ముంబై: మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. గడ్చిరోలి జిల్లాలోని ఎటపల్లి అటవీ ప్రాంతంలోవద్ద సీ-60 యూనిట్ మహారాష్ట్ర పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు కొనసాగుతుండడంలో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఎదురు కాల్పులకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment