డ్రిప్ పరికరాలను అమర్చడంలో జాప్యం చేయొద్దు
డ్రిప్ పరికరాలను అమర్చడంలో జాప్యం చేయొద్దు
Published Thu, Aug 25 2016 1:09 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
కర్నూలు(అగ్రికల్చర్): రైతుల పొలాల్లో డ్రిప్ పరికరాలను అమర్చడంలో జాప్యం చేయొద్దని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరక్టర్ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం డ్రిప్ కంపెనీల ప్రతినిధులు, ఎంఐఏలతో నిర్వహించిన సమావేశంలో పీడీ మాట్లాడుతూ... జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వీరిని ఆదుకునేందుకు అడిగిన వెంటనే జిల్లా యంత్రాంగం డ్రిప్ మంజూరు చేస్తుందన్నారు. ఈ ఏడాది 15వేల హెక్టార్లలో డ్రిప్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని ఇచ్చిందని,దీనిని ఈ ఏడాది డిసెంబరు చివరికే సాధించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 1300 హెక్టార్లకు డ్రిప్ మంజూరు చేశామని, వీటిని తక్షణం డ్రిప్ పరికరాలను అమర్చాలని సూచించారు. బావి లేదా బోరు కలిగిన రైతులు డ్రిప్‌ను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రోత్సహించాలని వివరించారు. రెయిన్‌గన్‌లను సిద్ధం చేసిన కంపెనీలు సత్వరం టెక్నీషియన్లను నియమించుకుని ఎండుతున్న పంటలకు లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ కింద ఒక తడి నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో ఏపీఎంఐపీ ఏపీడీ మురళీమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement