రాంచీ: జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు హతమయ్యారు. కరమ్‌ది-ఛిపాదోహర్ అడవుల్లో బుధవారం ఉదయం 7.00 గంటల సమయంలో సీఆర్‌పీఎఫ్ కమాండోలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
‘ఎన్‌కౌంటర్ తర్వాత ఆరుగురు నక్సలైట్ల మృతదేహాలు, 600 బుల్లెట్లు, 12 పేలుడు పరికరాలు, ఓ రైఫిల్, ఎస్‌ఎల్‌ఆర్, కార్బైన్, మరో మూడు తుపాకులు స్వాధీనం చేసుకున్నాం. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి’ అని జార్ఖండ్ సీఆర్‌పీఎఫ్ ఐజీ (ఆపరేషన్‌స) సంజయ్ లత్కర్ తెలిపారు.
జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు నక్సలైట్ల మృతి
Published Thu, Nov 24 2016 12:44 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement