భారీ ఎన్‌కౌంటర్ : 8మంది మావోయిస్టులు మృతి | 8 Maoists died in Gadchiroli encounter | Sakshi
Sakshi News home page

భారీ ఎన్‌కౌంటర్ : 8మంది మావోయిస్టులు మృతి

Published Thu, Feb 28 2019 3:39 PM | Last Updated on Thu, Feb 28 2019 8:24 PM

8 Maoists died in Gadchiroli encounter - Sakshi

గడ్చిరోలి : మహారాష్ట్ర గడ్చిరోలి సవేగామ్ అటవీ ప్రాంతం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. సవేగామ్ అటవీ ప్రాంతంలో గురువారం పోలీసులకు మావోయిస్టులకు మధ్య హోరా హోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోల కదలికల గురించి సమాచారం అందుకున్న బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో  వారికి మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా  బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ఈ భారీ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు దళానికి  గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement