మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్ | Five Naxals Assassinated In Encounter In Maharashtra | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్

Published Sun, Oct 18 2020 8:05 PM | Last Updated on Sun, Oct 18 2020 8:52 PM

Five Naxals Assassinated In Encounter In Maharashtra - Sakshi

ముంబై: మహారాష్ట్రలో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలి జిల్లాలోని ధనొరా పోలీస్ స్టేషన్ పరిధిలోని గల కొసమి-కిసనెల్లి అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.
(చదవండి : ములుగులో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోలు హతం)

మావోయిస్టులు ఉన్నారనే సమచారంతో సీ60 కమాండో ఫొర్సెస్ కూబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో కొసమి-కిసనెల్లి అడవి మధ్యలో మావోయిస్టులు తారాసపడడంతో పరస్పరం కాల్పులకు దిగినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా, మరికొంతమంది తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement