కేయూ క్యాంపస్: కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు కేయూ పీజీ సెట్-2015 పరీక్షలు జూన్ 17 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు కేయూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు, కేయూ అడ్మిషన్ల ఇన్‌చార్జి డెరైక్టర్ డాక్టర్ ఎస్.నర్సింహాచారి తెలిపారు. ఈ సంవత్సరం వరంగల్‌తోపాటు కరీంనగర్‌లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
జూన్ మొదటి వారం నుంచి అభ్యర్థులకు హాల్‌టికెట్లను పంపిణీ చేయనున్నామని, ఇతర వివరాలను కేయూ వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు. అన్ని సబ్జెక్టులకు కలిపి 37,560 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. కాగా, ఎంఏ సంస్కృతి, ఎంఏ హిందీ, ఎంఏ ఉర్దూ, ఎమ్మెస్సీ నాటో సైన్స్ అండ్ నానోటెక్నాలజీ, మేనేజ్‌మెంట్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సుల్లో డిగ్రీ స్థాయిలో మార్కుల మెరిట్‌ను బట్టి ప్రవేశాలు కల్పించనున్నారు.
కేయూ పీజీ సెట్ షెడ్యూల్
Published Thu, May 21 2015 1:27 AM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM
Advertisement
Advertisement