రెచ్చిపోయిన మావోయిస్టులు | wire recovered used for claymore mines | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన మావోయిస్టులు

Published Sat, Jan 7 2017 9:12 AM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు.

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. రోడ్డు పనులు నిర్వహిస్తున్న ఆరు వాహనాలకు నిప్పుపెట్టారు. జిల్లాలోని పఖంజేర్‌ ప్రాంతంలో అభివృద్ధి పనుల్లో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న రహదారి పనులకు వినియోగిస్తున్న ఆరు వాహనాలకు శుక్రవారం రాత్రి మావోయిస్టులు తగలబెట్టారు. ఇది గుర్తించిన కాంట్రాక్టర్‌ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మరో వైపు ఇదే జిల్లాలో భద్రాతా బలగాలను లక్ష్యంగా చేసుకొని ఏర్పాటు చేసిన మందు పాతరకు సంబంధించిన 100 మీటర్ల వైరును భద్రతాబలగాలు గుర్తించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement