Bore
-
ఆక్వా చెరువు బోరు నుంచి గ్యాస్
రాజోలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఓ ఆక్వా చెరువు వద్ద బోరు బావి నుంచి నీటితో కలిసి 15 అడుగుల మేర గ్యాస్ పైకి ఎగజిమ్మింది. అయితే, మంటలు వ్యాపించకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... రాజోలు మండలంలోని చింతలపల్లి–అరవపాలెం రోడ్డులో కె.విజయేంద్రవర్మ అనే వ్యక్తికి చెందిన ఆక్వా చెరువు వద్ద ఉన్న బోరు బావి నుంచి శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆకస్మికంగా నీరు ఎగసిపడింది. విద్యుత్ మోటారు, ఆయిల్ ఇంజన్ వంటివి ఏమీ లేకుండానే బోరు బావి నుంచి నీరు 15 అడుగుల మేర ఎగసిపడుతుండటంతో సమీపంలోని కూలీలు వెళ్లి చూశారు. అయితే, గ్యాస్ వాసన రావడంతో భయాందోళనలకు గురైన కూలీలు వెంటనే రాజోలు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక అధికారి సీహెచ్ అనిల్‌కుమార్, సిబ్బంది గ్యాస్ లీక్ అవుతున్న బోరు బావి వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బోరు బావి లోపల తీవ్రమైన ఒత్తిడి పెరిగి, నీటితో కలసి గ్యాస్ ఉధృతంగా పైకి వస్తోందని గుర్తించారు. నీటిలో సుమారు ఆరు శాతం గ్యాస్ ఉందని నిర్ధారించారు. బోరు బావిని ఇసుకతో పూడ్చివేసి గ్యాస్ పైకి రాకుండా చేశారు. కొత్తగా బోర్లు వేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఉప్పు నీటి కోసం 200 మీటర్ల మేర భూమి లోపలకు బోర్లు వేయడం వల్ల గ్యాస్ పైకి వస్తుందని అనిల్‌కుమార్ చెప్పారు. కొన్నిసార్లు గ్యాస్ శాతం ఎక్కువగా ఉండడంతో మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు. -
9 అడుగుల్లో బోరు.. కరెంటు లేకున్నా 20 ఏళ్లుగా నీరు
సాక్షి, ఆదిలాబాద్: మండుతున్న ఎండలతో రాష్ట్రంలో నీటి సంక్షోభం తీవ్రమవుతోంది. చెరువులు ఎండిపోతున్నాయి. పంటలకు నీరందక చేలలో బీటలు కనిపిస్తున్నాయి. మరో వైపు తాగునీటి సమస్య కూడా జఠిలమవుతోంది. భూగర్భ జలాలు అంతకంతకూ అడుగంటిపోతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆదిలాబాద్ జిల్లా బేల మండలం దుబ్బగూడ (ఎస్)లోని ఓ గిరిజన రైతు పంట చేనులో మాత్రం బోరు నుంచి జలం ఉబికి వస్తూనే ఉంది. విచిత్రం ఏమిటంటే అసలు ఈ బోరుకు కరెంటు కనెక్షనే లేదు. దాదాపు 20 ఏళ్లుగా సహజంగా నీళ్లు ఇలా వస్తూనే ఉన్నాయి. 2005 నుంచి కొనసాగుతున్న ధార.. గిరిజన రైతు టేకం తుకారాంకు 26 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయన ముగ్గురు కుమారులతో కలిసి దీన్ని సాగుచేస్తున్నాడు. 2005లో తుకారాం చేనులో బోరు వేయించాడు. అప్పుడు 9 అడుగులకే నీళ్లు ఉబికి వచ్చాయి. కరెంటు కనెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే ఆ జలధార ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం 13 ఎకరాల్లో జొన్న, గోధుమ పంటలు పండిస్తున్నాడు. వీటికి నిరంతరాయంగా బోరు నుంచి వచ్చే నీరే అందిస్తున్నాడు. ఆర్టీసియన్ బావి కారణంగానే.. దీన్ని భూగర్భ జలశాస్త్రం ప్రకారం ఆర్టిసియన్ బావి అంటారు. దుబ్బగూడ (ఎస్)కు సమీపంలో గుట్ట ఉంది. వర్షం కురిసినప్పుడు ఆ గుట్ట ప్రాంతంలో జలం రీచార్జ్ అవుతుంది. అక్కడి నుంచి నిలువుగా ఉన్నటువంటి పొర దిగువన గుట్ట దిగిన తర్వాత తుకారాం చేనులో నుంచి వెళ్తుంది. పైపొర గుట్ట పైభాగం నుంచి మొదలు కాగా చివరి పొర తుకారాం చేనును దాటి వెళ్తోంది. దుబ్బగూడలో ఒక లేయర్లో భూగర్భ జలాలు పైవరకు ఉంటాయి. మధ్య ప్రాంతంలో ఎవరైనా బోరు వేసినప్పుడు ఈ పొరను తాకడంతో నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఒక ట్యూబ్‌కు మధ్యలో ఎక్కడైనా పంచర్ పడ్డప్పుడు గాలి, నీరు ప్రెషర్‌తో బయటకు వచ్చినట్లే ఇక్కడ కూడా పైపొర, చివరి పొర మధ్యన బోరువేసినప్పుడు నీటికి బయటకు వెళ్లే మార్గం ఏర్పడింది. గుట్టకు సమీపంలో ఉండే ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ రూరల్ మండలం బోరింగ్‌గూడలో కూడా ఇలాగే నీళ్లు ఉబికి వస్తాయి. –టి. పుల్లారావు,అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్, ఆదిలాబాద్ -
బోర్ కొడుతుందా? వెరైటీగా ఇలా ట్రై చేయండి..
సాధారణంగా మీకు బోర్ కొడితే ఏం చేస్తారు? సోషల్ మీడియాలోకి దూరిపోయి ఇన్‌స్టా రీల్స్ చూడటమో, వీడియో గేమ్స్ ఆడటమో చేస్తుంటాం. లేదా మరీ బోర్ కొడితే సరదాగా సినిమాలు,సిరీస్‌లు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఇవి ఎప్పుడూ చేసే పనులే. ఖాళీగా ఉన్నప్పుడే క్రియేటివ్ ఆలోచనలు బయటపడతాయి. అందుకే ఈసారి మీకు బోర్ కొడితే కాస్త వెరైటీగా ఇలా ట్రై చేసి చూడండి. ►రూమ్ క్లీనింగ్ అనేది ఓ మంచి థెరపీ లాంటిది. మీకు బోర్ కొట్టినప్పుడు మీ క్లాసెట్ను ఓపెన్ చేసి బట్టలు అన్నీ చక్కగా సర్దుకోండి. ఇలా చేస్తే మీకు మంచి టైంపాస్ అవడంతో పాటు ఓ పెద్ద టాస్క్ కూడా కంప్లీట్ అయినట్లుంటుంది. మనం ఉండే రూమ్, వాడే వస్తువులను నీట్‌గా, ఆర్డర్లో పెట్టుకుంటే ఆర్గనైజింగ్ స్కిల్స్ కూడా అబ్బుతాయి. ► మీ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి కాసేపు సరదాగా మాట్లాడుకోండి. కొన్నిసార్లు బిజీ లైఫ్‌లో పాత ఫ్రెండ్స్‌ని మర్చిపోతుంతాం. అందుకే బోరింగ్‌గా ఫీల్ అయినప్పుడు మీ ఫ్రెండ్స్ లిస్ట్‌ని గుర్తు చేసుకొని ఆడియో, లేదా వీడియో కాల్ చేసి తనివితీరా మాట్లాడండి. ► కొత్త రెసిపీ ప్రయోగం చేయండి. వంట చేస్తున్నప్పుడు మన దృష్టి అంత దానిమీదే ఉంటుంది కాబట్టి కొత్తగా ఏం చేయాలి? ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ వాడాలి అన్న ఆలోచనలు వస్తాయి. మీకు బేకింగ్ ఇష్టమైతే, కుకీస్, కప్ కేక్స్ వంటివి ట్రై చేసి చూడండి. ► మీ దగ్గర బోలెడన్ని బట్టలు ఉన్నాయా? పాత బట్టలు ఏం చేయాలో తెలియకుండానే, కొత్తవి అవసరం లేకపోయినా కొంటున్నారా? అయితే ఓ పని చేయండి. మీకు అవసరం లేవు అనుకున్న బట్టలను లేనివాళ్లకు అయినా సహాయం చేయండి. కొంతమంది ఒక్కసారి వేసిన అవుట్‌ఫిట్స్‌ను మళ్లీ రిపీట్ చేయడానికి కూడా ఇష్టపడరు. అలాంటి వాళ్లు చాలా బట్టలు ఇతరులకు హెల్ప్ చేయగలిగితే మంచిది. మీకు బొర్ కొట్టినప్పుడు మీ పాత దుస్తులు, ఫర్నీచర్.. ఇలా అవసరం లేని వస్తువులను ప్యాక్ చేసి చారిటీకి ఇవ్వడం అలవాటు చేసుకుంటే మీకు తెలియకుండానే ఎంతోమందికి సహాయం చేసిన వాళ్లవుతారు. ►ఖాళీగా ఏం చేయాలో తెలియడం లేదా? అయితే మీ క్రియేటివి మొత్తం బయటకు తీయడానికి ఇంతకన్నా బెస్ట్ టైం దొరకదు. క్రాఫ్ట్స్‌లో అసలు సమయమే కనిపించదు. ఇంట్లోనే క్యాండిల్స్ చేయడం, ఇంటికి అవసరమైన వస్తువులను సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో గూగుల్‌లో వెతకండి. దీనివల్ల మీ టైంని కరెక్ట్‌గా ఉపయోగించుకున్నవాళ్లవుతారు. ► బోర్ కొడుతుంది..కానీ బయటికి వెళ్లే మూడ్ లేదా? అయితే ఇంట్లోనే కూర్చొని నేషనల్ పార్క్‌లను ఓ లుక్కేయండి. మన దేశంలోనే ఎన్నో అందమైన పార్కులు ఉన్నాయి. NationalParks.org అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే బోలెడన్నీ పార్కులు లైవ్‌గా ఇంట్లోనే చూసి ఆస్వాదించొచ్చు. వీటితో పాటు ఎన్నో పర్యాటక ప్రదేశాలను కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే కూర్చొని వీక్షొంచొచ్చు. ► మీకు బోర్ కొట్టినప్పుడు కాస్త పెరట్లోకి వెళ్లి ఓ హాయ్ చెప్పేసి రండి. అదేనండి మీ మొక్కలకు. గార్డెనింగ్‌లో మునిగిపోతే అసలు సమయమే కనిపించదు. కొత్త మొక్కలు నాటడం, ఉన్నవాటికి నీళ్లు పట్టడం, పాడైనవి తీసేయడం వంటివి చేయండి. రెగ్యులర్‌గా చేస్తూ ఇదొక రొటీన్‌లా మారిపోతుంది. ► చాలా సమయాన్ని ఏం చేయాలో తెలియక వృథా చేస్తుంటాం. బోర్ కొట్టినప్పుడు అయినా అసలు భవిష్యత్తులో ఏం చేయాలి? ఇప్పటివరకు ఏం చేశాం, నెక్ట్స్ ఎలా ప్లాన్ చేసుకుంటే బావుంటుంది అనే విషయాలపై దృష్టి పెడితే మంచిది. కొత్త భాష నేర్చుకోవడం, ఖర్చులు తగ్గించుకోవడం, కొత్త లక్ష్యాలు ఏర్పరుచుకోవడం.. ఇలా మీ ఇంట్రెస్ట్‌కి తగ్గట్లు ఓ చార్ట్ ప్రిపేర్ చేసుకొని దానికి తగ్గట్లు మీ సమయాన్ని కేటాయిస్తే కొన్ని రోజుల్లోనే ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. -
బోరు వేయని బోరిగాం.. అదెలా సాధ్యమంటారు?
ఐదొందల నుంచి వెయ్యి ఫీట్ల లోతు వరకు బోరు వేసినా చాలా చోట్ల చుక్కనీరు పడని పరిస్థితి. దీంతో రైతన్నలు అప్పులపాలై ఆగమైన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కానీ.. ఇక్కడ మాత్రం ఒక్క బోరు లేకుండా ఊరంతా పచ్చని పంటలతో కళకళలాడుతోంది. యాసంగిలోనూ కనుచూపు మేర పసుపు, పత్తి, మొక్కజొన్న, గోధుమ పంటలతో కనువిందు చేస్తోంది. అదెలా సాధ్యమంటారా..? ఎప్పుడో ఏళ్ల క్రితం ఆ గ్రామస్తులు పెట్టుకున్న ఓ ‘కట్టుబాటే’నేటికీ నీటి కష్టాన్ని తెలియనివ్వడం లేదు. ఊర్లో ఎవరూ బోర్లు వేయకూడదని నిర్ణయించారు. ఇప్పటికీ దాన్ని పాటిస్తూ ఊట బావులపైనే వారు ఆధారపడుతున్నారు. సాక్షి, నిర్మల్ : అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న బోరిగాం గ్రామం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలో ఉంటుంది. సాధారణంగా ఏ ఊరు.. ఏ పంట చేలకు వెళ్లినా.. బోరుబావుల ద్వారానే సాగు చేయడం చూస్తుంటాం. బోరిగాంలో మాత్రం ఎక్కడ చూసినా ఊటబావులే దర్శనమిస్తాయి. 40 అడుగుల లోతు ఉన్న ఆ బావుల్లో ఎప్పుడూ సగానికి పైగా నీరు ఉంటుంది. మూడు కాలాలు ఆ బావుల్లో నీళ్లు ఊరుతూనే ఉంటాయి. ఎప్పుడు చూసినా పంట పొలాలు పచ్చగా కళకళలాడుతాయి. కట్టుబాటే ఊటైంది ‘మన ఊళ్లో ఎప్పటికీ నీటి కష్టం రావొద్దంటే.. ఎవరు కూడా బోర్లు వేయొద్దు. ఎన్నాళ్లయినా బావులను తవ్వుకునే సాగు చేసుకోవాలె..’అంటూ ఎప్పుడో బోరిగాం గ్రామస్తులు ముందు చూపుతో పెట్టుకున్న ఆ కట్టుబాటు ఇప్పటికీ జలసిరులకు ఢోకా లేకుండా చేస్తోంది. 30–40 ఏళ్ల క్రితం తవ్విన బావులూ ఉన్నాయి. కుటుంబాలు విడిపోయి, వేరుపడిన అన్నదమ్ములు సైతం పంపకాల్లో తమకు వచ్చిన భూముల్లో మళ్లీ బావులనే తవ్వుకున్నారు తప్ప బోర్లు వేయలేదు. ఇలా తమ పెద్దలు పెట్టిన కట్టుబాటునే కొనసాగిస్తూ ఊట నీటితో పోటాపోటీగా పంటలు పండిస్తున్నారు. చెరువులే అండ.. ఓరుగల్లు కాకతీయుల ఏలుబడి ప్రభావం నిర్మల్ ప్రాంతం పైనా ఉంది. నిర్మల్ కేంద్రంగా పాలించిన రాజులు సైతం చెరువుల తవ్వకాలను ప్రోత్సహించారు. బోరిగాం గ్రామంలోనూ మూడు చెరువులు ఉన్నాయి. ఈ చెరువులే గ్రామంలో ఊటబావులకు అండగా ఉంటున్నాయి. గ్రామానికి ఓ వైపు కొండ ప్రాంతం ఉండటంతో వానాకాలంలో వాటిపై నుంచి వచ్చే నీరు చెరువులలో చేరుతుంది. అలాగే.. సమీపంలో ఎస్సారెస్పీ కెనాల్ కూడా ఉండటంతో భూగర్భ జలాలు అడుగంటకుండా ఉంటున్నాయి. ఊటలకు ఇవి కూడా ఒక కారణమై ఉండొచ్చని గ్రామస్తులు చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండి, చెరువులు నిండని రోజుల్లోనే బావుల్లో కొంత నీటిమట్టం తగ్గుతుందని రైతులు పేర్కొంటున్నారు. అయితే.. ఏనాడూ నీటి సమస్య ఉత్పన్నం కాలేదని చెబుతున్నారు. బావుల్లో చేపలు సైతం.. బోరిగాం గ్రామంలో ఊట బావులను రైతులు సాగుతో పాటు చేపల పెంపకానికి కూడా ఉపయోగించుకుంటున్నారు. తమ చేలల్లో పండిన మొక్కజొన్న తదితర పంట దాణాలనే వేస్తుండటంతో ఖర్చు లేకుండా కొద్దికాలంలోనే చేపలు పెరిగి అదనపు ఆదాయాన్ని ఇస్తున్నాయి. కాగా, బోరిగాంలో మొత్తం వ్యవసాయ సాగు విస్తీర్ణం 594 ఎకరాలు. ఇందులో పత్తి 325 ఎకరాలు, వరి 231 ఎకరాలు, పసుపు 60 ఎకరాలు, సోయా ఐదెకరాలు, కందులు 32 ఎకరాలలో సాగు చేస్తున్నారు. రెండో పంటగా మొక్కజొన్న, గోధుమ, నువ్వులు సాగు చేస్తున్నారు. చాలామంది అంతర పంటలుగా కూరగాయలను సాగు చేస్తున్నారు. కలసికట్టుగా ఉండటం వల్లే.. మా గ్రామంలోని రైతులందరం గతంలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నాం. ఇప్పటి వరకు వ్యవసాయ చేనుల్లో ఒక్క బోరును వేయించలేదు. దీంతోనే ఊట బావులలో పుష్కలంగా నీళ్లు ఉంటున్నాయి. – అమరేశ్వర్, రైతు, బోరిగాం ్ఞఊట బావుల ద్వారానే.. ఏళ్లుగా మా గ్రామంలో ఊటబావుల ద్వారానే సాగు కొనసాగుతోంది. ఇప్పటితరం రైతులమైనా వాటి ద్వారానే సాగు చేస్తున్నాం. మేము కూడా బోర్లు గురించి ఆలోచన ఎప్పుడూ చేయలేదు. – అనిల్, యువ రైతు, బోరిగాం చేపల పెంపకం చేపట్టా.. నాకున్న ఎకరంన్నర భూమిలో పసుపు సాగు చేస్తున్నా. బావిలో నీళ్లు పుష్కలంగా ఉండటంతో చేపల పెంపకం చేపట్టా. చేనులో పండిన మక్కలనే దాణాగా వేస్తున్నా. గత ఏడాది 10 క్వింటాళ్ల వరకు చేపల దిగుబడి వచ్చింది. –శంకర్, రైతు, బోరిగాం -
కందకాల వల్ల కాపు నిలిచింది!
గుడి రామ్నా«ద్ విజయ్‌కుమార్ అనే పండ్ల తోటల రైతు కందకాల ద్వారా వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకింపజేసి తమ పండ్ల తోటకు నీటి భద్రత సాధించుకున్నారు. మామిడి కాపును నిలబెట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కోళ్ల పడకల్ గ్రామ పరిధిలో ఆయనకు 34 ఎకరాల మామిడి, సపోట తోట ఉంది. వర్షాకాలం పోయిన కొద్ది నెలలకే భూగర్భ జలాలు అడుగంటి బోర్లు నోరెళ్లబెడుతున్న నేపధ్యంలో 2016లో కందకాల ద్వారా వాన నీటి సంరక్షణపై దృష్టిపెట్టారు. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం పెద్దలు సంగెం చంద్రమౌళి(98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074)లను సంప్రదించారు. వీరి ఉచిత సాంకేతిక సహకారంతో మీటరు లోతు, మీటరు వెడల్పున పొలంలో వాలుకు అడ్డంగా ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో కందకాలు తవ్వించారు. 2016లో ఒకటి, రెండు వర్షాలే పడ్డాయి. 2017లో మంచి వర్షాలు పడినప్పుడు రెండు, మూడు సార్లు కందకాలన్నీ నిండి, భూమిలోకి వర్షం నీరు బాగా ఇంకింది. మా తోటలో బోర్లు ఈ వేసవిలో కూడా ఒకటిన్నర – రెండంచుల నీరు పోస్తున్నాయి. అయితే, మా చుట్టు పక్కల తోటల్లో బోర్లు ఈ వేసవిలో చాలా వరకు ఎండిపోయాయి. 24 గంటల కరెంటు ఉన్నా మేం రాత్రిపూట బోర్లకు విరామం ఇస్తున్నాం. ఐదు బోర్లలో రెండు బోర్లకు సోలార్ పంపు సెట్లు పెట్టించాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఆగిపోతాయి. రాత్రి పూట బోర్లు రీచార్జ్ కావడానికి విరామం దొరుకుతుంది. అయితే, 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇవ్వడంతో కొందరు రైతులు రాత్రీ పగలూ బోర్లు ఆడిస్తున్నారు. ఇందువల్ల వారి బోర్లు త్వరగా ఎండిపోతున్నాయి. గత నాలుగేళ్లుగా సరిగ్గా నీరు లేని కారణంగా మా మామిడి తోటలో కాపు రాలేదు. ఈ సంవత్సరం కాపు కొంత నిలిచింది. ఖర్చులు చేతికి వచ్చాయి. తోటలకు మనం నీరు పెట్టేది ఒక ఎత్తయితే, భూమిలోకి ఇంకిన వర్షపు నీటి తేమ మరో ఎత్తు. వర్షంలో చెట్టు తడవడం ద్వారా పొందే నీరు ఇంకో ఎత్తు. నీరు లేని షాక్ వల్ల నాలుగేళ్లు పంట నిలవలేదు. కందకాల ప్రభావం వల్ల ఈ ఏడాది మామిడి చెట్లపై కాపు నిలబడిందని విజయ్‌కుమార్(98490 19454) సంతోషంగా తెలిపారు. -
బంగారు కల
కొలిమిగుండ్ల: బంగారంతో తయారు చేసిన పీర్లు బావిలో ఉన్నట్లు ఓ యువకుడికి తరచూ కల వస్తుండటంతో విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. ఒకవేళ అది నిజం కావచ్చేమోనని గ్రామస్తులు బావిలో నీరు తోడుతున్నారు. ఈ వింత ఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం వెనుక భాగంలో పురాతన బావి ఉంది. అందులో బంగారంతో చేసిన చిన్నకాశీం, పెద్ద కాశీం, దస్తగిరిస్వామి పీర్లు ఉన్నాయని గ్రామానికి చెందిన వంశీ అనే యువకుడికి తరచూ కల వస్తోందట! ఆలయం వెనుక భాగంలో వందల ఏళ్ల క్రితం పాత ఊరు (కొత్తకోట అనే గ్రామం) ఉండేది. అక్కడే ఈ పురాతన బావి ఉండటంతో ఆ యువకుడికి వచ్చిన కల నిజం కావచ్చేమోనని గ్రామస్తులు భావిస్తున్నారు. దీంతో వారం రోజుల నుంచి బావి వద్దకు చేరి పీర్ల కోసం అన్వేషిస్తున్నారు. మూడు రోజుల పాటు వరుసగా రాత్రి, పగలూ బావిలోకి దిగి శతవిధాలా ప్రయత్నం చేశారు. నీళ్లు ఎక్కువగా ఉండటంతో బుధవారం రాత్రి నుంచి ఏకధాటిగా డీజిల్ ఇంజిన్ సాయంతో పంపింగ్ చేస్తున్నారు. బావిలో ఊట కారణంగా నీళ్లు తగ్గుముఖం పట్టడం లేదు. -
డ్రిప్ పరికరాలను అమర్చడంలో జాప్యం చేయొద్దు
కర్నూలు(అగ్రికల్చర్): రైతుల పొలాల్లో డ్రిప్ పరికరాలను అమర్చడంలో జాప్యం చేయొద్దని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరక్టర్ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం డ్రిప్ కంపెనీల ప్రతినిధులు, ఎంఐఏలతో నిర్వహించిన సమావేశంలో పీడీ మాట్లాడుతూ... జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వీరిని ఆదుకునేందుకు అడిగిన వెంటనే జిల్లా యంత్రాంగం డ్రిప్ మంజూరు చేస్తుందన్నారు. ఈ ఏడాది 15వేల హెక్టార్లలో డ్రిప్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని ఇచ్చిందని,దీనిని ఈ ఏడాది డిసెంబరు చివరికే సాధించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 1300 హెక్టార్లకు డ్రిప్ మంజూరు చేశామని, వీటిని తక్షణం డ్రిప్ పరికరాలను అమర్చాలని సూచించారు. బావి లేదా బోరు కలిగిన రైతులు డ్రిప్‌ను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రోత్సహించాలని వివరించారు. రెయిన్గన్లను సిద్ధం చేసిన కంపెనీలు సత్వరం టెక్నీషియన్లను నియమించుకుని ఎండుతున్న పంటలకు లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ కింద ఒక తడి నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో ఏపీఎంఐపీ ఏపీడీ మురళీమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మొరాయిస్తున్న మోటార్లు!
నాగయ్య అనే రైతుది దోమకొండ మండలం అంబారీపేట గ్రామం. ఆయనకు మూడెకరాల పొలం ఉంది. బోరుపై ఆధారపడి సేద్యం చేస్తున్నాడు. రెండేళ్లుగా సరైన వర్షాల్లేక ఇబ్బందులు పడ్డ నాగయ్య.. ఇటీవల కురిసిన వర్షాలతో పొలంబాట పట్టాడు. కొంతభాగం నాటు కూడా వేశాడు. అంతలోనే బోరు మోటారు పాడైంది. వెయ్యి రూపాయల వరకు కూలీ చెల్లించి మోటారునుపైకి తీయించాడు. మోటారు వైండింగ్‌తో పాటు బేరింగులు చెడిపోయాయని మెకానిక్ చెప్పడంతో మరమ్మతులు చేయించాడు. మరమ్మతులకు రూ. 3,900 అయ్యాయి. తిరిగి మోటారును బిగించడం, ఇతర ఖర్చులన్నీ కలిపి మరో రూ. వెయ్యి అయ్యాయి. అంటే మోటారు, పంపు బాగుకు పంట సాగు మొదట్లోనే అయిన ఖర్చు రూ. 5,900. మోటారు ఎంత కాలం నడుస్తుందో, నీరు ఎంత పోస్తుందో తెలియదు. ఇది ఒక్క నాగయ్య పరిస్థితే కాదు.. బోర్లపై ఆధారపడ్డ రైతులందరూ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి : రెండేళ్ల కరువుతో అతలాకుతలమైన రైతాంగం ఇటీవల కురిసిన ఓ మోస్తారు వర్షాలతో ఖరీఫ్ సాగుపై ఆశలు పెంచుకున్నారు. దీంతో పొలంబాట పట్టిన రైతులు బోర్లలో నీటి ఊట పెరిగిందేమోనని మోటార్లను ఆన్ చేస్తే అవి మొరాయిస్తున్నాయి. దీంతో మోటార్లను పైకి తీసి మరమ్మతులు చేయించాల్సి వస్తోంది. జిల్లాలో లక్షా 45 వేల బోరుబావులు ఉన్నాయి. అనధికారికంగా మరో ఇరవై వేల దాకా ఉంటాయి. అయితే చాలా ప్రాంతాల్లో గత రెండుమూడేళ్లుగా సరైన వర్షాలు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు మూలనపడ్డాయి. అప్పటి నుంచి బోరు మోటార ్లను నడిపించలేకపోయారు. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలతో కొంతమేర బోర్లు పోసే అవకాశం ఉండడంతో రైతులు బోర్లను స్టార్ట్ చేయడం, అవి మొరాయిస్తుండడంతో మరమ్మతుల కోసం మెకానిక్‌లను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో మోటారు మరమ్మతుకు రూ. 5 వేల పైనే చాలా కాలంగా నీళ్లు లేక బోర్లలోనే ఉన్న బోరు మోటారు, పంపులను పైకి తీయడానికి గాను తక్కువలో తక్కువ రూ. వెయ్యి వరకు ఖర్చు చేస్తున్నారు. మోటారు వైండింగ్, పంపులో బేరింగులు, ఇతర మరమ్మతులు, అలాగే స్టార్టర్ బాక్సుల మరమ్మతులకు మరో రూ. 4 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు తెలిపారు. మెకానిక్ షెడ్ల వద్దకు నిత్యం పదుల సంఖ్యలో మోటార్లు మరమ్మతుల కోసం వస్తుండడంతో మెకానిక్‌లు రాత్రింబవళ్లు మరమ్మతు పనులు చేస్తున్నారు. -
పశువులకూ పైసల నీళ్లు
♦ బోరు అద్దెకు తీసుకున్న రైతులు ♦ నిత్యం తాగు నీటిని అందిస్తున్న వైనం ♦ మల్కాపూర్ గిరిజనుల వినూత్న ఆలోచన ఈ వింతను ఏనాడైన చూశారా?, నీటిని కొనుగోలు చేసి పశువుల దాహం తీర్చే రోజులొస్తాయని ఎవరైనా ఊహించారా?, ఇక్కడ అలాంటి పరిస్థితే నెలకొంది. పశువుల దాహార్తి తీర్చేందుకు గిరిపుత్రులు నీళ్లను కొంటున్నారు. ఇంటింటికీ డబ్బులు పోగుచేసుకుని ఓ బోరు అద్దెకు తీసుకున్నారు. నిత్యం మూగ జీవాలకు నీటిని అందిస్తూ ఊపిరి పీల్చుకుంటున్నారు. మెదక్: మెదక్ మండలం రాయిన్‌పల్లి పంచాయతీ పరిధి మల్కాపూర్ గిరిజన తండాలో ఇరవైకిపైగా గిరిజన కుటుంబాలున్నాయి. వీరందరికీ వ్యవసాయమే ఆధారం. పాడి పశువులతో వీరికి యేళ్లతరబడి బంధం పెనవేసుకుంది. ఒక్కో ఇంటికి 20 నుంచి 50 వరకు పశువులు ఉండగా, గొర్రెలు, మేకలు సైతం భారీగానే ఉన్నాయి. రెండేళ్లుగా కరువు నెలకొనడంతో గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటాయి. బోరుబావులన్నీ మూలనపడ్డాయి. మనుషులతోపాటు మూగ జీవాలకు సైతం తాగునీటి కష్టం ఏర్పడింది. మనుషులకు దాహమేస్తే ఎలాగోలా తిప్పలు పడి ఏదో ఒకటి తాగుతాడు. మరీ మూగజీవాల పరిస్థితి?. దాహమేసినా... ఆకలేసినా.. అమాయక చూపులు... ఆవేదనతో చూడటం తప్ప మరేం చేయగలవు. దీంతో తండాలోని గిరిజనులంతా ఓ ఆలోచన చేశారు. ఇంటింటికి డబ్బులు వేసుకుని తండా సమీపంలోని ఓ రైతు బోరును రూ.10 వేలకు అద్దెకు తీసుకున్నారు. వర్షాలు పడేంత వరకు తమ పశువులకు తాగునీరివ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. జేసీబీ గుంతలో బోరునీటిని నిల్వ చేసుకుని మూగజీవాల దప్పిక తీరుస్తున్నారు. -
బోర్ల పేరిట ఘరానా మోసం
* కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో దందా * ముఠాలో నలుగురి అరెస్టు, ఐదుగురు పరారీ హుస్నాబాద్ రూరల్: రూ.33 వేలు చెల్లిస్తే బోరువేసి మోటారు ఉచితంగా ఇస్తామని నమ్మబలికిన ఓ ముఠా మూడు జిల్లాల్లో 250 మంది రైతుల వద్ద సుమారు రూ.75 లక్షలు దండుకుంది. చివరికి బోర్లు వేయకుండా తప్పించుకొని తిరుగుతున్న ముఠా సభ్యుల్లో కొందరిని కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను హుస్నాబాద్ సీఐ దాసరి భూమయ్య శనివారం విలేకరులకు వివరించారు. కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్‌కు చెందిన అంబాల ప్రసాద్ ఆధ్వర్యంలో 9 మంది ముఠాగా ఏర్పడ్డారు. లైవ్ మినిస్టీయల్ జీవజలం స్కీమ్ పేరిట రైతులు రూ. 33 వేలు చెల్లిస్తే బోరు వేసి, మోటారు ఉచితంగా ఇస్తామంటూ ప్రచారం చేశారు. మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కలిసి సుమారు 250 మంది రైతుల వద్ద రూ.75 లక్షలు మేర దండుకున్నారు. కొంతమంది రైతులకు బోర్లు వేసి అదనంగా రూ.3 వేలు వసూలు చేశారు. హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌కు చెందిన మిట్టపెల్లి సంపత్, బోర్వెల్ ఏజెంట్ యూదగిరితోపాటు మిరుదొడ్డి మండలం అల్వాల్‌కు చెందిన 30 మంది రైతులు వీరిపై హుస్నాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన బోయిని కుమార్ అలియాస్ ప్రసన్నకుమార్, హుస్నాబాద్‌కు చెందిన చిలుముల మాలాకి, జేరిపోతుల భరత్ అలియాస్ లడ్డు, హుస్నాబాద్ మండలం జనగామకు చెందిన కత్తుల మురళి అలియాస్ మోజెస్లను అదుపులోకి తీసుకున్నారు. ముఠాలోని ముఖ్యుడు అంబాల ప్రసాద్‌తోపాటు చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన శనిగరం శ్రీనివాస్, వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన కొలిమేర బాబు, హన్మకొండకు చెందిన తిరుపతి, సిరిసిల్లకు చెందిన ముక్కెర ప్రభాకర్ పరారీలో ఉన్నారని తెలిపారు.కాగా, లైవ్ మినిస్టీయల్ జీవజలం సంస్థకు చెందిన పాస్టర్లని చెబితే నమ్మానని రూ.2 కమీషన్‌కు బోర్వెల్ యంత్రాన్ని కిరాయికి తెచ్చి 101 బోర్లు వేశానని యాదగిరి చెప్పారు. -
బోరుబావిలో పడిన చిన్నారి శాన్వీ మృతి
నల్గోండ : సోమవారం బోరుబావి లో పడిన చిన్నారి శాన్వీ మృతి . శాలీగౌరారం మండలం వల్లలకు చేందిన స్వామి , సుస్మిత ల కుమార్తె అయిన శాన్వీ నిన్న(సోమవరం) మధ్యాహ్నం ఆడుకుంటు బోరుబావి లో పడిన చిన్నారి శాన్వీ .12 గంటలపాటు శ్రమించి శాన్వీని బయటకు తీసిన అధికారులు, అప్పటికే చిన్నారి శాన్వీ మృతి చేందింది అని వైద్యుల నిర్ధారణ, నకిరేకల్ ఆస్పుత్రికి చిన్నారి శాన్వీ మృతదేహం తరలింపు. వీరి స్వస్థలం నల్గోండ మండలం ద్వీపకుంట గ్రామం . -
బోరు వేయనీయడం లేదని..
తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం నేరేడుచర్ల: తన పొలంలో బోరు వేయనీయడం లేదని మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా నేరేడుచర్ల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని రాంపురం గ్రామానికి చెందిన హరిబాబు తనకున్న 20 కుంటల పొలంలో వాగును ఆధారం చేసుకొని వరి సాగుచేశాడు. వర్షాభావ పరిస్థితులకు వాగు ఎండిపోవడంతో వరి పొలానికి నీరందడం లేదు. దీంతో హరిబాబు బోరు వేయించేందుకు నిర్ణయించాడు. ఈ క్రమంలో బోరు బండిని పొలం వద్దకు తీసుకెళ్లాడు. అయితే, సర్పంచ్ చింతమల్ల సైదులు సూచన మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ దేవయ్య బోరు వేయవద్దని ఆదేశాలు జారీ చేశాడు. దీంతో మనస్తాపానికి గురై తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న హరిబాబు.. డిప్యూటీ తహసీల్దార్ కృష్ణను నిలదీశాడు. ఆయన సమాధానం చెప్పకపోవడంతో తన చేతిలో ఉన్న పురుగుమందు డబ్బా మూత తీసి తాగేందుకు యత్నించగా.. అక్కడే ఉన్న కొందరు రైతులు అడ్డుకున్నారు. అనంతరం రైతులు డిప్యూటీ తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని రైతులను శాంతింప చేశారు. -
బోరు వేసేంతవరకు ఇక్కడే ఉంటా..
వేంపల్లె : ‘అలవలపాడు దళితవాడలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. బోరు వేస్తూ మధ్యలో ఆపేశారు. ఇలాగైతే ఎలా? ఇప్పుడు ఇక్కడ బోరు బావి తవ్వి నీటిని పైకి రప్పించే వరకు ఇక్కడే ఉంటా. అప్పటిదాకా అన్నం, నీళ్లు ముట్టను’ అంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దళితులతో కలిసి బైఠాయించారు. వేంపల్లె మండలం అలవలపాడులో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నిధులతో రూ.2.50 లక్షలతో అలవలపాడు హరిజనవాడకు తాగునీరు అందించేందుకు నిధులు మంజూరయ్యాయి. ఈనెల 1న గ్రామ శివారులో ఉన్న వంకపొరంబోకు స్థలంలో ఎంపీటీసీ సభ్యుడు గజ్జెల రామిరెడ్డి బోరు తవ్వించడం ప్రారంభించారు. 325 అడుగులు వేసిన తర్వాత.. సమీపంలో ఉన్న బోర్లలో నీరు అడుగంటుతాయని కొందరు ఫిర్యాదు చేశారని తహశీల్దార్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు వేంపల్లె ఎస్ఐ హాసం పనులు ఆపేశారు. దళితవాడలో నీటి సమస్య తీవ్రతరమవడంతో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తహశీల్దార్ శ్రీనివాస్, ఎస్ఈ శ్రీనివాసులు మాట్లాడారు. బోరు బావి తవ్వకాన్ని కొనసాగించాలని కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం బోరు బండి అక్కడికి వెళ్లగానే పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వివేకా.. ఉదయం 10 గంటలకు ఆ గ్రామానికి చేరుకున్నారు. బోరు తవ్వకం పూర్తి అయ్యే వరకు తాను ఇక్కడి నుంచి కదలనని, అన్నం, నీళ్లు ముట్టనని చెప్పి బైఠాయించారు. స్థానిక అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి బోరు తవ్వకం పూర్తి చేశారు. నీళ్లు పైకి రాగానే వివేకా.. ఓ బాటిల్లో పట్టుకుని తాగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వివేకా చొరవ వల్ల నీటి సమస్య తీరిందని దళితవాడ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, శుక్రవారం సాయంత్రం.. సాంకేతిక అనుమతులు, వర్క్ ఆర్డర్ లేకుండా వేశారనే కారణంతో ఆర్‌డబ్ల్యుఎస్ డీఈ మోహన్, ఏఈ మధుసూదన్, ఆర్ఐ సుధీర్‌లు బోరును సీజ్ చేశారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో పులివెందుల సీఐ మహేశ్వరరెడ్డి నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
గ్రౌండ్ రిపోర్ట్ : బోరు.. కన్నీరు..!
-
మృత్యుంజయురాలు
బోరు బావి నుంచి బయటపడ్డ బాలిక పుత్తూరు: బోరు బావిలో పడిపోయిన ముడేళ్ల చిన్నారి అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడింది. ఈ సంఘటన పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరాజకుప్పం ఆది ఆంధ్రవాడలో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు చిన్నరాజకుప్పానికి చెందిన ఎల్లప్పరెడ్డి రెండు రోజుల క్రితం పొలంలో బోరు బావి తవ్వాడు. దానిపై గోనెసంచి (మూతగా) చుట్టి ఉంచాడు. ముగ్గుపిండి కోసం చిన్నరాజకుప్పం ఆది ఆంధ్రవాడకు చెందిన సునీత కూతురు బన్నీ(3)ని వెంట పెట్టుకుని ఆ బావి వద్దకు వెళ్లింది. ఆమె ముగ్గుపిండి సేకరణకు పూనుకుంది. పక్కనే ఆడుకుంటున్న బన్నీ ఆ బోరుబావికున్న గోనె సంచిని తీసింది. కాలుజారి అందులో పడిపోయింది. వెంటనే గమనించిన తల్లి కేకలు వేసింది. సమీపంలోని గ్రామస్తులు అక్కడి కి చేరుకున్నారు. ఓ తాడును బోరు బావిలోకి వదిలారు. సుమారు 20 అడుగుల లోతులో ఇరుక్కున్న బన్నీ ఆ తాడును పట్టుకోగా గ్రామస్తులు సురక్షితంగా బయటకుతీశారు. ఆ బాలిక శరీరంపై స్వల్ప గాయూలయ్యూరుు. చికిత్స నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలిక సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. -
పాతాళంలో జలం!
కీసరకు చెందిన దాగిళ్లపురం రాజు తాగునీటి బోరు తవ్వించాలని నిర్ణయించుకున్నాడు. నాలుగైదు వందల అడుగులైనా సరే.. నీళ్లు వస్తే చాలనుకొని రంగంలోకి దిగాడు. గత వారం ఐదువందల అడుగుల లోతువరకు బోరు వేయించినా ప్రయోజనం లేదు. ధైర్యం చేసి మరో 500 అడుగుల లోతువరకు డ్రిల్ వేయించాడు. కానీ ఫలితం శూన్యం. ఇంట్లో నీటిసమస్యను తట్టుకోలేక మరికొంత ధైర్యం చేసిన రాజు.. మరో వంద ఫీట్లలోతు వరకు డ్రిల్ చేయించాడు. రాతి పొగ తప్ప.. చుక్కనీరు కూడా రాలేదు. ఇప్పటికే రూ.1.60లక్షలు ఒడిసిపోవడంతో చేసేదేమీ లేక బోరువేసే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. తాగునీటికి కటకట ఉన్న మన జిల్లాలో వెయ్యి అడుగుల లోతులో కూడా చుక్క నీరు దొరకని పరిస్థితికి నిదర్శనమిది. జిల్లాలో భారీగా పతనమైన భూగర్భ నీటిమట్టం సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో నీటి సమస్య ఊగ్రరూపం దాల్చింది. తాగునీటితోపాటు నిత్యవసరాలకు వాడుకునే నీటికి సైతం తీవ్ర కటకట వచ్చింది. వేసవి సీజన్ సమీపించకముందే జిల్లాలోని అన్ని మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు తలెత్తడం జిల్లా ప్రజానికాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సగటున ఐదు అడుగులు పతనం మండలంలో లోతట్టు ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుని అక్కడ భూగర్భ జలశాఖ వేసిన బోరులో నీటి పరిస్థితిని పరిశీలించి భూగర్భజలాల పరిస్థితిని అంచనా వేస్తోంది. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పద్ధతితో స్పష్టత రానప్పటికీ.. అధికారులు మాత్రం దీన్నే కొనసాగిస్తున్నారు. ఇటీవల జిల్లా భూగర్భజల శాఖ అధికారులు మండలాల వారీగా నీటిమట్టాలను ప్రకటించారు. 2013-14 పరిస్థితిని పరిశీలిస్తూ.. తాజాగా 2014-15 సంవత్సరంలో నమోైదె న వివరాలను పోలిస్తే భారీగా తగ్గుదల కనిపిస్తోంది. జిల్లాలో సగటున ఐదు అడుగుల లోతుకు నీటిమట్టం పడిపోయినట్లు అధికారులు గణాంకాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇదీ.. * జిల్లాలో అత్యధికంగా కీసర మండలంలో భూగర్భ జలాలు పడిపోయాయి. అయితే ఇక్కడ ఎంతమేర నీటి మట్టం పడిపోయిందనేది అధికావర్గాలు సైతం చెప్పలేకపోవడం గమనార్హం. * బంట్వారం మండలంలో ఏకంగా 19 అడుగులలోతుకు నీటిమట్టం పతనమైంది. * గండేడ్, మల్కాజిగిరి మండలాల్లో 11 అడుగుల లోతుకు భూగర్భజలాలు పతనమయ్యాయి. ఇక్కడ 25అడుగుల లోతులో నీరు లభ్యమవుతున్నట్లు అధికారులు నివేదికలు చెబుతున్నాయి. * పెద్దేముల్, బాలానగర్, మర్పల్లి, మహేశ్వరం తదితర మండలాల్లోనూ నీటిమట్టాలు భారీగా పడిపోయాయి. * పలుమండలాల్లో భూగర్భ జలాల పరిస్థితి పతనమవ్వడం, వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో మరింత ఒత్తిడి పెరగడంతో భూగర్భజలాల పరిస్థితి ఆందోళనకంగా మరే అవకాశం ఉంది. దీంతో కలుషితనీటితో అనర్థాలు జరవచ్చని పర్యవరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భజలాల వాడకాన్ని అరికట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుంటే భవిష్యత్తు ఉండదని హెచ్చరిస్తున్నారు. -
మృత్యువును జయించిన బాలిక
బోరుబావిలో పడ్డ చిన్నారి రెండున్నర గంటల తర్వాత బయటకు.. పరిగి/ కుల్కచర్ల: రంగారెడ్డి జిల్లాలోని గండేడ్ మండల పరిధిలో బోరుబావిలో పడిన ఓ చిన్నారిని రెండున్నర గంటల పాటు సహాయక చర్యలు చేపట్టి క్షేమంగా బయటికి తీసుకువచ్చారు. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గీ మండలంలోని ముదిరెడ్డిపల్లి తండాకు చెందిన లక్ష్మణ్, బుజ్జిబాయిలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నాయి. ఇందులో బతుకుదెరువు కోసం లక్ష్మణ్ దుబాయికి వెళ్లగా.. బుజ్జి పుణెలో పనిచేస్తోంది. ఇద్దరు కుమారులు ముదిరెడ్డిపల్లిలోనే ఉండి చదువుకుంటున్నారు. కుమార్తెలు నందిని అలియాస్ అంజలి(6), బుజ్జిలు చిన్నవారు కావడంతో అమ్మమ్మగారి ఊరైన గోవిందుపల్లితండాలో అమ్మమ్మ సీతాబాయి, తాతా భోజ్యానాయక్ల వద్ద ఉంటున్నారు. మంగళవారం సీతాబాయి, భోజ్యానాయక్‌లు తండా సమీపంలోని పొలానికి పనికి వెళ్లారు. నందిని కూడా వారితోపాటే వెళ్లింది. అక్కడే ఉన్న బాలిక సాయంత్రం వేళ కనిపించకపోవడంతో ఇంటికి వెళ్లిందని భావించారు. అయితే, ఇంటికీ రాకపోవడంతో వెతుక్కుంటూ మళ్లీ పొలానికి వెళ్లారు. అక్కడ బోరుబావిలోంచి శబ్దాలు రావడంతో గమనించగా, అందులో చిన్నారి పడిపోయినట్లు స్పష్టమైంది. ఆ బోరుబావి పూడ్చినా 10 ఫీట్ల మేరకు అలాగే వదిలేయడంతో చిన్నారి అక్కడ ఉన్నట్లు భావించారు. గ్రామసర్పంచ్ వెంటనే పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారమందించగా, వారు రావడంతో పాటు జేసీబీని రప్పించారు. 108 సిబ్బంది బోరుబావిలో చిన్నారికి ఆక్సిజన్ అందించారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో బోరుబావికి సమాంతరంగా జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో చిన్నారిని క్షేమంగా బయటికి తీశారు. అనంతరం ఆమెను 108 అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
అయ్యో.. గిరిజ!
కళ్ల ఎదుటే బోరు బావిలో పడిన చిన్నారి ఆడుతూ.. పాడుతూ..అంతలోనే విషాదం! రంగారెడ్డి జిల్లా మంచాలలో ఘటన మంచాల: నాలుగేళ్ల చిన్నారి బోరుబావిలో పడిన విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో చోటు చేసుకుంది. గిరిజ అనే బాలిక ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లింది. అమ్మమ్మ, చిన్నమ్మలు పొలం పనుల్లో ఉండగా...గిరిజ ఆడుకుంటూ ముందుకు వెళ్లి తెరిచి ఉన్న బోరు బావిలో పడిపోయింది. విషయం గమనించిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా...ఏసీపీ రాములు తన సిబ్బందితో హుటాహుటిన తరలివచ్చారు. జేసీబీలు సాయంతో బోరుచుట్టూ గుంతలు తవ్వారు. అయినా ఫలితం లేకపోయింది. బోరు 320 అడుగుల లోతుండగా...చిన్నారి దాదాపు 45 అడుగుల లోతులో పడినట్లు గమనించారు. అక్కడ నీరున్నట్లుగా గుర్తించారు. రెండు జేసీబీలతో పనులు వేగవంతం కాకపోవడంతో మరో రెండు జేసీబీలను తీసుకువచ్చారు. పరిస్థితిని గమనించి ఉన్నతాధికారులతో మాట్లాడారు. పాపను రక్షించేందుకు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం 1.15కు కలెక్టర్ శ్రీధర్‌తోపాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి వచ్చారు. దాదాపు రెండున్నర గంటలకుపైగా అక్కడే ఉండి పనులు పర్యవేక్షించారు. బోరు బావిలోంచి పాపను కాపాడేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. సాయంత్రం కావడంతో మరో రెండు హిటాచీలు తీసుకొని వచ్చి పనులు వేగవంతం చేశారు. సాయంత్రం ఆరు గంటలు గడిచినా ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. బాలిక పరిస్థితి గురించి తెలియరాలేదు. -
కాటేసిన కరెంట్ తీగలు
విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి దేవనకొండ: పొలంలో విద్యుత్ మోటారుకు మరమ్మతులు చేసేందుకు వెళ్లి ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన గురువారం ఐరన్ బండ సెంటర్లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు రాజు తనకున్న పొలంలో వ్యవసాయ బోరు చెడిపోవడంతో విద్యుత్ మోటార్‌ను పైకి తీసి మరమ్మతులు చేయిస్తున్నాడు. ఇందులో భాగంగా బోరులో పైపులను దింపే పనులు చేస్తున్నారు. విద్యుత్ మోటార్‌ను రెండు ఇంచుల పైపులకు కింది భాగాన అమర్చి బోరులోనికి దింపడం మొదలు పెట్టారు. దాదాపు నాలుగు పైపులను బోరులోనికి దించేశారు. వారు ఇలా చేస్తున్న సమయంలో పైపులకు పైభాగాన విద్యుత్ తీగలు(11 కేవీఏ విద్యుత్ తీగలు) వెళ్లిన విషయాన్ని గమనించలేకపోయారు. దీంతో వారు దించుతున్న ఇనుప పైపులు ఒక్కసారిగా ఈ తీగలను తాకాయి (పైపులు 14 అడుగుల పైభాగంలో ఉన్నాయి). దీంతో పైపులను గట్టిగా పట్టుకున్న వారు ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయారు. ఈ ఘటనలో మెకానిక్ దస్తగిరి, పొలం యజమాని రైతు రాజు, కూలీ పనికి వచ్చిన వడ్డే సుంకన్న అక్కడిక్కడే మృతిచెందారు. మిగతా కూలీలైన నాగరాజు, షఫీ, రామాంజనేయులు, రామదాసు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో ముగ్గురు చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు మిన్నంటాయి. పొలం యజమాని రైతు రాజు ఈ మధ్యనే ఉల్లి గడ్డలను అతి తక్కువ ధర (క్వింటం రూ.500)కు అమ్మి తీవ్ర బాధలో ఉన్నాడు. ఎలాగైనా విద్యుత్ మోటార్‌కు మరమ్మతులు చేయించి ఈసారైనా వేరుశనగను పండించి అప్పుల నుంచి గట్టెక్కాలనుకున్నాడు. అంతలోనే ఆయనను కరెంట్ రూపంలో మృత్యువు కబళించింది. మృతిచెందిన మెకానిక్ దస్తగిరి, రైతు రాజు, కూలీ పనికొచ్చిన వడ్డే సుంకన్నలకు ముగ్గురు చొప్పున సంతానం. విషయం తెలుసుకున్న దేవనకొండ ఎస్ఐ మోహన్‌కిషోర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. మృతులను దేవనకొండ విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయాన్ని అందజేస్తామని వారి కుటుంబ సభ్యులకు తెలపారు. గ్రామంలో ఒకేసారి ముగ్గురు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఆరేళ్లకే.. నూరేళ్లు
సోమవారం తెల్లవారుజామున తిమ్మన్న మృతదేహం వెలికితీత పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగింత దుఃఖ సాగరంలో సూళికేరి అశ్రు నయనాలతో తుది వీడ్కోలు రక్షా బంధన్ రోజే దహన సంస్కారాలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బాగలకోటె జిల్లా సూళికేరిలో బోరు బావిలో పడి మరణించిన ఆరేళ్ల తిమ్మన్నకు సోమవారం తొలి జాములో అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అంతకు ముందు అత్యంత శక్తివంతమైన సక్షన్ మెషిన్, ఎయిర్ కంప్రెసర్లను ఉపయోగించి 172 అడుగుల లోతులో ఉన్న శవాన్ని వెలికి తీశారు. మరణానికి కారణాలు తెలుసుకోవడానికి విధిగా పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉన్నందున, మృతదేహాన్ని వెలికి తీయాల్సిందేనన్న రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ సూచించారు. ఆ మేరకు ఆదివారం మధ్యాహ్నం నుంచే మృత దేహాన్ని వెలికి తీసే పనులు చేపట్టారు. సాయంత్రం వర్షం పడడంతో కాసేపు పనులు ఆపివేశారు. అనంతరం తెల్లవారుజామున రెండు గంటలకు మృతదేహాన్ని వెలికి తీశారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం చిన్న గాజు పెట్టెలో మృతదేహాన్ని ఉంచి బంధువులకు అప్పగించారు. నిర్జీవంగా ఉన్న తిమ్మన్నను చూడగానే తల్లిదండ్రులు, బంధువుల ఆక్రందనలు మిన్నంటాయి రెండున్నర గంటలకు దహన సంస్కారాలు నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్ఆర్ పాటిల్, ఎమ్మెల్యేలు హెచ్‌వై మేటి, జీటీ పాటిల్, జిల్లా కలెక్టర్ మేఘన్ననవర్, ఇతర జిల్లా అధికారులు ఆ సమయంలో అక్కడే ఉన్నారు. తుమకూరు జిల్లాలోని శిరాకు చెందిన ప్రజా పనుల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ దొడ్డ రంగయ్య నాయకత్వంలో సక్షన్ మెషిన్, ఎయిర్ కంప్రెసర్లను వినియోగించారు. ఏటా రక్షా బంధన్ రోజు తిమ్మన్నకు రాఖీలు కట్టే అక్క చెల్లెళ్లు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. అదే రోజు అతని అంత్య సంస్కారాలు నిర్వహించాల్సి రావడంతో సూళికేరిలో విషాయ ఛాయలు అలుముకున్నాయి. ఈ నెల మూడో తేదీన మధ్యాహ్నం తమ బంధువులకు విఫలమైన బోరును చూపించబోయిన తిమ్మన్న ప్రమాదవశాత్తు అందులో పడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆరు రోజుల పాటు అతనిని వెలికి తీయడానికి 500 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జిల్లా సర్జన్ అనంత రెడ్డి గత బుధవారం బోరు నుంచి దుర్వాసన వస్తున్నందున, తిమ్మన్న మరణించినట్లు నిర్ధారించారు. అంతకు ముందు నుంచే సహాయక చర్యలను నిలిపి వేయాల్సిందిగా బాలుని తండ్రి హనుమంతప్ప అధికారులకు విజ్ఞప్తి చేశారు. తన కుమారుడు ఎలాగూ బతికి ఉండడు కనుక, పొలమైనా తనకు దక్కేట్లు చూడాలని విన్నవించాడు. సహాయక చర్యల వల్ల తమ భూములు కూడా నాశనమవుతున్నాయని పక్క పొలాల రైతులు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు సహాయక చర్యల్లో భాగంగా బోరుకు సమాంతరంగా తవ్వుతున్న గుంతలో బురద మట్టి రావడంతో సిబ్బంది ఆందోళన చెందారు. ఉన్నట్లుండి గుంత పూడుకు పోవచ్చని, తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని భయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన జరిగిన అధికారుల సమావేశంలో పనులను నిలిపి వేయాలని శనివారం నిర్ణయించారు. ఆ గుంతతో పాటు బోరు బావిని పూడ్చే పనులను కూడా సోమవారం చేపట్టారు. -
ఆరిన దీపం?
తిరిగి రాని లోకాలకు తిమ్మన్న బోరు బావి నుంచి దుర్వాసన మృతదేహం వెలికితీతకు సాగుతున్న పనులు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం : మంత్రి పాటిల్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రార్థనలు ఫలించలేదు. దేవుడు కరుణించలేదు. అతని ఆయుష్షు అంతేనని తేల్చేశాడు. బాగలకోటె జిల్లా సూళికేరి వద్ద గత ఆదివారం బోరు బావిలో పడిపోయిన ఆరేళ్ల తిమ్మన్న అటు నుంచి అటే...తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ప్రాణాలతో అతనిని బయటకు తీసుకు రావడానికి చేపట్టిన సహాయక చర్యలు...ఇప్పుడు మృతదేహాన్ని వెలికి తీయడానికి కొనసాగుతున్నాయి. మధ్య మధ్యలో అవాంతరాలతో 88 గంటల పాటు ఏకబిగిన సహాయక చర్యలు సాగాయి. ‘బాలుడు బోరు బావిలో పడిపోయి ఎనభై గంటలకు పైగా గడిచిపోయాయి. కనుక అతను చనిపోయి ఉండవచ్చు. బోరు బావి నుంచి దుర్వాసన వస్తోంది’ అని జిల్లా సర్జన్ అనంత రెడ్డి బుధవారం రాత్రి బాగా పొద్దు పోయాక సంఘటనా స్థలం వద్ద ప్రకటించారు. అంతే...చాలా సేపు అక్కడ అయోమయం నెలకొంది. రోబో ద్వారా బాలుని వెలికి తీయడానికి మధురై నుంచి వచ్చిన మణికంఠన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాసేపటికే వర్షం ప్రారంభమైంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వర్షం కొద్దిగా తగ్గిన తర్వాత వైదుృల బందం అక్కడికి చేరుకుంది. బోరు బావి నుంచి కుళ్లిన వాసన వస్తుండడంతో బాలుడు బతికి ఉండడృని బందం నిర్ధారించింది. శోక సంద్రంలో కుటుంబం తిమ్మన్న మరణించి ఉంటాడని వైద్యులు తేల్చడంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటు బిడ్డను పోగొట్టుకుని, అటు భర్త ఆస్పత్రి పాలవడాన్ని తలుచుకుని తిమ్మన్న తల్లి సంగవ్వ బోరున విలపించింది. నాలుగు రోజులుగా ఆమె నిద్రాహారాలు మానుకుని బిడ్డ కోసం విలపిస్తూ కూర్చుంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. తీవ్ర అస్వస్థతకు లోనైన తిమ్మన్న తండ్రి హనుమంతప్ప ఆస్పత్రిలో కోలుకుంటున్న సంగతి తెలిసిందే. మృతదేహం వెలికితీతకు ప్రయత్నాలు తిమ్మన్న మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రోబో ద్వారా వెలికి తీయాలంటే ముందుగా బోరు బావిలో పడిన మట్టిని తొలగించాల్సి ఉంది. శవంపై ఒకటిన్నర అడుగుల మట్టి ఉండవచ్చని అంచనా. రెండు వాక్యూమ్ సక్కర్ల ద్వారా మట్టిని తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మట్టిని తొలగిస్తేనే రోబో ద్వారా మృతదేహాన్ని వెలికి తీయడం సాధ్యమవుతుంది. సమాంతరంగా తవ్వుతున్న సొరంగ మార్గం ద్వారా బయటకు తీయాలంటే మరో రెండు రోజులు పట్టే అవకాశాలున్నాయి. హనుమంతప్పను ఆదుకుంటాం తిమ్మన్నను వెలికి తీయడానికి చేసిన ప్రయత్నాల్లో అతని తండ్రికి జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని పంచాయతీ రాజ్, గ్రామీణృభివద్ధి శాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్ తెలిపారు. గురువారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ పొలంలో తవ్విన సొరంగ మార్గాలను ప్రభుత్వమే పూడ్చి వేస్తుందని చెప్పారు. కాగా తిమ్మన్న కుటుంబానికి ప్రభుత్వం ఇదివరకే రూ.2 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించింది. స్థానిక ఎమ్మెల్యేలు తలా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. -
మృత్యుంజయుడు
పరవాడ: ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన ఓ చిన్నారి ఒక రైతు సమయస్ఫూర్తిగా వ్యవహరించటంతో మృత్యుంజయుడయ్యాడు. విశాఖ జిల్లా పరవాడ మండలం నాయుడుపాలెం శివారు పాతరాజానపాలెంలో సోమవారం ఈ ఘటన జరిగింది. తల్లితో పాటు అమ్మమ్మ ఇంటికి వచ్చిన దీప్ (2) సరుగుడు తోట వద్దకు వెళ్లిన అమ్మమ్మ నేస్తాలమ్మను చూసి అక్కడికి వెళ్లాడు. ఆడుకుంటూ వ్యవసాయ బోరు బావిలోకి జారిపోయి 20 అడుగుల లోతుకు వెళ్లిపోయాడు. దీన్ని గమనించిన నేస్తాలమ్మ కేకలు వేసింది. అక్కడే ఉన్న రైతు మండల అప్పలనాయుడు పరుగున వచ్చి బోరు బావిలో పడిన దీప్‌ను తాడు సాయంతో చాకచక్యంగా బయటకు లాగి రక్షించాడు. దీంతో అతడ్ని అంతా అభినందించారు. చిన్నారి అమ్మానాన్న లక్ష్మి, నరసింగరావు సంతోషించారు.