జిల్లా స్థాయి యువజనోత్సవాలకు సన్నాహాలు | prepare to youth festivals | Sakshi
Sakshi News home page

జిల్లా స్థాయి యువజనోత్సవాలకు సన్నాహాలు

Published Thu, Aug 31 2017 9:43 PM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM

prepare to youth festivals

అనంతపురం కల్చరల్‌: జిల్లాలోని అన్ని డివిజన్లలో విజేతలైన వారికి జిల్లా స్థాయి పోటీలను శుక్రవారం నిర్వహిస్తున్నట్లు యువజన సంక్షేమ శాఖాధికారి వెంకటేశం తెలిపారు. ఈ మేరకు గురువారం యువజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కళాకారుల్లోని ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా పోటీలు సాగుతాయన్నారు. స్థానిక కృష్ణకళామందిరంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 18 నుంచి 29 ఏళ్ల లోపు ఉన్న 5 డివిజన్లలోని  181 మంది పలు పోటీలు పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఆన్‌సెట్‌ మేనేజర్‌ సునీల్‌కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement