యూనివర్సిటీ ఎదుట ఆందోళన చేస్తున్న ఏబీవీపీ విద్యార్థులను అరెస్టు చేస్తున్న పోలీసులు
శాతవాహనయూనివర్సిటీ: ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం శాతవాహన యూనివర్సిటీ బంద్ నిర్వహించాలని ఏబీవీపీ నాయకులు వర్సీటీ వద్దకు చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబీవీపీ నాయకులు కిరణ్, యూనివర్సిటీ ఇన్‌చార్జి శివతోపాటు పలువురు యూనివర్సిటీలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ విషయం ముందగానే తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని నిలువరించారు. అరెస్టు చేసి కొత్తపల్లి ఠాణాకు తరలించారు. దీంతో కాసేపు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతవరణం నెలకొంది. వారు మాట్లాడుతూ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు రద్దు చేయాలని, యూనివర్సిటీల్లో రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ప్రైవేట్ యూనివర్సిటీలతో బడుగు, బలహీనవర్గాలకు విద్యను దూరం చేయాలని ప్రభుత్వం భావిస్తుందని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. యూని వర్సిటీ విద్యార్థులు శివ, ప్రశాంత్, నగర కార్యదర్శి చిక్కుల కిరణ్, జోనల్ ఇన్‌చార్జీలు రాపర్తి శ్రీనివాస్, బాలజీ, రామకృష్ణ, శివ, చింటు, ఆశీష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment