
సాక్షి, గడ్చిరోలి: మహారాష్ట్రలో మావోయిస్టులు రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లా కుర్ఖేడా తాలూకా దాదాపూర్ వద్ద మావోయిస్టులు బుధవారం రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన 36 వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఆ వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. కాగా ఈ ఏడాది జనవరిలో కూడా మావోలు విధ్వంసానికి పాల్పడ్డారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు నిలిపివేయాలంటూ మావోయిస్టులు ఈ సందర్భంగా ఘటనా స్థలంలో కరపత్రాలు వదిలి వెళ్లారు. మరోవైపు తమ వాహనాలకు మావోయిస్టులు నిప్పుపెట్టడంతో కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.







Comments
Please login to add a commentAdd a comment