని అభ్యర్థులు గమనించాలని పేర్కొన్నారు. అలాగే, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే గడువు ఆగస్టు 5వ తేదీతో ముగియనుందని తెలిపారు. అయితే, గతంలో ఆప్షన్లు ఇచ్చుకోని అభ్యర్థులకు ఆగస్టు 6, 7వ తేదీల్లో అవకాశం కల్పిస్తున్నట్లు వారు వివరించారు.
Advertisement
Advertisement