satha vahana university
-
‘ప్రైవేట్’ బిల్లు రద్దు చేయాలి
శాతవాహనయూనివర్సిటీ: ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం శాతవాహన యూనివర్సిటీ బంద్ నిర్వహించాలని ఏబీవీపీ నాయకులు వర్సీటీ వద్దకు చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబీవీపీ నాయకులు కిరణ్, యూనివర్సిటీ ఇన్చార్జి శివతోపాటు పలువురు యూనివర్సిటీలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ విషయం ముందగానే తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని నిలువరించారు. అరెస్టు చేసి కొత్తపల్లి ఠాణాకు తరలించారు. దీంతో కాసేపు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతవరణం నెలకొంది. వారు మాట్లాడుతూ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు రద్దు చేయాలని, యూనివర్సిటీల్లో రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ప్రైవేట్ యూనివర్సిటీలతో బడుగు, బలహీనవర్గాలకు విద్యను దూరం చేయాలని ప్రభుత్వం భావిస్తుందని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. యూని వర్సిటీ విద్యార్థులు శివ, ప్రశాంత్, నగర కార్యదర్శి చిక్కుల కిరణ్, జోనల్ ఇన్చార్జీలు రాపర్తి శ్రీనివాస్, బాలజీ, రామకృష్ణ, శివ, చింటు, ఆశీష్ పాల్గొన్నారు. -
పీజీలో ప్రవేశానికి చివరి అవకాశం
కేయూ క్యాంపస్ : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు చివరి అవకాశం కల్పిస్తున్నట్లు కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. కృష్ణారెడ్డి, జాయింట్ డైరెక్టర్లు డాక్టర్ జె.లక్ష్మణ్‌నాయక్ తెలిపారు. ఇప్పటివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోని అభ్యర్థులు ఈనెల 29, 30వ తేదీల్లో కామర్స్ విభాగంలో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించారు. పీజీలో ప్రవేశానికి ఇదే చివరి అవకాశమని అభ్యర్థులు గమనించాలని పేర్కొన్నారు. అలాగే, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే గడువు ఆగస్టు 5వ తేదీతో ముగియనుందని తెలిపారు. అయితే, గతంలో ఆప్షన్లు ఇచ్చుకోని అభ్యర్థులకు ఆగస్టు 6, 7వ తేదీల్లో అవకాశం కల్పిస్తున్నట్లు వారు వివరించారు. -
కేయూ పీజీ సెట్ షెడ్యూల్
కేయూ క్యాంపస్: కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు కేయూ పీజీ సెట్-2015 పరీక్షలు జూన్ 17 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు, కేయూ అడ్మిషన్ల ఇన్చార్జి డెరైక్టర్ డాక్టర్ ఎస్.నర్సింహాచారి తెలిపారు. ఈ సంవత్సరం వరంగల్‌తోపాటు కరీంనగర్లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జూన్ మొదటి వారం నుంచి అభ్యర్థులకు హాల్‌టికెట్లను పంపిణీ చేయనున్నామని, ఇతర వివరాలను కేయూ వెబ్సైట్లో చూడవచ్చన్నారు. అన్ని సబ్జెక్టులకు కలిపి 37,560 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. కాగా, ఎంఏ సంస్కృతి, ఎంఏ హిందీ, ఎంఏ ఉర్దూ, ఎమ్మెస్సీ నాటో సైన్స్ అండ్ నానోటెక్నాలజీ, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సుల్లో డిగ్రీ స్థాయిలో మార్కుల మెరిట్‌ను బట్టి ప్రవేశాలు కల్పించనున్నారు.