ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణలతో రాష్ట్రం రావణకాష్టంలా మారిపోయింది. హింసాత్మక ఘటనలను కట్టడి చేసేందుకు 'తీవ్రమైన కేసుల్లో' కనిపిస్తే కాల్చివేతకు మణిపూర్ గవర్నర్ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని జిల్లాల్లో నిరసనకారులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల నిరసనకారుల్ని అదుపు చేయడానికి కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చిందని పోలీసులు తెలిపారు.
మణిపూర్ మారణహోమంలో మరణించిన వారి సంఖ్య 54కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. అయితే అనధికారికంగా మృతుల సంఖ్య మరింత ఎక్కువే ఉండవచ్చని భావిస్తున్నారు. బుల్లెట్ గాయాలు తగిలిన మరికొంత మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చి, సాధారణ పరిస్థితిని నెలకొల్పడం కోసం కేంద్రం అదనపు బలగాలను రంగంలోకి దింపింది. శాంతి భద్రతలను కాపాడేందుకు ఆర్మీ దళాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్ర పోలీసులు బలగాలలు అన్ని సమస్యాత్మక ప్రాంతాలు, రహదారుల్లో పహరా కాస్తున్నాయి. ఆర్టికల్ 355ను సైతం కేంద్ర అమల్లోకి తీసుకొచ్చింది.
శనివారం ఉదయం షాపులు, మార్కెట్లు తిరిగి తెరుచుకోవడంతో శనివారం ఇంఫాల్ వ్యాలీలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రజలు కురగాయాలు వంటి నిత్యవసర వస్తువుల కోసం బయటకు వస్తున్నారు. కార్లు వంటి వాహనాలు సైతం రోడ్డెక్కాయి. మరోవైపు ఇప్పటి వరకు మొత్తం 13 వేల మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రక్షణశాఖ అధికారి ఒకరు తెలిపారు. వారికి సైనిక శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో ఆశ్రయం కల్పించినట్లు చెప్పారు.
చదవండి: ఖర్గే కుటుంబాన్ని హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది!
గడిచిన 12 గంటల్లో, ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నాయిని, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. అయితే వేంగంగా స్పందించిన ఆర్మీ, ఇతర భద్రతా బలగాలు పరిస్థితిని నియత్రణలోకి తీసుకొచ్చాయని తెలిపారు. శుక్రవారం రాత్రి చురాచంద్‌పూర్ జిల్లాలోని సైటన్‌లో భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారని పోలీసులు తెలిపారు. ఇద్దరు ఐఆర్‌బీ జవాన్లు గాయపడ్డారని తెలిపారు.
గచురాచాంద్‌పూర్, మోరే, కక్చింగ్, కాంగ్‌పోక్పీ వంటి ప్రాంతాలను కేంద్ర బలగాలు తమ ఆధినంలోకి తీసుకున్నాయి. ఈ ప్రదేశాల్లో శుక్రవారం రాత్రి నుంచి ఎలాంటి ఘర్షణలు జరగలేదు. ఇండియన్ ఆర్మీ, అస్సాం రైఫిల్స్ బలగాలు దాదాపు 10,000 మంది సైనికులు రాష్ట్రంలో మోహరించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్, ఉన్నతాధికారులతో మాట్లాడారు. అకస్మాత్తుగా ఇటువంటి పరిస్థితులు ఏర్పడటం వెనుక ఉన్న అసలు కారణాలు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై ఆరాతీశారు.
అసలు ఎందకీ ఘర్షణలు?
మణిపూర్ రాష్ట్ర జనాభాలో 53 శాతం మంది ఉన్న మైతీలు తమకు షెడ్యూల్డు తెగల హోదాను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఎస్టీ హోదా కోసం మైతీలు చేస్తున్న డిమాండ్‌పై నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని మణిపూర్ హైకోర్టు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) పిలుపు మేరకు బుధవారం గిరిజన సంఘీభావ కవాతును నిర్వహించారు. ఈ కవాతు చురాచాంద్‌పూర్ జిల్లాలోని టోర్బుంగ్ ఏరియాలో జరిగింది.
ఈ కార్యక్రమంలో నాగాలు, జోమీలు, కుకీలు పాల్గొన్నారు. అయితే చురాచాంద్‌పూర్ జిల్లాలో బుధవారం జరిగిన గిరిజన కవాతు పలుచోట్ల ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అనంతరం లోయలోని జిల్లాలన్నిటికీ హింసాకాండ విస్తరించింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింస జరిగింది.
చదవండి: భద్రతా సిబ్బంది సమక్షంలోనే గ్యాంగ్‌స్టర్ టిల్లుపై కత్తితో.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment