గంట నుంచి నిలిచిన పుష్కర స్నానాలు | Godavari river bath stop due to power supply | Sakshi
Sakshi News home page

గంట నుంచి నిలిచిన పుష్కర స్నానాలు

Published Tue, Jul 14 2015 1:02 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

గంట నుంచి నిలిచిన పుష్కర స్నానాలు - Sakshi

గంట నుంచి నిలిచిన పుష్కర స్నానాలు

ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌లోని పుష్కర ఘాట్‌లో స్నానాలు నిలిచిపోయాయి. గోదావరిలో పుష్కర స్నానం ఆచరించేందుకు మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం 11 గంటల వరకు సుమారు 15 వేల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే, ఆ తర్వాత విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఇక్కడ గోదావరిలో సరిపడా నీరు లేకపోవడంతో షవర్లు ఏర్పాటు చేసి వాటి కింద పుష్కర స్నానానికి ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అయితే, విద్యుత్ లేకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో భక్తులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement