తల,మొండెం వేరుచేసి.. దారుణహత్య    | Women Brutal Murder In Siricilla | Sakshi
Sakshi News home page

తల,మొండెం వేరుచేసి.. దారుణహత్య   

Published Wed, Jul 25 2018 2:27 PM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM

Women Brutal Murder In Siricilla - Sakshi

 మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు  

గంభీరావుపేట(సిరిసిల్ల) : గంభీరావుపేట మండలంలో దారుణం చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల– కామారెడ్డి జిల్లాల సరిహద్దు అటవీప్రాంతమైన గంభీరావుపేట మండలం గోరింటాల గ్రామశివారులో తల లేని వ్యక్తి మొండెం మంగళవారం లభ్యమైంది. ప్రధాన రహదారి పక్కనే చెద్దర్లలో(బెడ్‌షీట్లలో)మూటగట్టి ఉన్న మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు, వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు.

ఎక్కడో కిరాతకంగా హత్యచేసి శరీరం నుంచి తలను వేరు చేసి.. మొండెంను ఇక్కడ వదిలేసి వెళ్లినట్లుగా భావిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో తలభాగం కోసం గాలించినా.. ఆచూకీ లభించలేదు. చేతులు కట్టేసి ఉండడం చూస్తుంటే.. కఠినంగా శిక్షించి, హింసించి హత్యచేసినట్లుగా భావిస్తున్నారు. వివరాలు సేకరించడానికి పోలీసులు చర్యలు చేపట్టారు.

మృతదేహాన్ని బట్టి వయస్సు దాదాపు 40ఏళ్లలోపు ఉండవచ్చునని తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని ఎస్పీ రాహుల్‌హెగ్డే, డీఎస్పీ వెంకటరమణ, ఎల్లారెడ్డిపేట రూరల్‌ సీఐ రవీందర్, డాగ్‌ స్క్వాడ్‌ బృందం అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement