
సంస్థాన్ నారాయణపురం: చేతబడి చేయడం వల్లనే తన సోదరుడు మృతి చెందాడన్న అనుమానంతో ఓ వ్యక్తి మహిళను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. గాంధీనగర్ తండాకు చెందిన నేనవత్ బుజ్జి (45), గన్నా భార్యాభర్తలు. బుజ్జి, గన్నా, గన్నా తల్లి రాగమ్మలు కలిసి ఆదివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బండనేమురు గ్రామంలో జరిగే శుభకార్యానికి వెళ్లాలని అనుకున్నారు. తల్లిని గన్నా తన బైక్‌పై కూర్చోబెట్టుకోగా, భార్య బుజ్జిని తెలిసిన వారి బైక్‌పై కూర్చోబెట్టాడు.
దారిలో అదే తండాకు చెందిన మోగవత్ నర్సింహ బుజ్జి ప్రయాణిస్తు న్న బైక్‌ను ఆపాడు. బైక్ నడుపుతున్న వ్యక్తిని కొట్టి, బుజ్జిని తన కారులో ఎక్కించుకొని రాచకొండ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చీరతో ఉరివేసి హత్య చేశాడు. ఎంతసేపటికీ భార్య రాకపోవడంతో వెనక్కివచ్చిన గన్నాకు కిడ్నా ప్ విషయం తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ వెంకటయ్య, ఎస్‌ఐ నాగరాజులు బుజ్జి కోసం గాలించగా, అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. హత్యచేసిన అనంతరం నర్సింహ పోలీస్‌సేష్టన్‌లో లొంగిపోయాడు.
చేతబడి చేసిందని కక్ష పెంచుకుని..
మోగవత్ నర్సింహ తమ్ముడు రాజేష్ గత డిసెంబర్ 30న విద్యుదాఘాతంతో మృతి చెం దాడు. అయితే బుజ్జి చేతబడి చేయడం వల్లే తన సోదరుడు మృతి చెందాడని కక్ష పెంచుకున్న నర్సింహ ఆమెను హత్య చేశాడు. కాగా, బుజ్జి బంధువులు సంస్థాన్‌నారాయణపురం పోలీస్ సేష్టన్ ముందు ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment