drip
-
పంటలకు వానలా నీళ్లు!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కాలువలు, బోరు బావుల పైప్లైన్లు వంటివి సాంప్రదాయ సాగునీటి పద్ధతులు... డ్రిప్‌లు, స్పింక్లర్లు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూక్ష్మ సేద్య విధానాలు.. కానీ ఇందుకు భిన్నంగా పంటలపై వాన కురిసినట్టుగా, అవసరానికి తగినట్టే నీళ్లు అందేలా ‘పివోట్ లీనియర్ ఇరిగేషన్’విధానాన్ని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అవలంబిస్తున్నారు. విదేశాల్లో వినియోగిస్తున్న ఈ సాంకేతికతను మన దేశంలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. పరిశోధనల్లో భాగంగా సాగు చేస్తున్న పంటలకు ఈ విధానంలో నీళ్లు అందిస్తున్నారు. మొత్తం పొలమంతా కాకుండా... కావాల్సిన చోట మాత్రమే, అనుకున్న సమయంలో పంటలకు వర్షంలా నీళ్లు అందించగలగడం దీని ప్రత్యేకత.తక్కువ ఎత్తులో పెరిగే పంటలకు..ప్రస్తుతం ఇక్రిశాట్లో వేరుశనగ, శనగ కొత్తవంగడాలపై పరిశోధనల కోసం సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాల్లో ఈ‘సెంట్రల్ పివోట్ లీనియర్ ఇరిగేషన్’విధానం ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇలా తక్కువ ఎత్తుండేపంటల సాగుకు ఈ విధానంతో ఎంతో ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మీటరుకన్నా తక్కువ ఎత్తుతోనే పండే పంటలకు ఎక్కువ మేలు అని పేర్కొంటున్నారు. భారీ విస్తీర్ణంలో పంటలు వేసే భూకమతాలు, ఒకేచోట వందల ఎకరాల్లో ఒకేతరహా పంటలు సాగుచేసే భారీ వ్యవసాయ క్షేత్రాల్లో ఈ విధానాన్ని వినియోగిస్తుంటారని చెబుతున్నారు. యంత్రాలతో కూడిన పద్ధతిలో కేవలం ఒకరిద్దరు వ్యక్తులతోనే వందల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని వివరిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని భారీ వ్యవసాయ క్షేత్రాల్లో పివోట్లీనియర్ ఇరిగేషన్ విధానం ఎక్కువగా వినియోగిస్తున్నారని చెబుతున్నారు.ప్రయోజనాలు ఎన్నెన్నో...ఈ విధానంలో పంటలకు సాగునీరు అందించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విధానంలో విద్యుత్ వినియోగం కూడా తక్కువని, నీటి వృథాను తగ్గిస్తుందని.. తక్కువ నీటి వనరులతో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయవచ్చని వివరించారు. నీటిని పారించే కూలీల అవసరం ఉండదని.. నేల కోతకు గురికావడం వంటి నష్టాలు కూడా ఉండవని వెల్లడించారు. పంటల అవశేషాలు తిరిగి మట్టిలో కలసి కుళ్లిపోవడానికి ఈ విధానం వీలు కలి్పస్తుందని, తద్వారా ఎరువుల వినియోగం తక్కువగా ఉంటుందని వివరించారు.⇒ పొలంలో కొన్ని పదుల నుంచి వందల మీటర్ల వరకు దూరంలో రెండు భారీ రోలర్లు, వాటి మధ్య పైపులతో అనుసంధానం ఉంటుంది. ఆ పైపులకు కింద వేలాడుతున్నట్టుగా సన్నని పైపులు ఉంటాయి. వీటి చివరన నాజిల్స్ ఉంటాయి.⇒ పొలంలోని బోరు/ మోటార్ ద్వారా వచ్చే నీటిని పైపుల ద్వారా రోలర్ల మధ్యలో ఉన్న ప్రధాన పైప్‌లైన్‌కు అనుసంధానం చేస్తారు. దీనితో బోరు/మోటార్ నుంచి వచ్చే నీరు.. రెండు రోలర్ల మధ్యలో ఉన్న పైపులు, వాటికి వేలాడే సన్నని పైపుల ద్వారా ప్రయాణిస్తుంది. నాజిల్స్ నుంచి వర్షంలా పంటలపై నీరు కురుస్తుంది.⇒ ఈ రోలర్లు పొలం పొడవునా నిర్దేశించిన వేగంలో ముందుకు, వెనక్కి కదులుతూ ఉంటాయి. ఈ క్రమంలో పంటపై వర్షంలా నీరు పడుతూ ఉంటుంది.⇒ రోలర్లను రిమోట్ ద్వారా నడపవచ్చు. లేదా కంప్యూటర్, సెల్‌ఫోన్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటకు ఎంత పరిమాణంలో నీటిని అందించాలన్నది నియంత్రించవచ్చు.‘పివోట్ లీనియర్ ఇరిగేషన్’విధానం ఇదీ..⇒ కావాలనుకున్న చోట ఎక్కువగా, లేకుంటే తక్కువగా నీటిని వర్షంలా కురిపించవచ్చు. వేర్వేరు పంటలను పక్కపక్కనే సాగు చేస్తున్న చోట ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.⇒ వ్యవసాయ క్షేత్రం విస్తీర్ణాన్ని బట్టి, ఏర్పాటు చేసుకునే పరికరాలను దీనికి అయ్యే ఖర్చు ఆధారపడి ఉంటుందని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిన్న, సన్నకారు రైతులు కాకుండా.. సమష్టి వ్యవసాయం చేసేందుకు ఈ విధానం మేలని పేర్కొంటున్నారు. -
రోజూ రూ.కోటి డ్రిప్ పరికరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతులకు రానున్న 90 రోజులపాటు ప్రతీరోజు రూ.కోటి విలువైన డ్రిప్ పరికరాలు సబ్సిడీపై అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. ఇందుకోసం రైతుల నుంచి ఈ 90 రోజులపాటు నిత్యం దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, కో–ఆపరేటివ్ శాఖల రాష్ట్రస్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.కొంతకాలంగా నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని యాసంగి నుంచి అమలుచేసి రైతులకు నాణ్యమైన పనిముట్లు, యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్‌పామ్‌తోపాటు ఉద్యాన పంటలకు కూడా డ్రిప్, స్ప్రింక్లర్లను సబ్సిడీపై అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు 2.31 లక్షల ఎకరాలకు చేరిందని తెలిపారు. ఆయిల్‌పామ్ ప్లాంటేషన్‌లో తక్కువ పురోగతి ఉన్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, వచ్చే ఏడాది మార్చికల్లా ముందుగా నిర్దేశించిన లక్ష ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. 8.59 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి సేకరణ రాష్ట్రంలో ఈ సీజన్లో ఇప్పటివరకు మార్కెటింగ్ శాఖ అధికారులు 3,56,633 మంది రైతుల నుంచి మద్దతు ధరతో 8,59,272.68 మెట్రిక్ టన్నుల పత్తిని సేకరించినట్లు అధికారులు మంత్రి తుమ్మలకు వివరించారు. గత సంవత్సరం ఇదే సమయానికి 1,99,108.43 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించినట్లు గుర్తుచేశారు. మరో రెండు నెలలపాటు పత్తి కొనుగోలు సజావుగా జరిగేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే, ప్రాథమిక సహకార సంఘాల పనితీరు మెరుగుపరిచి ఎక్కువ మంది రైతులకు వాటి సేవలు చేరేలా నిర్దిష్టమైన ప్రణాళికను ప్రభుత్వానికి పంపాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆ శాఖ డైరెక్టర్ గోపి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఉదయ్‌కుమార్, హారి్టకల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
సూక్ష్మ సాగుపైనా జీఎస్టీ పిడుగు
- డ్రిప్ యూనిట్లపై 18శాతం భారం పడే అవకాశం - జీఎస్టీ ఎవరు భరిస్తారన్న దానిపై అస్పష్టత - రైతులపై వేస్తే ఏటా రూ.5 కోట్లకు పైగా అదనపు భారం - ప్రస్తుతానికి డ్రిప్ మంజూరు ప్రక్రియ ఆపేసిన ఏపీఎంఐపీ అనంతపురం అగ్రికల్చర్: బిందు, తుంపర (డ్రిప్, స్ప్రింక్లర్ల) పరికరాల మంజూరు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. జూలై ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన వస్తు సేవా పన్ను (జీఎస్టీ) కారణంగా గందరగోళం నెలకొంది. జీఎస్టీ భారం నుంచి రైతులకు ఉపశమనం కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా సూక్ష్మసాగు సేద్యం పరికరాల విషయాన్ని పొందుపర్చకపోవడంతో ఆయోమయం నెలకొంది. 18 శాతం జీఎస్టీ అమలులోకి రావడంతో ఈ భారాన్ని ఎవరు భరిస్తారనే దానిపై స్పష్టత లేదు. దీంతో ప్రస్తుతానికి పరికరాల మంజూరు, ఇన్స్టాలేషన్ (బిగింపు) నిలిపేశారు. డ్రిప్ కంపెనీల నుంచి మెటీరియల్ సరఫరా ఆగిపోవడంతో బ్రేకులు పడ్డాయి. రూ.లక్ష విలువ చేసే పరికరాలపై రూ.18 వేలు జీఎస్టీ రైతులు భరించాలా లేదా కంపెనీలా... లేదంటే ప్రభుత్వమే భారం మోస్తుందా అనేది ఇప్పటివరకు స్పష్టతలేదు. రూ.లక్ష విలువైన పరికరాలపై వ్యాట్ రూపంలో 5 శాతం పన్ను విధిస్తున్నా, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ రావడంతో రైతులు కేవలం తమ వాటా కింద రాయితీ సొమ్ము మాత్రమే చెల్లిస్తున్నారు. ఇపుడు 5 శాతం , వాట్‌ను రద్దు చేసి 18 శాతం జీఎస్టీ వర్తింపజేయడం, దాన్ని ఎవరు చెల్లిస్తారనేదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వక సూక్ష్మసాగు సేద్యం పరికరాల పంపిణీ ఆపేశారు. రూ.కోట్లలో భారం : ఏపీపీఎంఐపీ ద్వారా ప్రస్తుతం ఒక్కో రైతుకు రూ.2 లక్షల విలువైన డ్రిప్ పరికరాలు అందజేస్తున్నారు. దీని ప్రకారం రూ.లక్షకు రూ.18 వేలు చొప్పున రెండు లక్షలకు రూ.36 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ప్రభుత్వం భరిస్తున్న 5 శాతం మినహాయించినా ఇంకా లక్షకు రూ.13 వేలు చొప్పున రెండు లక్షల విలువైన పరికరాలకు రూ.26 వేలు చెల్లించాల్సి ఉంటుంది. తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదంటూ డ్రిప్ కంపెనీలు, ఏపీఎంఐపీ అధికారులు చెప్తున్నారు.దీంతో రైతులకు అర్థంకాకుండా పోతోంది. 13 శాతం లేదా 18 శాతం పన్ను రైతులు భరించాల్సి వస్తే జిల్లా రైతులపై రూ.5 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. ఈ ఏడాది కనీసం 20 వేల మంది రైతులకు 31,750 హెక్టార్లకు సరిపడా డ్రిప్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో జీఎస్టీ భారం ఇబ్బంది పెడుతోంది. రైతులపై భారం వేయకుండా త్వరిగతిన ఉత్తర్వులు ఇచ్చి డ్రిప్ యూనిట్లు సకాలంలో అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. వారోత్సవాల్లో ఏపీఎంఐపీ అధికారులు : జీఎస్టీతో తాత్కాలికంగా డ్రిప్ యూనిట్లు మంజూరు, బిగింపు ప్రక్రియ ఆపేసిన ఏపీఎంఐపీ అధికారులు వారోత్సవాల పేరుతో వేరే పనులు చేస్తున్నారు. రైతుల గడప వద్దకే డ్రిప్ రిజిష్ట్రేషన్లు అంటూ 10 నుంచి 15వ తేదీ వరకు రిజిష్ట్రేషన్ల వారోత్సవం చేపట్టారు. ఇందులో 12 వేల సంఖ్యలో రిజిష్ట్రేషన్లు రావడంతో వాటిని క్షేత్రస్థాయిలో ప్రాథమిక పరిశీలన (ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ రిపోర్టు–పీఐఆర్) చేయాలని ఈనెల 24 నుంచి 29వ తేదీ వరకు పీఆర్ఆర్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 5న స్పష్టత వస్తుంది జీఎస్టీ భారం ఎవరు భరిస్తారనేదానిపై స్పష్టత లేదనేది వాస్తవమే. దీని కారణంగా డ్రిప్ మంజూరు ప్రక్రియ ఆపేయలేదు. డీడీలు వస్తున్నాయి, మంజూరు చేస్తున్నాం. రైతులు, కంపెనీలు, డిపార్ట్మెంట్కు కూడా క్లారిటీ లేకపోవడం మంజూరు ప్రక్రియ బాగా తగ్గిపోయింది. అయితే ఐదారు కంపెనీలు జీఎస్టీతో సంబంధం లేకుండా మెటీరియల్ సరఫరాకు ముందుకు రావడంతో అత్యవసరమైన రైతులకు ఆ కంపెనీల ద్వారా డ్రిప్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఆగస్టు 5న ఢిల్లీలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ మీట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. – ఎం.వెంకటేశ్వర్లు, ఏపీఎంఐపీ పీడీ -
బిందు సేద్యంపై సాంకేతిక శిక్షణ
అనంతపురం అగ్రికల్చర్: బిందు సేద్యంపై సాంకేతిక శిక్షణ కార్యక్రమం మంగళవారం స్థానిక పంగల్‌రోడ్డులోని టీటీడీసీలో ప్రారంభమైంది. నెటాఫిమ్ డ్రిప్ కంపెనీ, ఏపీఎంఐపీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 30 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. 25 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో మొదటి ఐదు రోజులు టీటీడీసీలో మిగతా 20 రోజులు పొలాల్లో ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించనున్నట్లు ఏపీఎంఐపీ ప్రాజెక్టు ఆఫీసర్ (పీఓ) ఏ.సూర్యప్రకాష్ తెలిపారు. డ్రిప్ యూనిట్ల మన్నిక, విడిభాగాలు, వాటి పనితీరు, ఫర్టిగేషన్, యాసిడ్ ట్రీట్మెంట్ (ఆమ్లచికిత్స) తదితర అన్ని రకాల సాంకేతిక అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీలు ఆర్.విజయశంకరరెడ్డి, జి.చంద్రశేఖర్, ఎంఐడీసీ సత్యనారాయణమూర్తి, నెటాఫిమ్ అగ్రానమిస్టు సుబ్బారావు పాల్గొన్నారు. -
యాసిడ్‌తో డ్రిప్ మన్నిక
అనంతపురం అగ్రికల్చర్ : అంతంత మాత్రంగా ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలంటే డ్రిప్ యూనిట్ల వాడకంలో జాగ్రత్తలు పాటించాలని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీలు ఆర్.విజయశంకరరెడ్డి, జి.చంద్రశేఖర్ తెలిపారు. నీటి విలువ తెలుసుకుకుని పొదుపుగా వాడుకోవడంతో పాటు డ్రిప్ పరికరాల మన్నిక విషయంలో అవగాహన పెంచుకోవాలని వారు సూచించారు. డ్రిప్ వాడకంలో మెలకువలు డ్రిప్ యూనిట్లు అమర్చుకున్న రైతులు 1.5 రేంజ్లో ప్రెషర్ ఉండేలా చూసుకోవాలి. వాల్వులు ఒకేసారి ఓపెన్ చేయకూడదు. ప్రెషర్ మెయింటెయిన్ చేయడం వల్ల లవణాలు, మలినాలు శుభ్రమవుతాయి. ప్రెషర్ వల్ల మొక్కలకు సమానంగా నీళ్లు అందుతాయి. ఫ్లష్ వాల్వులను వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. లేదంటే లవణాలు పేరుకుపోయి రంధ్రాలు పూడిపోతాయి. లాటరల్‌లు నెలకోసారి క్లీన్ చేసుకోవాలి. లేదంటే మలినాలు డ్రిప్పర్ల దగ్గర పేరుకుపోతాయి. నీటి తడులకు ఇబ్బంది లేకుండా ఐదు ల్యాటరల్లను ఒక బ్యాచ్‌గా చేసుకుని శుభ్రం చేసుకోవచ్చు. ఫిల్టర్ లోపల ఉండే జల్లెడను వారానికి ఒకసారి క్లీన్ చేయాలి. కొన్ని ప్రాంతాల్లో బోర్ల నుంచి ఇసుక వస్తుంది. అలాంటి ప్రాంతాల్లో రైతులు హైడ్రోసైక్లోన్ ఫిల్టర్‌ను వాడాలి. డ్రిప్ ద్వారా ఎరువులు (ఫర్టిగేషన్) వాడే సమయంలో మోటార్ ఆఫ్ చేసే 15 నిమిషాల ముందు ఎరువులు వదలాలి. ముందుగా ఎరువులు వదిలితే పోషకాలు మొక్కల వేరు వ్యవస్థ కన్నా కిందకు వెళ్లడం జరుగుతుంది. యాసిడ్ ట్రీట్మెంట్ ఉప్పు లవణాలతో కూడిన నీరు పైపుల ద్వారా వెళ్లడం వల్ల లేటరల్, డ్రిప్పర్లు మూసుకొని పోతాయి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం (హెచ్‌సీఎల్)తో యాసిడ్ ట్రీట్మెంట్ æ(ఆమ్లచికిత్స) మూడు లేదా ఆరు నెలలకోసారి చేసుకోవాలి. ట్రీట్మెంట్ చేసేముందు మొదట ఫిల్టర్లను, పీవీసీ పైపులను, లేటరల్ పైపులను శుభ్రం చేసుకోవాలి. సరైన మోతాదులో నీటిని కలుపుకుని తయారు చేసుకున్న ఆమ్ల ద్రావణాన్ని ఫర్టిలైజర్ ట్యాంకు లేదా ప్లాస్టిక్ బకెట్లో పోసుకుని వెంచురీ ద్వారా డ్రిప్ యూనిట్లోకి పంపించాలి. లేటరల్ చివర ఆమ్ల ద్రావణాన్ని నీటితో పాటు సబ్‌మెయిన్ లేదా లేటరల్, డ్రిప్పర్లలోకి చేరిన నీటిని పీహెచ్ పేపరుతో ముంచి పీహెచ్‌ను 4 రీడింగ్ ఉండేటట్లు చూసుకోవాలి. ఆమ్ల ద్రావణం పూర్తిగా సిస్టంలోకి పంపిన తర్వాత మోటారు ఆపేసి 24 గంటలపాటు నీటిని సిస్టంలో నిల్వ ఉంచాలి. దీనివల్ల పైపులలో పేరుకుపోయిన ఉప్పు లవణాలు కరిగిపోతాయి. యాసిడ్ ట్రీట్మెంట్పై ఏపీఎంఐపీ ఎంఐఏవోలు, డ్రిప్ కంపెనీ నిర్వాహకులను సంప్రదించాలి. -
అడిగిన వారందరకీ డ్రిప్
- వంద శాతం లక్ష్య సాధనకు కృషి - రైతులకు సహకరించని కంపెనీలకు జరిమానా -ఏపీఎంఐపీ పీడీ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): అడిగన వారందరికి బిందు సేద్యం సదుపాయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సూక్ష్మ సేద్యం లక్ష్యాలను వందశాతం సాధించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది 15వేల హెక్టార్లకు డ్రిప్ సదుపాయం కల్పించాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.10,500 హెక్టార్లకు పూర్తయిందన్నారు. గత ఏడాది ఇదే సమయానికి కేవలం 5వేల హెక్టార్లకు మాత్రమే డ్రిప్ కల్పించామన్నారు. డ్రిప్ కల్పనలో కర్నూలు జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో ఉందని తెలిపారు. ఈ ఏడాది ముగింపునకు 45 రోజుల సమయం ఉందని, రోజుకు 100 హెక్టార్ల ప్రకారం మంజూరు చేసి డ్రిప్ పరికరాలు అమర్చాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలిపారు. మార్చి నెల చివరి నాటికి లక్ష్యం మేరకు డ్రిప్ సదుపాయం కల్పిస్తామన్నారు. డ్రిప్ కంపెనీలు కూడా నిర్వహణలో ఎలాంటి లోపం లేకుండా చూడాలని తెలిపారు. నిర్వహణలో రైతులకు సహకరించని 19 కంపెనీలకు రూ.4.80 లక్షలు జరిమానా విధించినట్లు చెప్పారు. స్ప్రింక్లర్ల కంటే డ్రిప్ విధానాన్నే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వివరించారు. సూక్ష్మ సేద్యం వల్ల కలిగే ఉపయోగాలు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు తదితర వాటిపై రైతులకు అవగాహన కల్పించడం ద్వారా లక్ష్యాలను అధికమిస్తామన్నారు. . -
సూక్ష్మ సేద్య పరికరాలు సీజ్
– గోదాముపై తూ.కో అధికారుల దాడులు అనంతపురం సెంట్రల్ : వ్యవసాయంలో వినియోగిస్తున్న సూక్ష్మసేద్య పరికరాలు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో తూనికలు కొలతల శాఖ సీఐ శంకర్ సీజ్ చేశారు. బుధవారం బుక్కరాయసముద్రం మండల పరిధిలోని కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని నెటాఫిమ్, ఎంటెల్ కంపెనీలకు చెందిన గోదాములపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. వీటిలో తయారిదారుని చిరునామా, ఇతర వివరాలేమి లేకుండా తయారై వచ్చిన వస్తువులను అధిక రేట్లకు రైతులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సాల్వెంట్ సిమెంట్ ప్యాకెట్లు, ప్రెజర్గేజ్ మీటర్లు, వాల్వ్‌లు తదితర వాటిని సీజ్ చేసినట్లు సీఐ శంకర్ తెలిపారు. -
డ్రిప్ పరికరాలను అమర్చడంలో జాప్యం చేయొద్దు
కర్నూలు(అగ్రికల్చర్): రైతుల పొలాల్లో డ్రిప్ పరికరాలను అమర్చడంలో జాప్యం చేయొద్దని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరక్టర్ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం డ్రిప్ కంపెనీల ప్రతినిధులు, ఎంఐఏలతో నిర్వహించిన సమావేశంలో పీడీ మాట్లాడుతూ... జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వీరిని ఆదుకునేందుకు అడిగిన వెంటనే జిల్లా యంత్రాంగం డ్రిప్ మంజూరు చేస్తుందన్నారు. ఈ ఏడాది 15వేల హెక్టార్లలో డ్రిప్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని ఇచ్చిందని,దీనిని ఈ ఏడాది డిసెంబరు చివరికే సాధించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 1300 హెక్టార్లకు డ్రిప్ మంజూరు చేశామని, వీటిని తక్షణం డ్రిప్ పరికరాలను అమర్చాలని సూచించారు. బావి లేదా బోరు కలిగిన రైతులు డ్రిప్‌ను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రోత్సహించాలని వివరించారు. రెయిన్గన్లను సిద్ధం చేసిన కంపెనీలు సత్వరం టెక్నీషియన్లను నియమించుకుని ఎండుతున్న పంటలకు లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ కింద ఒక తడి నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో ఏపీఎంఐపీ ఏపీడీ మురళీమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘డ్రిప్’ అర్హత జాబితా సిద్ధం చేయండి
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా 51 వేల హెక్టార్లకు డ్రిప్ కావాలని రైతుల నుంచి దరఖాస్తులు వచ్చాయని, నెలలోగా క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హత జాబితా సిద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీ ఆర్.విజయశంకరరెడ్డి ఆదేశించారు. ఆదివారం ఏపీఎంఐపీ కార్యాలయంలో ఎంఐడీసీ సత్యనారాయణమూర్తితో కలిసి ఇరిగేషన్ కంపెనీ జిల్లా ప్రతినిధులు (డీసీవో), ఎంఐ ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2016–17లో జిల్లాకు కేటాయించిన 35 వేల హెక్టార్లలో 4,100 హెక్టార్లకు సరిపడా యూనిట్లు మంజూరు చేశామన్నారు. ఇంకా లక్ష్యం ఎక్కువగా ఉండటం, అందుకు అనుగుణంగా రైతుల నుంచి రిజిషే్ట్రషన్లు కూడా భారీగా ఉండటంతో మొదట వాటిని పూర్తీస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వాటితో జాబితా తయారు చేస్తే మంజూరు చేయడానికి సులభంగా ఉంటుందని తెలిపారు. అలాగే వేరుశనగ పంటకు రక్షకతడి ఇచ్చేందుకు వీలుగా కేటాయింపుల మేరకు కంపెనీల ద్వారా వెంటనే రెయిన్గన్లు, స్ప్రింక్లర్సెట్లు, పైపులు మండలాల్లో నిల్వ చేయాలని ఆదేశించారు. -
అధికారుల విచారణ
ముప్పిరితోట(ఎలిగేడు): మండలంలో ముప్పిరితోటకు చెందిన ఎంపీటీసీ రామిడి వెంకట్రామ్‌రెడ్డికి రెండేళ్లక్రితం డ్రిప్ ఇరిగేషన్( బిందుసేద్యం పథకం) కింద 90శాతం సబ్సిడీపై రూ.3 లక్షలతో మంజూరు అయ్యింది. నిర్వాహకులు పరికరాలను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం చే స్తున్నారని లబ్ధిదారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మైక్రో ఇరిగేషన్ డీఈ వెంకటేశ్వర్లు శనివారం విచారణ చేపట్టారు. తమకు డ్రిప్ పరికరాలు పూర్తిగా అమర్చకుండా కంపెనీ నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, డ్రిప్ సిస్టమ్ పనుల పూర్తయినట్లు ఫోటోలు తీసుకుని తమ సంతకాలను ఫోర్జరీచేసి బిల్లులను సైతం తీసుకున్నారనీ ఆరోపించారు. నిర్లక్ష్యం చేసిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కంపనీవారితో పనులు చేయిస్తామని, ఫోర్జరీ సంతకాలు ఆరోపణలపై ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిచాల్సిందిగా అధికారులకు సూచిస్తామన్నారు. -
రుధిరదారులు
పాలమూరు రహదారులు రక్తమోడుతున్నాయి. రోజుకు ఒకరిద్దరి చొప్పున మృత్యువుబారిన పడుతున్నారు. మద్యం సేవించి వాహనాలను నడపడం, వాహనాలను ఓవర్ టేక్ చేయడం, ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం.. వంటి కారణాలు నిండుప్రాణాలను మృత్యుదరికి చేరుస్తున్నాయి. కన్నవారు, ఆత్మీయులను పొగొట్టుకుని బాధిత కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. ఎంతోమంది కాళ్లూచేతులు విరగ్గొట్టుకుని మంచానికే పరిమితమవుతున్నారు. -సాక్షి, మహబూబ్‌నగర్ జిల్లాలో ఏటా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి జరిగిన 1117 ప్రమాదాల్లో 599 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 1027 మంది తీవ్రంగా గాయపడ్డారు. సరాసరిగా రోజుకు ముగ్గురు చొప్పున మరణిస్తుండగా.. ఆరుగురి చొప్పున తీవ్రంగా గాయపడుతున్నారు. ఈ ఏడాది ఎనిమిది నెలల కాలంలో అత్యధికంగా మేలో ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో అత్యధికంగా 44వ జాతీయ రహదారి, జడ్చర్ల- రాయిచూరు ప్రధాన రహదారులపైనే ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. జిల్లా పరిధిలో జాతీయ రహదారి దాదాపు 180 కి.మీ మేర విస్తరించి ఉంది. నాలుగులేన్ల రహదారిగా ఉన్న జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల నివారణకు నేషనల్ హైవే అథారిటీ, పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. వాహనదారులకు అవగాహన కోసం ఎక్కడిక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టడం, వేగం నియంత్రణ కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. అలాగే జాతీయ రహదారిపై ఉన్న గ్రామాల వారు కూడా ప్రమాదాల బారినపడి చనిపోతున్నారు. రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చే వాహనాలు ఢీకొట్టి వెళ్లిపోతున్నాయి. తాజాగా మాచారం గేట్ వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఆగస్టు 1న జేపీ దర్గా బైపాస్ కూడలీలో రెండు క్వాలీస్ వాహనాలు ఢీ కొన్న సంఘటనలో హైదరాబాద్ బండ్లగూడకు చెందిన షాహీదాబేగం(8) మృతిచెందింది. ఆగస్టు 8న పెంజర్ల బైపాస్ కూడలీలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి. సెప్టెంబర్ 6వ తేదిన ఐఓసీఎల్ పెట్రోల్ బంకు వద్ద బైకును కారు ఢీకొన్న ఘటనలో కేశంపేట మండలానికి చెందిన కానీస్టేబుల్ రాములు(40) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో ప్రమాదాలే అధికం జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ప్రాణనష్టం ఆటో ప్రమాదాల వల్లే చోటుచేసుకుంటున్నట్లు పోలీసుల రికార్డు చెబుతోంది. జడ్చర్ల- రాయిచూర్ ప్రధాన రహదారిలో అత్యధికంగా ఆటో ప్రమాదాలే జరుగుతున్నాయి. పరిమితికి మించి ఎక్కువ మందిని ఎక్కించుకోవడం, చాలామంది ఆటో డ్రైవర్లకు లెసైన్స్ లేకుండా నడపడం. మితిమీరిన వేగంతో ప్రమాణించడం వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఆటోలో ప్రయాణించి ప్రాణాలు కోల్పోతున్న వారిలో అత్యధికంగా సామాన్యులే ఉంటున్నారు. మాగనూరు మండలం వడ్వాట్కు చెందిన వలస కూలీలు సమగ్ర కుటుంబ సర్వే కోసం స్వగ్రామానికి వచ్చింది. సర్వే తర్వాత ఆగస్టు 21న తిరుగు ప్రయాణమైన వారి ఆటోను లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే ఏడుగురు మృత్యువాతపడ్డారు. అలాగే ఆగస్టు 25న జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్ వస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. తరుచూ ఇలా ఆటో ప్రమాదాల బారిన అధికప్రాణనష్టం చోటుచేసుకుంటుంది. -
యువ కృషీవలురు!
మేడ్చల్: ఒకప్పుడు రియల్ ఎస్టేట్ మాయాజాలంలో పడి వ్యవసాయానికి దూరమైన నగర శివారు ప్రాంత రైతులు ప్రస్తుతం సేద్యంపై దృష్టిసారించారు. పంటల సాగులో ఆధునిక పద్ధతులు పాటిస్తూ ఆశించిన దిగుబడులు సాధిస్తున్నారు మండలంలోని రాయిలాపూర్ యువ రైతులు. కూరగాయలు, ఆకుకూరల పంటల సాగులో డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలను ఉపయోగిస్తూ తక్కువ నీటితో ఎక్కువ పంటలు సాగు చేస్తున్నారు. రాయిలాపూర్‌లో దాదాపు 200 ఎకరాల్లో పలు రకాల కూరగాయలు, ఆకుకూరల పంటలు సాగవుతున్నాయి. గ్రామంలోని 100 మంది రైతుల్లో 50 మంది యువకులే ఉండటం.. వ్యవసాయంపై వారికి ఎంత మక్కువ ఉందో అర్థమవుతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి.. కూలీలపై ఆధారపడకుండా కు టుంబ సభ్యులే ఆకుకూరలను కట్టలుగా తయారు చేస్తున్నారు. కూరగాయలను కోసి గంపల్లో వేసి నగరంలోని వివిధ మార్కెట్లకు తరలిస్తున్నారు. చిన్న రైతులు చిరు వ్యాపారులకు పొలం వద్దనే విక్రయిస్తున్నారు. మరికొంత మంది మేడ్చల్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రైతేరాజు అని నిరూపిస్తున్నారు. -
అనంత’ రైతును ఆదుకున్న వైఎస్
భారీ రాయితీలతో రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ల పరికరాలు అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న వ్యవసాయ రంగం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రగతి బాట పట్టింది. ప్రధానంగా 2003లో ప్రారంభమైన బిందు( డ్రిప్), తుంపర(స్ప్రింక్లర్లు) సేద్యం పథకం నిత్య క్షామ పీడిత జిల్లా ‘అనంత’లోని రైతుల పాలిట వరమైంది. వైఎస్ సీఎంగా ఉన్న ఆరేళ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, ఇతర రైతులకు 90 శాతం మేర భారీగా రాయితీలు కల్పించి, అడిగిన వెంటనే డ్రిప్, స్ప్రింక్లర్లు అందించి సూక్ష్మసాగు సేద్యాన్ని పెంచారు. ఆయన హయాంలో 2004-05 నుంచి 2009-10 వరకు మొత్తం రూ.277.45 కోట్ల రాయితీలు ఇచ్చి, 1.13 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సాగు పరికరాలు అందించారు. తద్వారా జిల్లాలో పండ్ల తోటల పెంపకం అభివృద్ధి చెందింది. దీంతో జిల్లా ‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా ఖ్యాతినార్జించింది. వైఎస్ మరణానంతరం వచ్చిన ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోని ఐదేళ్ల వ్యవధిలో జిల్లా రైతులకు గ్రహణం పట్టింది. దరఖాస్తు చేసుకుని ఏడాది పాటు ఎదురు చూసినా డ్రిప్, స్ప్రింక్లర్లు అందలేదు. ఈ పథకం బడ్జెట్ కుదించడం, ఎస్సీ, ఎస్టీలు మినహా ఇతర రైతులకు భూ విస్తీర్ణాన్ని బట్టి రాయితీలు నిర్దేశించడంతో సూక్ష్మ సాగు సేద్యం అటకెక్కింది. వీరి పాలనలో జిల్లాలో కేవలం 58 వేల హెక్టార్లకు డ్రిప్, స్ప్రింక్లర్లు అందించి, రూ.200.98 కోట్లు మాత్రమే రాయితీలు కల్పించారు.