బిందు సేద్యంపై సాంకేతిక శిక్షణ | Technical training on drip irrigation | Sakshi
Sakshi News home page

బిందు సేద్యంపై సాంకేతిక శిక్షణ

Published Tue, Jul 11 2017 10:52 PM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

Technical training on drip irrigation

అనంతపురం అగ్రికల్చర్‌: బిందు సేద్యంపై సాంకేతిక శిక్షణ కార్యక్రమం మంగళవారం స్థానిక పంగల్‌రోడ్డులోని టీటీడీసీలో ప్రారంభమైంది. నెటాఫిమ్‌ డ్రిప్‌ కంపెనీ, ఏపీఎంఐపీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 30 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. 25 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో మొదటి ఐదు రోజులు టీటీడీసీలో మిగతా 20 రోజులు పొలాల్లో ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించనున్నట్లు ఏపీఎంఐపీ ప్రాజెక్టు ఆఫీసర్‌ (పీఓ) ఏ.సూర్యప్రకాష్‌ తెలిపారు.

డ్రిప్‌ యూనిట్ల మన్నిక, విడిభాగాలు, వాటి పనితీరు, ఫర్టిగేషన్, యాసిడ్‌ ట్రీట్‌మెంట్‌ (ఆమ్లచికిత్స) తదితర అన్ని రకాల సాంకేతిక అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీలు ఆర్‌.విజయశంకరరెడ్డి, జి.చంద్రశేఖర్, ఎంఐడీసీ సత్యనారాయణమూర్తి, నెటాఫిమ్‌ అగ్రానమిస్టు సుబ్బారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement