![female principal drinking beers in Gurukulas hostel](/styles/webp/s3/article_images/2024/07/7/9898_0.jpg.webp?itok=E9L4rEjh)
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని బాలెంల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో మద్యం సీసాలు దర్శనమివ్వడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తరచూ మద్యం తాగుతూ ప్రిన్సిపాల్ శైలజ తమను వేధింపులకు గురిచేసు్తన్నారని వారు ఆరోపించారు. ప్రిన్సిపాల్ అర్థరాత్రి వేళ సహాయ కేర్ టేకర్ సౌమిత్రితో కలిసి మద్యం తాగుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రిన్సిపాల్ రూమ్ కు తాళం వేశారు.
విషయం తెలుసుకున్న స్థానిక ఆర్డీవో వేణుమాధవ్‌రావు, కళాశాలలో ఆర్సీవో అరుణకుమారి, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి జ్యోతి, డీఎస్పీ రవికుమార్ కశాశాలకు చేరుకున్నారు. వాస్తవాలను విచారించి ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా విద్యార్థినులు శాంతించలేదు. ఈ ఘటనపై మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌ను ఆదేశించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు పూర్తి స్థాయి విచారణ కమిటీ అధికారిగా అదనపు కలెక్టర్ బీఎస్ లతను నియమిస్తూ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రాథమిక విచారణ ఆధారంగా కళాశాల ప్రిన్సిపాల్‌ను బదిలీ చేస్తున్నట్టు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment